సాక్షి, అనంతపురం: చంద్రబాబు అవినీతికి చిరునామా అని.. రూ.2వేల కోట్ల అక్రమ ఆర్థిక లావాదేవీలు జరిగాయని ఐటీశాఖ నిర్ధారించిందని ఏపీ ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. నలభై చోట్ల ఐటీ దాడులు చేస్తే ఒక చోట జరిగిన దానిపై టీడీపీ నేతలు మాట్లాడటం సిగ్గుచేటు అని మండిపడ్డారు. ఒకే కంప్యూటర్ నుంచి చంద్రబాబు బినామీ కంపెనీల్లో లావాదేవీలు జరిగాయని ఆయన మండిపడ్డారు. చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే సీబీఐ విచారణకు సిద్ధపడాలని కాపు రామచంద్రారెడ్డి సవాల్ విసిరారు.
కేంద్రం, హైకోర్టులో పిటిషన్ వేసే దమ్ము చంద్రబాబుకు ఉందా అని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు పీఎస్ శ్రీనివాస్ ఇంటిపై ఆరు రోజులు ఐటీ సోదాలు జరిగాయని.. ఐటీ అధికారులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారని ఆయన గుర్తుచేశారు. సీబీఐ, ఈడీ విచారణ కోరే దమ్ము యనమల రామకృష్ణుడికి ఉందా అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబుపై 22 కేసుల్లో స్టే ఉందని రామచంద్రారెడ్డి మండిపడ్డారు. ఈ కేసుల్లో విచారణ ఎదుర్కొనే ధైర్యం చంద్రబాబుకు ఉందా అని నిలదీశారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ చంద్రబాబు అని రామచంద్రారెడ్డి దుయ్యబాట్టారు.
Comments
Please login to add a commentAdd a comment