chief vip
-
‘నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది’
సాక్షి, కృష్ణా : జగ్గయ్యపేట మండలం రావిరాల, వేదాద్రి గ్రామాలలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను సోమవారం పర్యటించారు. వరదల వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ఆయనతో పాటు నాయకులు వేల్పుల రవికుమార్, రవిశంకర్, తుమ్మల ప్రభాకర్ ఉన్నారు. -
గతానికి భిన్నంగా అసెంబ్లీ సమావేశాలు
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనను చూసి తాము గర్వపడుతున్నామని చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం స్పీకర్ తమ్మినేని సీతారామ్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. సమావేశం ముగిసిన అనంతరం శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ...టీడీపీ గతంలో తమ అంశాలను పట్టించుకోకుండా కేవలం వాళ్ల ఎజెండాలనే పరిగణలోకి తీసుకొని బీఏసీ సమావేశం నిర్వహించేదని తెలిపారు. ఈసారి గతానికి భిన్నంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించబోతున్నట్లు ఆయన వెల్లడించారు. శాసనసభ చరిత్రను తిరగరాసే బిల్లులను ప్రవేశపెట్టబోతున్నామని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ప్రతిపక్ష పార్టీ అడిగే ప్రతీ విషయంపై చర్చించడానికి అవసరమయితే అసెంబ్లీ పని దినాలు పెంచడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం బీఏసీ సమావేశంలో ఏడుగురికి మించి ఉండరాదని, టీడీపీకి ఉన్నసంఖ్యాబలం ప్రకారం సమావేశంలో ఒక్కరికే పాల్గొనే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ సమావేశానికి చంద్రబాబు నాయుడు హాజరు కాకపోవడం దురదృష్టకరమని, దీన్ని బట్టే ఆయనకు ప్రజా సమస్యలపై ఎంత చిత్తశుద్ది ఉందో అర్థమవుతుందని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. -
లోక్‌సభలో వైఎస్ఆర్సీపీ చీఫ్ విప్‌గా మార్గాని భరత్
-
'చీఫ్ విప్ ఇచ్చి అన్యాయం చేయొద్దు'
-
'చీఫ్ విప్ ఇచ్చి అన్యాయం చేయొద్దు'
హైదరాబాద్: తెలంగాణ కేబినెట్లో తొలి విస్తరణలో స్థానం దక్కక పోయినా రెండోసారి విస్తరణలోనైనా చోటు దక్కుతుందని కరీంనగర్ జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ భావించారు. కానీ సీఎం కేసీఆర్... చీఫ్ విప్ పదవి కేటాయించడంతో కొప్పుల ఈశ్వర్ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. చీఫ్ విప్ పదవిని నిరాకరిస్తున్నట్లు కొప్పుల ఈశ్వర్... కేసీఆర్ సన్నిహితుల వద్ద తన అభిప్రాయాన్ని వెల్లడించినట్లు సమాచారం. అయితే కొప్పుల ఈశ్వర్‌కు చీఫ్ విప్ పదవిని కేటాయించడంపై మాలమహానాడు కార్యకర్తలు కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడ్డారు. చీఫ్ విప్ పదవి తీసుకోవద్దంటూ కరీంనగర్‌లోని కొప్పుల ఈశ్వర్ నివాసం వద్ద ఆదివారం మాల మహానాడు కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈశ్వర్‌కు ప్రభుత్వ చీఫ్ విప్ పదవి వద్దు ... 16వ తేదీన జరిగే మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమం సమయంలో మీ వెన్నంటి ఉన్న తమ నాయకుడు ఈశ్వర్‌కు చీఫ్ విప్ పదవి ఇచ్చి అన్యాయం చేయొద్దని వారు సీఎం కేసీఆర్‌కు బహిరంగంగా విజ్ఞప్తి చేశారు. అయితే ఇదే అంశంపై స్పందించాలని మీడియా ప్రతినిధులు కొప్పుల ఈశ్వర్‌ను కోరగా... అందుకు స్పందించేందుకు ఆయన నిరాకరించారు. -
ఏపీ చీఫ్ విప్‌గా కాలువ శ్రీనివాసులు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చీఫ్ విప్‌గా అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు నియమితులయ్యారు. విప్‌లుగా తెలుగుదేశం ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, కూన రవి కుమార్, యామిని బాల, మేడ మల్లికార్జున రెడ్డిలను నియమించారు. కాల్వ శ్రీనివాసులుకు మంత్రి పదవి లేదా డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తారని గతంలో వార్తలు వినిపించినా అవకాశం రాలేదు. టీడీడీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చీఫ్ విప్ పదవికి కాల్వ పేరును ఎంపిక చేశారు. -
రాజ్యసభలో బీజేపీ చీఫ్ విప్‌గా జవదేకర్
రాజ్యసభ ఎంపీ, బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ ఎగువ సభలో ఆ పార్టీ చీఫ్ విప్‌గా వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని బీజేపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు ఎల్కే అద్వానీ ప్రకటించారు. మంగళవారం జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశానికి పార్లమెంటు ఇరు సభల్లోని బీజేపీ సభ్యులు హాజరయ్యారు. ఇప్పటివరకు ఎగువసభలో చీఫ్ విప్‌గా వ్యవహరించిన మాయాసింగ్ ఇటీవల మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో గ్వాలియర్ తూర్పు నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. దీంతో చీఫ్ విప్‌గా జవదేకర్‌ను నియమించినట్లు అద్వానీ ప్రకటించారు.