Manchu Lakshmi Shares Manoj Mehendi Function and Cocktail Party Video - Sakshi
Sakshi News home page

Manchu Lakshmi: కాక్‌టైల్‌ పార్టీ.. పెళ్లికొడుకుతో చిందేసిన మంచు లక్ష్మి, వీడియో వైరల్‌

Published Sun, Mar 5 2023 1:10 PM | Last Updated on Sun, Mar 5 2023 2:59 PM

Manchu Lakshmi Shares Manoj Mehendi Function and Cocktail Party Video - Sakshi

చేతినిండా గోరింటాకు పెట్టుకున్న పెళ్లికూతురు మౌనిక చెవికమ్మలను సరిచేస్తూ కనిపించింది లక్ష్మి. అనంతరం కాక్‌టైల్‌ పార్టీలో మం

మంచు మనోజ్‌, మౌనికలు పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలను నిజం చేస్తూ వీరిద్దరూ వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఫిలిం నగర్‌లోని మంచు లక్ష్మి నివాసంలో అతిదగ్గరి బంధుమిత్రుల సమక్షంలో మార్చి 3న ఈ పెళ్లి జరిగింది. అప్పటినుంచి వీరికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా మనోజ్‌- మౌనికల మెహందీ, కాక్‌టైల్‌ సెలబ్రేషన్స్‌ వేడుకను మంచు లక్ష్మి తన యూట్యూబ్‌ ఛానల్‌లో రిలీజ్‌ చేసింది. 

ఈ సెలబ్రేషన్స్‌ కోసం తన ఇంటిని, ఇంటి ముందు ప్రాంగణాన్ని ఎంత అందంగా ముస్తాబు చేశారో చూపించింది. పనిలో పనిగా తనూ రెడీ అయి ఫోటోషూట్‌ చేసేసింది. మెహందీ ఫంక్షన్‌కు మంచు లక్ష్మి వైట్‌ డ్రెస్‌లో రెడీ అయింది. మెహందీ పెట్టుకుంటే అన్నం, చపాతీల్లాంటివి తినడం కష్టం కాబట్టి వేరే ఎవరైనా తినిపించడానికి వీలుగా ఉండేలా చాట్స్‌ ఏర్పాటు చేయించినట్లు చెప్పుకొచ్చింది. అయితే పానీపూరీలో ఎవరికీ తెలియకుండా వోడ్కా కలిపేస్తానని, దెబ్బకు టేస్టే మారిపోతుందని తెలిపింది. పానీపూరీతో పాటు రాజస్తానీ కడీ కచోరీ, రగడ వంటి చాట్స్‌ ఏర్పాటు చేయగా వాటినోసారి రుచి చూసింది లక్ష్మి.

అనంతరం ఫ్యామిలీ అంతా మెహందీ పెట్టుకున్న క్షణాలను కెమెరాలో బంధించింది. ఈ క్రమంలో చేతినిండా గోరింటాకు పెట్టుకున్న పెళ్లికూతురు మౌనిక చెవికమ్మలను సరిచేస్తూ కనిపించింది మంచు లక్ష్మి. తర్వాత కాక్‌టైల్‌ పార్టీలో మంచు మనోజ్‌, లక్ష్మి.. వారి కుటుంబం అంతా కలిసి సరదాగా చిందేశారు. ఇక అందరితోనూ కలుపుగోలుగా మాట్లాడుతూ మౌనికను సొంత సోదరిలా చూసుకుంటూ తనకు కావాల్సినవి ఏర్పాటు చేసిన మంచు లక్ష్మి మంచితనాన్ని  నెటిజన్లు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement