
చంద్రబాబు వ్యాఖ్యలు దురదృష్టకరం: కాపు
రాష్ట్ర విభజనపై చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అన్నారు.
రాష్ట్ర విభజనపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అన్నారు. రాష్ట్ర విభజనపై ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నానని చంద్రబాబు తెగేసి చెప్పడం బాధాకరమని తెలిపారు. తెలుగుమాతని నిలువుగా చీల్చడానికి టీడీపీనే కారణమని ఆయన ఆరోపించారు. ఈ విషయం తెలుగు తమ్ముళ్లకు అర్ధం కావడం లేదా అని ఆయన ప్రశ్నించారు.
కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నాయని నిన్న కాపు రామచంద్రారెడ్డి ఆరోపించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా చంద్రబాబు లేఖ ఇచ్చారని, టీడీపీ ఎమ్మెల్యేలకు సమైక్య ఉద్యమం చేసే అర్హత లేదని ఆయన పేర్కొన్నారు.