‘ఇరు ప్రాంతాలకు సమన్యాయం చేయండి లేదా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచండి’ అనే డిమాండ్‌తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు గుంటూరులో చేపట్టిన సమరదీక్షకు మద్దతుగా అనంతపురం జిల్లాలో చేపట్టిన దీక్షలకు ఆ పార్టీ శ్రేణులు, సమైక్యవాదుల నుంచి ఐదు రోజులుగా సంఘీభావం వెల్లువెత్తుతోంది.
అనంతపురం జిల్లాపరిషత్తు, న్యూస్‌లైన్: ‘ఇరు ప్రాంతాలకు సమన్యాయం చేయండి లేదా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచండి’ అనే డిమాండ్‌తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు గుంటూరులో చేపట్టిన సమరదీక్షకు మద్దతుగా అనంతపురం జిల్లాలో చేపట్టిన దీక్షలకు ఆ పార్టీ శ్రేణులు, సమైక్యవాదుల నుంచి ఐదు రోజులుగా సంఘీభావం వెల్లువెత్తుతోంది.
ఆరోగ్యం క్షీణించడంతో రాయదుర్గంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సతీమణి కాపు భారతి, తాడిపత్రిలో పైలా నర్శింహయ్య ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అంతకు ముందు పైలా మాట్లాడుతూ.. జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని దెబ్బతీయాలనే కుట్రలో భాగంగా కుమ్మక్కైన కాంగ్రెస్, టీడీపీ నేతలు సీమాంధ్ర ప్రజలకు తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు. విభజించే సమయంలో సీమాంధ్ర ప్రజల అభిప్రాయాలు, హైదరాబాద్ అంశం, ఇక్కడ తలెత్తే సమస్యలకు పరిష్కారం చూపకుండా ఏకపక్షంగా విభజన చేస్తామనడం దారుణమని విమర్శించారు. కీలకమైన రాష్ట్ర విభజన అంశంపై పార్టీ గౌరవాధ్యక్షురాలు చేపట్టిన సమరదీక్షకు సీమాంధ్ర ప్రాంత ప్రజలు ముక్తకంఠంతో మద్దతు పలకడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో రెండు పార్టీలకు తగిన గుణపాఠం చెప్పడానికి అన్ని వర్గాల ప్రజలతో పాటు ఉద్యోగ సంఘాలు సమాయత్తమవుతాయని హెచ్చరించారు. పుట్టపర్తిలో డాక్టర్ హరికృష్ణ ఆమరణ దీక్ష శుక్రవారం ఐదో రోజుకు చేరుకుంది.
పార్టీ నాయకులు, కార్యకర్తలు, సమైక్యవాదులు తరలివచ్చి మద్దతు ప్రకటించారు. కదిరిలో ఎన్‌ఎండీ ఇస్మాయిల్ ఆమరణ దీక్ష మూడో రోజుకు చేరుకుంది. ఆయనతో పాటు మరో పది మంది సమైక్యవాదులు దీక్షకు కూర్చుకున్నారు. అన్ని వర్గాల నుంచి పెద్ద ఎత్తున సంఘీభావం వ్యక్తమైంది. ఉరవకొండలో 48 గంటల రిలేదీక్షలు ప్రారంభమయ్యాయి. కళ్యాణదుర్గం, ధర్మవరం, తనకల్లు, యాడికి, పెద్దపప్పూరు, బుక్కరాయసముద్రం, చెన్నేకొత్తపల్లి తదితర మండలాల్లో చేపట్టిన రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. వైఎస్ విజయమ్మ ఆరోగ్యం బాగుండాలని చిలమత్తూరులో పార్టీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.