రాజ్యసభ ఎంపీ, బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ ఎగువ సభలో ఆ పార్టీ చీఫ్ విప్‌గా వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని బీజేపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు ఎల్‌కే అద్వానీ ప్రకటించారు. మంగళవారం జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశానికి పార్లమెంటు ఇరు సభల్లోని బీజేపీ సభ్యులు హాజరయ్యారు. ఇప్పటివరకు ఎగువసభలో చీఫ్ విప్‌గా వ్యవహరించిన మాయాసింగ్ ఇటీవల మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో గ్వాలియర్ తూర్పు నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. దీంతో చీఫ్ విప్‌గా జవదేకర్‌ను నియమించినట్లు అద్వానీ ప్రకటించారు.