![Government Whip Koramutla Srinivasulu Comments On Chandrababu - Sakshi](/styles/webp/s3/article_images/2019/12/16/kapu-ramachandra-reddy.jpg.webp?itok=sb4HBh0X)
సాక్షి, అమరావతి: చంద్రబాబు పాలనలో 2,700 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ప్రభుత్వ విప్ కోరముట్ల శ్రీనివాసులు పేర్కొన్నారు. సోమవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ.. ఏనాడు చంద్రబాబు రైతుల సంక్షేమం గురించి ఆలోచించలేదని ధ్వజమెత్తారు. ఆత్మహత్యలకు పరిహారం ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతో మరణాలను కూడా నమోదు చేయించలేదని మండిపడ్డారు.
సిగ్గు పడ్డాలి..
40 ఇయర్స్ ఇండ్రస్టీ అని చెప్పుకునే ప్రతిపక్ష నేత చంద్రబాబు.. మార్షల్‌తో ప్రవర్తించిన తీరుతో సిగ్గు పడాలని ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి అన్నారు. చంద్రబాబు తీరుపై ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారన్నారు. దిశ చట్టంపై మహిళలంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. దిశ చట్టం తెచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను అభినందిస్తూ కేజ్రివాల్ లేఖ కూడా రాశారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment