ఎన్సీపీ మద్దతు తీసుకోం:జవదేకర్
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు ఎన్సీపీ మద్దతు కోరబోమని సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీకి మద్దతు ఇచ్చే విషయంలో శివసేన ముందుకు రావడంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ పాలనలో కాంగ్రెస్-ఎన్సీపీల కలిసి రాష్ట్రంలో అవినీతికి పాల్పడ్డాయని మరోమారు విమర్శించారు. అందుచేత ఎట్టి పరిస్థితిల్లోనూ ఎన్సీపీ మద్దతు కోరే ప్రసక్తే లేదన్నారు. ఒకవేళ పొత్తు పెట్టుకుంటే ఓటేసిన ప్రజలతో పాటు, తమను కూడా అవమానపరుచుకున్నట్లేనని తెలిపారు.
తాము సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సంఖ్యను గెలుచుకోలేకపోతే శివసేన మద్దతును తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.ప్రస్తుతం మహారాష్ట్రలో అత్యధిక సీట్లు కైవసం చేసుకునే దిశగా కొనసాగుతున్న బీజేపీ.. ప్రభుత్వ ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తోంది.