అనంతపురం సప్తగిరి సర్కిల్: అసెంబ్లీకి గానీ, పంచాయతీ సర్పంచ్ స్థానానికి గానీ, కనీసం వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని వ్యక్తి నారా లోకేశ్.. అలాంటి వ్యక్తి ‘యువగళం’ పేరుతో యాత్ర చేసినా వైఎస్సార్‌సీపీకి వచ్చే నష్టమేమీ లేదు’ అని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన అనంతపురంలో జరిగిన వైఎస్సార్‌సీపీ కన్వీనర్ల సమావేశానికి ముందు మంత్రి ఉషశ్రీచరణ్‌తో కలిసి తమను కలిసిన విలేకరులతో మాట్లాడారు.
2019 ఎన్నికల్లో ప్రజలు టీడీపీని 23 స్థానాలకే పరిమితం చేశారన్నారు. ఫోర్ ట్వంటీ వ్యక్తులు టీడీపీకి నాయకత్వం వహిస్తున్నారని, ఫేక్ సర్వేలతో కార్యకర్తలను మోసం చేస్తున్నారని విమర్శించారు. నాలుగు చానళ్లు, నలుగురిని కూటమిగా పెట్టుకుని ఏమి చెప్పినా ప్రజలు నమ్ముతారనే భ్రమల్లో ఉన్నారన్నారు. అసలు రాష్ట్రంలో టీడీపీ ఉనికే లేదన్న విషయం గుర్తించాలన్నారు. 150 నియోజకవర్గాల్లో టీడీపీకి నాయకత్వమే లేదన్నారు. అయినా అధికారంలోకి వస్తే తాము ఏదో చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారని.. వారిలా మేమూ అనుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలని హెచ్చరించారు.
ప్రచార యావతో ప్రజలను చంపడమే మీ ధ్యేయమా అని టీడీపీ నేతలను ప్రకా‹Ùరెడ్డి ప్రశ్నించారు. భూములు, స్థలాలు ఆక్రమించడం, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టడం టీడీపీ నేతలకు అలవాటని విరుచుకుపడ్డారు. ఇప్పుడేదో సచీ్చలురు అన్నట్లు మాయమాటలు చెప్తూ.. వైఎస్సార్‌సీపీని ఓడించండని ప్రజలకు పిలుపునిస్తుండటం హాస్యాస్పదంగా ఉందన్నారు. టీడీపీ నాయకులు మాట్లాడుతున్న భాషను మహిళలు చీదరించుకుంటున్నారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment