
కాపు దంపతులు, నూతన వధూవరులతో వైఎస్ షర్మిలమ్మ
సాక్షి, బళ్లారి: అనంతపురం జిల్లా రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఇంట్లో మెహందీ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. కాపు రామచంద్రారెడ్డి కుమార్తె స్రవంతి వివాహం నేపథ్యంలో బళ్లారిలోని హవంబావి వద్ద ఉన్న కాపు నివాసంలో జరిగిన మెహందీ కార్యక్రమానికి ఆం ధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె షర్మిలమ్మ హాజరయ్యారు. షర్మిలమ్మ రాగానే వైఎస్ కుటుంబ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆమెతో ఫొటోలు దిగేందుకు ఉత్సాహం చూపారు. అనంతరం కాబోయే వధూవరులను షర్మిలమ్మ ఆశీర్వదించారు. అలాగే రెడ్డి అండ్ రెడ్డి శ్రీరామ్‌రెడ్డి, బొమ్మారెడ్డి సునీత తదితరులు వధూవరులను దీవించారు. ఆదివారం తెల్లవారుజామున స్థానిక అల్లం భవన్‌లో పెళ్లి జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment