![Case Filed Against Nara Lokesh In Anantapur D Hirehal PS - Sakshi](/styles/webp/s3/article_images/2021/05/8/nara-lokesh.jpg.webp?itok=5SD6Y4F1)
సాక్షి, అనంతపురం: మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేశ్‌పై డి.హీరేహల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిపై ట్విటర్‌లో ఆరోపణలు చేసిన నేపథ్యంలో, వైఎస్సార్ సీపీ ఎస్టీ సెల్ నేత భోజరాజు నాయక్ ఫిర్యాదు చేశారు. వివరాలు... టీడీపీ కార్యకర్తపై కర్ణాటకలో గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఆ నిందను ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిపై వేస్తూ.. లోకేశ్ సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారంటూ భోజరాజు నాయక్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించారని మండిపడ్డారు.
చదవండి: చంద్రబాబుపై క్రిమినల్ కేసు
Comments
Please login to add a commentAdd a comment