ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చీఫ్ విప్గా అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు నియమితులయ్యారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చీఫ్ విప్గా అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు నియమితులయ్యారు. విప్లుగా తెలుగుదేశం ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, కూన రవి కుమార్, యామిని బాల, మేడ మల్లికార్జున రెడ్డిలను నియమించారు.
కాల్వ శ్రీనివాసులుకు మంత్రి పదవి లేదా డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తారని గతంలో వార్తలు వినిపించినా అవకాశం రాలేదు. టీడీడీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చీఫ్ విప్ పదవికి కాల్వ పేరును ఎంపిక చేశారు.