bhojaraju
-
నారా లోకేశ్‌పై కేసు నమోదు
సాక్షి, అనంతపురం: మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేశ్‌పై డి.హీరేహల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిపై ట్విటర్లో ఆరోపణలు చేసిన నేపథ్యంలో, వైఎస్సార్ సీపీ ఎస్టీ సెల్ నేత భోజరాజు నాయక్ ఫిర్యాదు చేశారు. వివరాలు... టీడీపీ కార్యకర్తపై కర్ణాటకలో గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఆ నిందను ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిపై వేస్తూ.. లోకేశ్ సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారంటూ భోజరాజు నాయక్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించారని మండిపడ్డారు. చదవండి: చంద్రబాబుపై క్రిమినల్ కేసు -
సాక్షరభారత్ డిప్యూటీ డైరెక్టర్ స్వచ్ఛంద పదవీ విరమణ
సిబ్బంది వ్యవహారమే కారణం? అనంతపురం ఎడ్యుకేషన్ : సాక్షరభారత్ మిషన్ (వయోజన విద్య) ఉప సంచాలకులు భోజరాజు స్వచ్ఛంద పదవీ విరమణ పొందారు. ఈయనకు ఇంకా 20 నెలల సర్వీస్ ఉంది. అయినా స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేయడం చర్చనీయాంశమైంది. స్వచ్ఛందవిరమణకు అనుమతి ఇవ్వాలని గతంలో దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కర్నూలు జిల్లాకు చెందిన భోజరాజు ప్రాజెక్ట్ ఆఫీసర్ (పీఓ)గా జిల్లాకు వచ్చారు. గతంలో డీడీగా పని చేస్తున్న ఈశ్వరయ్య ఆత్మహత్య చేసుకున్న తర్వాత డీడీ ఎఫ్ఏసీగా ఆయనకే బాధ్యతలు ఇచ్చారు. 2015 డిసెంబరులో డీడీగా రెగ్యులర్ అయింది. అప్పటి నుంచే ఆయనే కొనసాగుతున్నారు. వాలంటరీ రిటైర్మెంట్ ఇవ్వడంతో పీఓగా పని చేస్తున్న సలీంకు ఎఫ్ఏసీగా బాధ్యతలు అప్పగించారు. ఇదిలాఉండగా వ్యక్తిగత పరిస్థితుల కారణంగానే స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నట్లు భోజరాజు చెబుతున్నా...అంతర్గతంగా మాత్రం తాను పని చేస్తున్న చోట పడుతున్న ఇబ్బందులు తాళలేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సిబ్బందిలో మార్పు రాకపోవడం... తనకు ఎక్కడ చెడ్డపేరు వస్తుందోనన్న భయంతో ఈనిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనిపై మాట్లాడేందుకు ‘సాక్షి’ ఫోన్ చేయగా...‘నేను నిజాయితీ కుటుంబం నుంచి వచ్చాను. ఉద్యోగ విరమణ చేయడం ద్వారా నాకు ఎలాంటి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండవు. కుటుంబంతో ప్రశాంతంగా జీవిస్తాను. ఇంతకు మించి నన్నేమి అడగవద్దు’ అని సమాధానమిచ్చారు.