assembly media point
-
ఆ విషయంపై క్లారిటీ కావాలి: హరీష్‌రావు
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ పెట్టుబడిపై ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదని.. క్లారిటీ కావాలంటూ కొత్త ప్రభుత్వాన్ని మాజీ మంత్రి హరీష్‌రావు డిమాండ్ చేశారు. రైతులు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తోందన్నారు. శనివారం అసెంబ్లీ సమావేశాల ముగింపు అనంతరం మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ.. విమర్శలు చేయడానికి తాము రాలేదన్నారు. ‘‘ఓ వైపు వర్షాలు పడుతున్నాయి. బోనస్ ఎప్పుడు ఇస్తారో ప్రభుత్వం చెప్పాలి. రైతు బంధు రూ.15 వేలు ఇస్తామని చెప్పారు. డిసెంబర్ 9న ఇస్తామని చెప్పింది కానీ ఇవ్వటం లేదు. మేం అధికారంలో ఉన్నపుడు నవంబర్ చివరి వారం, డిసెంబర్ మొదటి వారంలో వేశాం. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా ఎప్పటి లోగా ఇస్తారో స్పష్టత ఇవ్వాలి. యాసంగి పంట వేసే సమయం వచ్చింది దీనిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. డిసెంబర్ 9న వచ్చిన ప్రభుత్వం నుంచి స్పందన లేదు’’ అని హరీష్‌రావు విమర్శించారు. ఇదీ చదవండి: మహాలక్ష్మీ పథకం ప్రారంభం.. మహిళలకు ఉచిత ప్రయాణం -
వాస్తవాలు బయటకు వస్తాయనే రాద్ధాంతం
సాక్షి, అమరావతి: ప్రజా సమస్యలు చర్చిస్తే వాస్తవాలు బయటకొస్తాయనే భయంతోనే టీడీపీ సభ్యులు శాసనసభలో గందరగోళం సృష్టిస్తున్నారని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. ఎల్లో మీడియా వండి వార్చిన అసత్య కథనాల ఆధారంగానే టీడీపీ నాయకుల ఆరోపణలు, ప్రశ్నలు ఉంటున్నాయన్నారు. వాటికి ప్రభుత్వం సమాధానం చెబుతుంటే.. ప్రజలకు నిజాలు తెలియనివ్వకుండా టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి.. పేపర్లు చించి విసిరేస్తూ రాద్ధాంతం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే ఇలాంటి ఘటనలను అందరూ ఖండించాలని కోరారు. ‘జంగారెడ్డిగూడెంలో వరుస మరణాల ఘటనపై ఎవరూ ఫిర్యాదు చేయనప్పటికీ ప్రభుత్వం స్పందించి విచారణకు ఆదేశించింది. ఖననం చేసిన మృతదేహానికీ పోస్టుమార్టం చేయించింది. సహజ మరణాలను టీడీపీ రాజకీయం చేస్తోంది. చంద్రబాబు ఆదేశాలతో ఇక్కడ టీడీపీ సభ్యులు అల్లర్లు, గొడవలు సృష్టించారు. ప్రభుత్వ ప్రకటనను వినే ఓపిక వారికి లేదు. ఇకనైనా చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవాలి’ అని మంత్రి హితవు పలికారు. -
ఇలా అయితే ఫామ్‌హౌస్‌లోనే అసెంబ్లీ పెట్టాల్సింది
సాక్షి, హైదరాబాద్: ప్రజా సమస్యలకు పరిష్కారం లభించేది దేవాలయం లాంటి శాసన సభలోనే.. కానీ ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కుతోంది అంటూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాకాల శాసనసభ సమావేశాలు రెండో రోజులో భాగంగా మంగళవారం భట్టీ మాట్లాడుతూ.. 19మంది శాసన సభ్యులున్న కాంగ్రెస్ సభ్యుల్లో కొందరిని కేసీఆర్ కలుపుకున్నారు. 19మంది ప్రాతిపదికన కాకుండా ఇప్పుడు ఉన్న సభ్యుల ప్రకారమే సమయం ఇస్తున్నారు. కేవలం 6 నిమిషాలు మాత్రమే కాంగ్రెస్‌కు మాట్లాడటానికి సమయం ఇస్తున్నారు.. ఇది చాలా దారుణం అని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు: జీవన్ రెడ్డి ప్రజా సమస్యల పట్ల కాంగ్రెస్‌కు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదని జీవన్ రెడ్డి మండి పడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్ తొలగించడం అప్రజాస్వామికం..దేశ చరిత్రలో ఇలాంటి ఘటనలు జరగలేదన్నారు. ప్రభుత్వం నియంతృత్వ ఆలోచనలను అమలు చేస్తోందని విమర్శించారు. తెలంగాణలో రాచరిక పాలన నడుస్తోంది.. స్పీకర్ మీడియా పాయింట్ పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని జీవన్ రెడ్డి కోరారు. (చదవండి: కేసీఆర్ తీర్మానం : వ్యతిరేకించిన ఎంఐఎం) ఇలా అయితే అసెంబ్లీ సమావేశాలు ఎందుకు: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పీవీ నరసింహారావు ఘన కీర్తిని పొగిడి, సోనియా దేవత అని ప్రశంసించిన కేసీఆర్‌కు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కేటీఆర్ కాంగ్రెస్‌ను బొంద పెడతా అని వ్యాఖ్యానించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులను మాట్లాడనివ్వటం లేదని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ లాంటి నియంతను సీఎంగా కోరుకోవట్లేదు అన్నారు. తెలంగాణ కేసీఆర్ అబ్బ సొత్తు కాదు. ప్రత్యేక రాష్ట్రం 1,000 మంది యువకులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. నియోజకవర్గ సమస్యలు చెప్పుకునే అవకాశం ఇవ్వట్లేదన్నారు. కనీసం రిప్రజెంటేషన్ ఇవ్వటానికి కూడా కేసీఆర్ సమయం ఇవ్వట్లేదు. బయట సీఎం అపాయింట్ మెంట్ ఇవ్వట్లేదు, అసెంబ్లీలో మాట్లాడనివ్వటంలేదు అలాంటప్పుడు అసెంబ్లీ సమావేశాల నిర్వహణ ఎందుకని ప్రశ్నించారు. కేసీఆర్ ఫామ్ హౌస్‌లోనే అసెంబ్లీ పెట్టుకోవాలని తీవ్రంగా మండి పడ్డారు రాజగోపాల్ రెడ్డి. -
'ప్రజారోగ్యం గాలికొదిలేసిన దిక్కుమాలిన ప్రభుత్వం'
సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. పట్టణాలకే పరిమితమైన కరోనా ఇప్పుడు గ్రామాలకు విస్తరించే పనిలో ఉందన్నారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో భట్టి మాట్లాడుతూ.. ప్రజారోగ్యాన్ని ఇంత దారుణంగా గాలికొదిలేసిన ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడు చూడలేదని మండిపడ్డారు. వెంటనే గ్రామాల్లో, మండల కేంద్రాల్లో క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కరోనాను కంట్రోల్ చేయడానికి కేంద్రం ఇచ్చిన గైడ్‌లైన్స్‌ను కాంగ్రెస్ నేతలను కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం వాడుకుంటుందని భట్టి విమర్శించారు. ప్రభుత్వం చేసిన తప్పు వల్లే గజ్వేల్‌లో రైతు ఆత్మహత్య చేసుకున్నాడని.. టీఆర్ఎస్ అనే ఫ్యూడల్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ దాడులు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. ఆత్మగౌరవం కోసం పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణలో దళితులపై దాడులు ఆగడం లేదని.. దళిత వర్గానికి రాజ్యాంగ రక్షణ కరువయిపోయిందని భట్టి ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో దళితులపై సిరిసిల్ల దగ్గర మొదలుకొని గజ్వేల్ నుంచి రాజాపూర్ వరకు దాడులు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. దళితులపై జరుగుతున్న దాడుల పై డీజీపీ కి ఫిర్యాదు చేస్తే కనీసం స్పందన కూడా కరువయింది.. ఈ దాడుల గురించి గవర్నర్‌కు కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. కరోనా వైరస్ కారణంగా గవర్నర్‌ను నేరుగా కలవకుండా మెయిల్ ద్వారా ఫిర్యాదును పంపుతున్నట్లు తెలిపారు. -
సీఎం మంచి నిర్ణయం తీసుకున్నారు : మంత్రి ధర్మాన
సాక్షి, అమరావతి : ఒక ప్రాంతం కాకుండా అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందేలా రాజధాని విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంచి నిర్ణయం తీసుకున్నారని మంత్రి కృష్ణదాస్ వ్యాఖ్యానించారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ఈ సారి సభలో మొత్తం 19 బిల్లులు ప్రవేశపెట్టగా, 16 బిల్లులు ఆమోదం పొందాయని తెలిపారు. కీలకమైన దిశా బిల్లు ఆమోదం వల్ల మహిళల భద్రతకు సీఎం అత్యంత ప్రాధాన్యతనిచ్చారని పేర్కొన్నారు. సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ దిశా బిల్లును ప్రశంసించారని వెల్లడించారు. కేరళ, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, ఒడిశా వంటి రాష్ట్రాలు దిశా చట్ట అమలుకు ముందుకు వచ్చాయని వివరించారు. -
‘40 ఇయర్స్ ఇండ్రస్టీ’ ప్రవర్తన ఇలాగేనా..
సాక్షి, అమరావతి: చంద్రబాబు పాలనలో 2,700 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ప్రభుత్వ విప్ కోరముట్ల శ్రీనివాసులు పేర్కొన్నారు. సోమవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడుతూ.. ఏనాడు చంద్రబాబు రైతుల సంక్షేమం గురించి ఆలోచించలేదని ధ్వజమెత్తారు. ఆత్మహత్యలకు పరిహారం ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతో మరణాలను కూడా నమోదు చేయించలేదని మండిపడ్డారు. సిగ్గు పడ్డాలి.. 40 ఇయర్స్ ఇండ్రస్టీ అని చెప్పుకునే ప్రతిపక్ష నేత చంద్రబాబు.. మార్షల్‌తో ప్రవర్తించిన తీరుతో సిగ్గు పడాలని ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి అన్నారు. చంద్రబాబు తీరుపై ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారన్నారు. దిశ చట్టంపై మహిళలంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. దిశ చట్టం తెచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను అభినందిస్తూ కేజ్రివాల్ లేఖ కూడా రాశారని తెలిపారు. -
సర్కార్‌పై అవిశ్వాసం పెడతాం!
సాక్షి, హైదరాబాద్: రైతాంగ సమస్యల పరిష్కారంపై ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధిలేదని, ప్రధాన ప్రతిపక్షంగా రైతుల పక్షాన పోరాడుతున్నా పట్టించుకోవడం లేదని, దీనికి నిరసనగా సర్కార్‌పై అవిశ్వాసం పెట్టే ఆలోచనలో ఉన్నామని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. సీఎల్పీ నేత జానారెడ్డి, డిప్యూటీ నేతలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలసి ఆయన బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. శాసన సభలో ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ప్రభుత్వ తీరు అత్యంత అప్రజాస్వామికంగా ఉందని మండిపడ్డారు. సీఎం కేసీఆర్, శాసన వ్యవహారాల మంత్రి, వ్యవసాయ మంత్రి గంటలు గంటలు మాట్లాడారని, చివరకు ప్రతిపక్ష నేతకు కనీసం నిరసన తెలిపేందుకు కూడా అవకాశం ఇవ్వడం లేదని విమర్శించారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదన్నారు. డిప్యూటీ స్పీకర్ ప్రవర్తన పట్ల సీఎల్పీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోందన్నారు. సచివాలయంలో అగ్నిమాపక వాహనం తిరగలేదని, శాసన సభలో సీఎం, స్పీకర్ వాహనాలు ఎండ లో ఉంటున్నాయని రూ.500 కోట్లు వెచ్చించి కొత్త సచివాలయం, శాసన సభ భవనాలు నిర్మిస్తామని అంటున్నారని మండిపడ్డారు. వాస్తు కారణంగా వందల కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చుపెట్టడానికి అబ్బసొత్తు కాదని, దీన్ని అడ్డుకుని తీరుతామని ఉత్తమ్ పేర్కొన్నారు. రుణమాఫీని విడతల వారీగా చేపట్టినందున రైతులపై వడ్డీ భారం పడిందని, వడ్డీ ప్రభుత్వమే చెల్లిస్తామని చెప్పినా.. ఆ హామీని నిలబెట్టుకోవడం లేదన్నారు. రైతులు.. తహసీల్దార్లు, కాంగ్రెస్ నేతలు, బ్యాంక్ మేనేజర్లకు రుణమాఫీ తర్వాత వడ్డీ భారమెంతో వివరిస్తూ దరఖాస్తు చేసుకోవాలన్నారు. రైతులకు కనీస మద్దతు ధరపై బోనస్ ఇవ్వడం లేదని, విద్యుత్‌పైనా సీఎం, మంత్రులు పచ్చి అబద్దాలు మా ట్లాడుతున్నారని విమర్శించారు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వమని, వ్యవసాయ సంక్షోభానికి, వేలాది మంది రైతుల ఆత్మహత్యలకు కేసీఆర్ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. ప్రతిపక్షాల మాట వినట్లేదు: జానారెడ్డి ప్రభుత్వం సమస్యలను దాటవేస్తోందని, సీఎం ఉపన్యాసాలు ఇస్తున్నారని, సభ నిబంధనల ప్రకారం నడవడం లేదని సీఎల్పీ నేత జానారెడ్డి విమర్శించారు. ప్రభుత్వం ప్రతిపక్షాల మాటే వినడం లేదని, రుణ విముక్తి పూర్తిగా గందరగోళ అంశమని చెప్పారు. రుణాలపై వడ్డీలను ప్రభుత్వమే చెల్లిస్తుందని గతంలో అసెంబ్లీ వేదికగా సీఎం హామీ ఇచ్చారని, వడ్డీ రూ.3 వేల నుంచి రూ.4 వేలు అవుతుండడం తో వెనక్కి తగ్గారన్నారు. సభలో నిరసన తెలుపుతామంటున్నా అవకాశం ఇవ్వడం లేదని, అంతా బావుందని రాష్ట్ర ప్రజలను భ్రమిం పజేస్తున్నారని తెలిపారు. సభలో అధికార పక్షం తీరు అప్రజాస్వామికంగా ఉందన్నారు. -
మీడియా పాయింట్ వద్ద టీడీపీ ఎమ్మెల్యేల దౌర్జన్యం
-
మీడియా పాయింట్ వద్ద టీడీపీ ఎమ్మెల్యేల దౌర్జన్యం
హైదరాబాద్ : శాసనసభ లోపలే కాదు... బయట కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలు దౌర్జన్యం కొనసాగించారు. అసెంబ్లీ బయట కూడా ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోంది అధికార పార్టీ. సమావేశాలు పది నిమిషాలు వాయిదా అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేలు మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతుండగా... వారిని టీడీపీ సభ్యులు అడ్డుకున్నారు. తాము మీడియాతో మాట్లాడుతున్నామని, కొద్దిసేపు వేచి ఉండాలని అన్నారు. అయితే టీడీపీ ఎమ్మెల్యేలు ...ప్రతిపక్ష ఎమ్మెల్యేలతో వాగ్వాదానికి దిగారు. వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతుండగా టీడీపీ ఎమ్మెల్యేలు అడ్డుగా నిలబడ్డారు. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఓ దశలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో టీడీపీ ఎమ్మెల్యేల దౌర్జన్యం నశించాలంటూ వైఎస్ఆర్ సీనీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. మహిళా ఎమ్మెల్యేలకు బాసటగా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్కడకు వచ్చారు. అయితే ఆయనను అక్కడ నుంచి పోలీసులు బలవంతంగా లాక్కెళ్లారు. టీడీపీ ఎమ్మెల్యేలు దౌర్జన్యం చేస్తుంటే తమను ఎలా లాక్కెళతారని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీలో ఎలాగూ మాట్లాడనీయడం లేదని, మీడియా పాయింట్ వద్ద కూడా మాట్లాడనివ్వడం లేదని, తమ గొంతు నొక్కాలని చూస్తున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేశారు. -
‘అందుకే స్వాగతించారు’
రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం చేస్తున్న సాయంపైనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటనను స్వాగతిస్తూ.. అభినందించినట్లు మంత్రి కె. అచ్చెన్నాయుడు తెలిపారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదని కేంద్రాన్ని తాము అభినందించలేదని స్పష్టం చేశారు. కేంద్ర సాయంపై సభలో చర్చిద్దామని చెప్పినా ప్రతిపక్ష సభ్యులు వినట్లేదన్నారు. ప్రజా సమస్యలపై చర్చకు శాసనసభను ఉపయోగించుకోకుండా.. సభా కార్యక్రమాలకు అడ్డుపడుతూ సమయాన్ని వధా చేస్తున్నారని ఆరోపించారు. -
ఇటీవల టీడీపీ గ్రాఫ్ తగ్గింది
టీడీపీ ఎమ్మెల్యేలు ప్రజాసమస్యలను పట్టించుకోవడం లేదు: జేసీ దివాకర్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: ఇటీవల కాలంలో టీడీపీ గ్రాఫ్ తగ్గిందని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ఇందుకు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులదే లోపమని స్పష్టం చేశారు. అందరూ కష్టపడితేనే అభివృద్ధి సాధ్యమని తెలిపారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడారు. టీడీపీ ఎమ్మెల్యేలు ప్రజలకు సన్నిహితంగా ఉండడం లేదు.. ప్రజా సమస్యలను అసలు పట్టించుకోవడం లేదన్నారు. ఎంపీ, ఎమ్మెల్యేల పట్ల అలసత్వం చూపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు మేల్కోవాలని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి సూచించారు. ఇదే మాట బాబుకు చాలా సార్లు చెప్పానన్నారు. ఇటీవల కాలంలో పార్టీల దిగజారుడుతనం ఎక్కువైందని చెప్పారు. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటే లాభం లేదన్నారు. ఎన్ని రోజులు మోసం చేస్తామని ప్రశ్నించారు. సభ సజావుగా నడిచేలా చూడాల్సిన బాధ్యత ప్రతిపక్షానిదేనని జేసీ సూచించారు. -
కోర్టు తీర్పుతో సభకు సంబంధం లేదు
శాసన సభవ్యవహారంలో కోర్టు జోక్యం చేసుకోకూడదు : బొండా ఉమ వ్యాఖ్య అసెంబ్లీ అధికారాలపై హైకోర్టు, సుప్రీంకోర్టులు సలహాలివ్వవు: ఎమ్మెల్యే అనిత హైదరాబాద్: కోర్టు ఇచ్చిన ఆర్డర్‌తో శాసనసభకు సంబంధం లేదని ప్రభుత్వ విప్ బొండా ఉమా మహేశ్వరరావు అన్నారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ.. శాసనసభా వ్యవహారాలు, హక్కులు చాలా పరిమితమైనవని చెప్పారు. శాసనసభ వ్యవహరాల్లో న్యాయస్థానం జోక్యం చేసుకోకూడదని స్పష్టంగా ఉందన్నారు. రోజా సస్పెన్షన్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పునకు, వైఎస్సార్సీపీ సభ్యులు మాట్లాడుతున్న దానికి పొంతన లేదన్నారు. రోజా సస్పెన్షన్ స్పీకర్ తీసుకున్న నిర్ణయం కాదని.. ఇది సభ తీసుకున్న నిర్ణయమని చెప్పారు. కోర్డు ఇచ్చిన ఆర్డర్‌ని పరిశీలించి సభ పవిత్రతను కాపాడతామని స్పష్టం చేశారు. శాసనసభ వ్యవస్థ, న్యాయ వ్యవస్థల మధ్య ఎవరి పరిధులు వాళ్లవని మరో ప్రభుత్వ విప్ కూన రవికుమార్ పేర్కొన్నారు. ప్రతిపక్ష సభ్యులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే వి.అనిత ఆరోపించారు. అసెంబ్లీకి పూర్తి అధికారాలు ఉంటాయని, ఈ విషయంలో హైకోర్టు, సుప్రీంకోర్టులు సలహాలివ్వవని చెప్పారు. సభలో బలం ఉన్న వాళ్లదే రాజ్యమని ఆమె పేర్కొన్నారు. సభలో స్పీకర్, సీఎం, మంత్రులు, సభ్యులు ఎవర్నీ వదిలిపెట్టకుండా ఎమ్మెల్యే రోజా చేసిన అనుచిత వ్యాఖ్యలను వైఎస్సార్సీపీ మరిచిపోయినా ప్రజలు మరిచిపోలేదన్నారు. తన విషయంలో చేసిన వ్యాఖ్యలకు రోజా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. -
తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్
వాస్తవాలకు దూరంగా గవర్నర్ ప్రసంగం కాంగ్రెస్ శాసనసభాపక్షం విమర్శ హైదరాబాద్: గవర్నర్ ప్రసంగంపై కాంగ్రెస్ శాసనసభా పక్షం పెదవి విరిచింది. ప్రభుత్వం గవర్నర్ చేత అబద్ధాలు చెప్పించిందని విమర్శించింది. గవర్నర్ ప్రసంగం వాస్తవాలను ప్రతిబింబించలేదని కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉపనేత టి.జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే జి.చిన్నారెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. గురువారం వారు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ దేశం కన్నా రాష్ట్ర వృద్ధిరేటు ఎక్కువగా ఉందని గవర్నర్ చెప్పడం శోచనీయమన్నారు. మైనస్ నాలుగుగా ఉన్న వ్యవసాయం వృద్ధిరేటును 0.8గా చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పారిశ్రామిక, సేవారంగాల్లో రోజురోజుకు పరిస్థితులు అడుగంటుతుండగా అవాస్తవాలను చెప్పించడం విచారకరమన్నారు. కరువుతో అల్లాడిపోతూ ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులను ఆదుకునేందుకు ఈసారైనా ఒకేసారి రుణమాఫీ చేస్తారని భావించగా నిరాశే మిగిలిందన్నారు. దళిత, గిరిజనులకు మూడెకరాల వ్యవసాయభూమి, మైనారిటీలు, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు, 2 లక్షల ఖాళీ ఉద్యోగాల భర్తీ, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపు గురించి మాట్లాడలేదని విమర్శించారు. కొత్తదనం లేని గవర్నర్ ప్రసంగం: బీజేఎల్పీ హైదరాబాద్: టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోను గవర్నర్ అసెంబ్లీలో మరోసారి చదివి వినిపించారని బీజేపీ శాసనసభా పక్షం విమర్శించింది. బీజేఎల్పీ నేత కె.లక్ష్మణ్, పార్టీ ఎమ్మెల్యేలు చింతల రాంచంద్రారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, రాజాసింగ్, ఎమ్మెల్సీ రాంచందర్ రావుతో కలసి మాట్లాడుతూ గవర్నర్ ప్రసంగంలో కొత్తదనమేమీ లేదన్నారు. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు, తండాలను గ్రామపంచాయతీలుగా మార్చడం, ఎస్సీ, ఎస్టీలకు మూడెకరాల భూపంపిణీ, ఎస్సీ సంక్షేమానికి రూ. 50వేల కోట్లు, బీసీ సబ్‌ప్లాన్, కేజీ టూ పీజీ ఉచిత విద్య వంటి వేవీ గవర్నర్ తన ప్రసంగంలో ప్రస్తావించలేదన్నారు. గవర్నర్‌కు కరువు కనిపించలేదా?: హైదరాబాద్: రాష్ట్రంలో రైతులు కరువుతో విలవిల్లాడుతుంటే గవర్నర్ నరసింహన్‌కు కనిపించలేదా అని సీపీఐ ఎమ్మెల్యే రవీంద్రనాయక్ ప్రశ్నించారు. రైతాంగం తీవ్ర కరువుతో ఉంటే ప్రసంగంలో కనీస ప్రస్తావన లేకపోవడం శోచనీయమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1600 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా ప్రభుత్వం నుంచి స్పందనలేదన్నారు. రాష్ట్రం నుంచి 60 లక్షల మంది ఉపాధి కోసం వలస పోయారని అన్నారు. గ్రామీణ ప్రాంత వాసులను ఆదుకోవలసిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రవీంద్రనాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇరవై నెలల్లోనే అభివృద్ధి బాట: కర్నె హైదరాబాద్: తమ ప్రభుత్వం చేసేదే చెబుతుందని, చెప్పేదే చేస్తుందని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. 50 ఏళ్ల సమైక్య పాలనలో లేని అభివృద్ధిని కేవలం 20 నెలల్లోనే పట్టాలెక్కించామని చెప్పారు. కేసీఆర్ స్వయంగా రైతు కావడంతో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నారని తెలి పారు. గోదావరిపై చేపట్టనున్న ప్రాజెక్టుల రీ డిజైనింగ్‌తో తెలంగాణ భూముల్లో బంగారు పంటలు పండనున్నాయని ఆయన వివరించారు. హామీల అమలు ఊసేదీ?: పాయం హైదరాబాద్: గవర్నర్ ప్రసంగానికి, వాస్తవ పరిస్థితులకు పొంతనే లేదని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. ముస్లిం, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు ప్రకటిస్తామన్న సీఎం రెండేళ్లు గడిచినా ఆ ఊసే ఎత్తడంలేదన్నారు. 15వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వారికి భరోసా ఇచ్చే ఒక్క కార్యక్రమమూ చేపట్టడంలేదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తెలంగాణలోని ప్రాజెక్టులను 80 శాతం పూర్తి చేస్తే.. సీఎం కేసీఆర్ మిగిలిన 20 శాతం ప్రాజెక్టుల పనులను విస్మరించి... రీడిజైనింగ్ అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారు. అమరుల కుటుంబాల అడ్రస్ దొరకడం లేదట! హైదరాబాద్: తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరుల కుటుంబాలను కేసీఆర్ ప్రభుత్వం విస్మరిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ విమర్శించారు. వారి కుటుంబాలకు సాయం చేస్తామని చెప్పిన ప్రభుత్వం.. వారి అడ్రస్‌లు దొరకడం లేదని చెప్పడం సిగ్గుచేటన్నారు. ఉద్యమంలో 1,200 మంది ప్రాణత్యాగం చేశారని ప్రకటించిన సీఎం కేసీఆర్ కేవలం 400 కుటుంబాలకే రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించారు. ఇందులో 29 మంది కుటుంబాల అడ్రస్‌లు దొరకడం లేదని చెప్పడం వీరికే చెల్లుతుందన్నారు. గిరిజనులను సమాధి చేస్తున్నారు: సున్నం ఏపీలో విలీనం చేసిన ఏడు మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య అన్నారు. రెండు ప్రభుత్వాలు కలసి గిరిజనులను సమాధి చేసేందుకు కంకణం కట్టుకున్నట్లుందని చెప్పారు. గవర్నర్ ప్రసంగం అరచేతిలో వైకుంఠం చూపుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ స్పీచ్‌ను అచ్చుగుద్దినట్లు గవర్నర్ చదవి వినిపించారని రాజయ్య విమర్శించారు. ఎన్నికల వాగ్దానాలు ప్రతిబింబించలేదు: చాడ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ చేసిన వాగ్దానాల అమలు గవర్నర్ ప్రసంగంలో పూర్తిస్థాయిలో ప్రతిబింబించలేదు. దళితులకు మూడెకరాల భూమి, జీవో 58 ప్రకారం గుడిసెలు వేసుకున్న వారికి ఇళ్ల పట్టాలు, కేజీ టు పీజీ వంటి ప్రధాన సమస్యల ప్రస్తావన లేకపోవడం దాటవేత వైఖరికి అద్దం పడుతోంది. పాతబస్తీకి మెట్రోరైలు విస్తరణ ప్రస్తావన లేకపోవడం బాధాకరం. బడ్జెట్లో పొందుపరిచిన నిధులతో వాటర్ గ్రిడ్ ద్వారా ఇంటింటికి నీరు ఎలా సాధ్యపడుతుంది. కోటి ఎకరాలకు సాగునీరు, 45 వేల చెరువుల పునరుద్ధరణ ఎలా సాధ్యమవుతుంది. సామాజిక న్యాయంపై నిర్లక్ష్యం: తమ్మినేని సామాజిక న్యాయంపై ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల గురించి చెప్పకపోవడం ఆశ్చర్యాన్ని కలి గించింది. 92 శాతం మంది ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల గురించి, వారి సంక్షేమం గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ రూల్స్ రూపొందించడం, ఎస్సీ, ఎస్టీ కమిషన్ల చైర్మన్ పోస్టుల భర్తీ గురించి ప్రస్తావనే లేదు. బీసీ, మైనారిటీ, వికలాంగుల సబ్‌ప్లాన్ చట్టాల గురించి పేర్కొనకపోవడం శోచనీయం. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల గురించి పట్టించుకోలేదు. గిరిజనులపై చిత్తశుద్ధి లేదు: గిరిజన సంఘం రాష్ట్రం బంగారు తెలంగాణ అయిపోయినట్లే గవర్నర్ తన ప్రసంగంలో భ్రమ కల్పించారు. ప్రత్యేక సమస్యలు ఎదుర్కొంటున్న గిరిజన ప్రాంతాలు, గిరిజనుల ప్రస్తావనే లేదు. మారుమూల ప్రాంతాల్లో మాతా శిశు మరణాలు, గిరిజనుల గురించి మాట్లాడలేదు. గిరిపుత్రుల వైద్య, ఆరోగ్య సమస్యల పరిష్కారానికి చర్యల గురించి పేర్కొనలేదు. -
'అర్థం కాకూడదని ఇంగ్లీషులో చదివారు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ లో అంకెల గారడీ చేశారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు విమర్శించారు. బడ్జెట్ లో అన్ని వర్గాలను మోసం చేశారని, అంకెలకు వాస్తవాలకు పొంతన లేదని అన్నారు. అసెంబ్లీ సోమవారానికి వాయిదా పడిన తర్వాత మీడియా పాయింట్ వద్ద వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు మాట్లాడారు. రాష్ట్రంలో ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడానికి కనీసం రూ.10 వేల కోట్లు అవసరమవుతాయని, బడ్జెట్ లో చాలా తక్కువ కేటాయించారని చెప్పారు. నిధులు కేటాయించకుండా ప్రాజెక్టులు ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు. బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వలేదని, మహిళలకు మొండిచేయి చూపారని వాపోయారు. డ్వాక్రా మహిళలకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని ఆరోపించారు. బడుగు, బలహీన వర్గాల వ్యతిరేక బడ్జెట్ అని పేర్కొన్నారు. ప్రజలకు ఎక్కడ అర్థమవుతుందోనని బడ్జెట్ ను మంత్రి యనమల రామకృష్ణుడు ఇంగ్లీషులో చదివారని ఎద్దేవా చేశారు. నయవంచన బడ్జెట్, ప్రజలకు ద్రోహం చేసే బడ్జెట్ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, కె. శ్రీనివాసులు, అత్తార్ చాంద్ బాషా తదితరులు మీడియాతో మాట్లాడారు. -
'ఎమ్మెల్సీ ఫలితాలతో ప్రజావ్యతిరేకత బట్టబయలు'
హైదరాబాద్: ఎమ్మెల్సీ ఫలితాలతో ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత బయటపడిందని టీటీడీపీ ఎమ్మెల్యే నరసారెడ్డి ఆరోపించారు. నిన్న లాబీల్లోకి రాకుండా ప్రభుత్వం తమను అడ్డుకుందని, ఈ రోజు అసెంబ్లీ గేటువద్దే అడ్డుకున్నారని, రేపు హైదరాబాద్ లో ఉండనిస్తారో లేదోనని టీటీడీపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. గురువారం వారు మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ...సస్పెండైన ఎమ్మెల్యేలు సభలోకి వెళ్లడానికి మాత్రమే వీళ్లేదని అసెంబ్లీ ప్రాంగణంలోకి రాకుండా ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. సస్పెన్షన్ వ్యవహారంలో ప్రభుత్వ తీరు బాగోలేదన్నారు -
సభ జరుగుతున్నప్పుడు ప్రత్యక్ష ప్రసారాలొద్దు
ఏపీ స్పీకర్ కోడెల ఆదేశాలు హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో సభ వెలుపల (అసెంబ్లీ ప్రాంగణంలో) ప్రత్యక్ష ప్రసారాలు ఇవ్వొద్దని ఏపీ శాసన సభాపతి (స్పీకర్) డాక్టర్ కోడెల శివప్రసాదరావు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. అలా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌తో పాటు వివిధ పార్టీల శాసన సభాపక్ష కార్యాలయాల నుంచి ప్రత్యక్ష ప్రసారాలు చేయవద్దని ఆదేశించారు. -
అన్ని వర్గాలకూ అన్యాయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను అన్ని వర్గాల వ్యతిరేక బడ్జెట్‌గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభివర్ణించింది. మాటల గారడీ తప్ప సరైన కేటాయింపులు జరగలేదని ధ్వజమెత్తింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు షేక్ బేపారి అంజాద్ బాషా, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిలు.. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ. 1.13 కోట్ల బడ్జెట్లో మైనారిటీ వర్గాలకు తీవ్ర అన్యాయం జరిగిందని, వికలాంగులకు కేవలం రూ.45 కోట్లు మాత్రమే కేటాయించారని బాషా విమర్శించారు. మైనారిటీలకు తెలంగాణ ప్రభుత్వం రూ.1,500 కోట్లు కేటాయిస్తే, ఏపీ బడ్జెట్లో కేవలం రూ.370 కోట్లు కేటాయించారన్నారు. ఎస్సీలకు తెలంగాణలో రూ.6 వేల కోట్లు కేటాయించగా.. ఇక్కడ రూ.2123 కోట్లు, ఎస్టీలకు అక్కడ రూ.3,300 కోట్లు కేటాయించగా ఏపీలో రూ.990 కోట్లు కేటాయించారని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులకు రూ.5 వేల కోట్లు కేటాయించినా.. అందులో రూ.1,600 కోట్లు పట్టిసీమకు పోతే మిగిలేవి రూ.3 వేల కోట్ల పైచిలుకేనన్నారు. ఈ కేటాయింపులు పెంచేంత వరకు వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తుందని చెప్పారు. ఈ వర్గం ఆ వర్గం అని చూడకుండా అన్ని వర్గాలకు అన్యాయం చేసిన ప్రజా వ్యతిరేక బడ్జెట్ ఇదని చెవిరెడ్డి విమర్శించారు. కీలకమైన అంశాలకు నామ మాత్రపు కేటాయింపులే జరిగాయని, నిరుద్యోగ భృతి, అంగన్వాడీల జీతాల పెంపు వంటి అంశాలను బడ్జెట్లో ప్రస్తావించలేదన్నారు. సంక్షేమ రంగానికి కూడా భారీ కోత పెట్టమే కాకుండా అన్ని వర్గాలను మోసం చేసేలా ఈ బడ్జెట్ ఉందన్నారు. 10 జిల్లాల తెలంగాణ ప్రభుత్వానికంటే 13 జిల్లాల ఏపీ తన బడ్జెట్లో చాలా తక్కువ కేటాయింపులు జరిగాయని చెప్పారు. ఏ మంత్రికీ సబ్జెక్ట్‌పై అవగాహన లేదు.. బడ్జెట్‌కు ముందు కూడా చెవిరెడ్డి మీడియా పాయింట్లో మాట్లాడారు. చంద్రబాబు కేబినెట్లోని ఏ మంత్రికీ సబ్జెక్ట్‌పై అవగాహన లేదని, ఒక మంత్రిని అడిగితే మరో మంత్రి సమాధానం చెబుతున్నారని ఎద్దేవా చేశారు. అడిగినదానికి సరిగ్గా చెప్పలేక వైఎస్సార్సీపీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారన్నారు. చంద్రబాబు ఎందుకు ఈ అసమర్ధ మంత్రులను పెట్టుకున్నట్టని ప్రశ్నించారు. సభలో అధికార పక్షం హుందాగా వ్యవహరించాలని, తల్లి కాంగ్రెస్.. పిల్ల కాంగ్రెస్ అంటూ విమర్శించడం మంచి సంప్రదాయం కాదని సూచించారు. రాష్ట్రంలో 7.95 లక్షల ఇళ్లు పూర్తి చేశామంటున్నారని.. తొమ్మిది నెలలవుతుంటే ఒక ఇటుక కట్టడం కాదు కదా, ఒక్క ఇల్లు మంజూరు చేసిన దాఖలాలు లేవన్నారు. కాంట్రాక్టర్లకు రూ. 395 కోట్లు బకాయిలున్నాయని చెప్పారు. శాసనసభ సాక్షిగా గవర్నర్‌తో అబద్దాలు చెప్పిస్తారా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. -
సీమ కరువుపై చులకన తగదు: గడికోట
సాక్షి, హైదరాబాద్: రాయలసీమలో నెలకొన్న తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు, కరువును అధిగమించే చర్యల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని వైఎస్సార్ సీపీ శాసనసభాపక్ష సమన్వయకర్త గడికోట శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కరువు చాలా తీవ్రంగా ఉం దని, ఈ సమస్యపై చర్చించాలని కోరితే పాలకపక్షం చులకనగా వ్యవహరించడం భావ్యం కాదని అన్నారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కరువు, రైతన్నల ఆత్మహత్యలపై అసెంబ్లీ లో సంతాపం ప్రకటించాలని తమ పార్టీ కోరితే ఆ సంప్రదాయం లేదని, ఆనవాయితీ కాదని చంద్రబాబు చెప్పడం శోచనీయమన్నారు. ఆర్నెల్ల కాలంలో ఆకలితో 86 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా, పట్టీపట్టనట్లు వ్యవహరించడం చంద్రబాబుకే చెల్లిందని దుయ్యబట్టారు. శ్రీశైలం డ్యామ్ నుంచి 43 వేల క్యూసెక్కుల నీళ్లు దిగువకు పోతుండటంతో గత ఏడాది కాలంగా రాయలసీమ ఎడారిగా మారుతోందని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో 541 మండలాలు దుర్భిక్షంతో అల్లాడుతున్నాయంటూ టీడీపీ అధికార గెజిట్ అయిన ‘ఈనాడు’ రాసిన కథనాన్ని శ్రీకాంత్‌రెడ్డి విలేకరులకు చూపించారు. రాష్ట్రంలో ఇంత దారుణంగా కరువు తాండవిస్తున్నా చంద్రబాబు ఇంతవరకు ఒక్క రూపాయి కేటాయించిన పాపాన పోలేదన్నారు. కరువు ప్రాంతాల విషయంలో బాబు పూర్తి నిర్లక్ష్యాన్ని, అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నో ప్రజా సమస్యలు ఉన్నాయని, వాటన్నింటిపై చర్చించేందుకు వీలుగా అసెంబ్లీని 15 రోజుల పాటు నిర్వహించాలని తమ పార్టీ కోరితే.. ‘మాకు వేరే పనులున్నాయి..’ అని బీఏసీలో సీఎం చెప్పడం ప్రజా సమస్యలపై వారి చిత్తశుద్ధిని తేట తెల్లం చేస్తోందని విమర్శించారు. కేవలం నాలుగు రోజులు జరిగే అసెంబ్లీ సమావేశాలను సీరియస్‌గా తీసుకోకుండా చంద్రబాబు టూర్లు వెళ్లడం దురదృష్టకరమన్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రాయలసీమ ప్రజలు ‘నీళ్లో రామచంద్రా.. దాహమో రామచంద్రా..’ అని గొంతెత్తి వేడుకుంటున్నా చంద్రబాబుకు చీమకుట్టినట్టుగా కూడా లేదన్నారు. ప్రజా సమస్యలపై వైఎస్సార్ సీపీ రాజీలేని పోరాటం చేస్తుందని, ప్రజలు హుద్ హుద్ తుపాను విషయంలో స్పందించిన విధంగానే రాయలసీమ కరువుపై కూడా స్పందించాలని విజ్ఞప్తి చేశారు. -
అసెంబ్లీ మీడియా పాయింట్: ఎవరెవరూ ఏమన్నారూ..?
‘మెట్రో’పై మజ్లిస్‌తో టీఆర్ఎస్ కుమ్మక్కు మెట్రో అలైన్మెంట్ విషయంలో టీఆర్ఎస్ ఎంఐఎంకు దాసోహంగా వ్యవహరించింది. ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. ఎవరినీ సంప్రదించలేదు. ఒకే ఎమ్మెల్యేలను పిలిచి సమీక్ష నిర్వహించడం తగదు. ఎంఐంఎ సూచించిన అలైన్మెంట్తో ఇబ్బందులు తప్పవు.మెట్రోరైలుపై టీఆర్ఎస్ వైఖరీ స్పష్టంగా లేదు.విపక్షాలను సంప్రదించలేదు. సలహాలు, సూచనలు తీసుకోలేదు. కేవలం ఎంఐఎం కనుసన్నల్లో టీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ నడుపుతుందా? ఎంఐఎం నడుపుతుందా? అర్థం కావడం లేదు. - కె.లక్ష్మణ్ బీజేపీ ఎమ్మెల్యే సింగరేణి కార్మికులకు వైద్య సేవలందించాలి సింగరేణి కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి. ప్రస్తుతం వైద్యసేవలు అధ్వానంగా ఉన్నాయి. కార్మికుల కుటుంబాలకు కూడా వైద్య సేవలు అందించాలి. - పీ వెంకటేశ్వర్లు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆ ముగ్గురూ వ్యతిరేకంగా ఓటు వేయాలి టీడీపీ బీ ఫాంపై గెలిచి పార్టీ ఫిరాయించిన ముగ్గురు ఎమ్మెల్యేలకు విప్‌ను అందజేశాం. ప్రభుత్వానికి వ్యతి రేకంగా ఓటు వేయాలి. విప్ ఉల్లఘించాలనుకుంటే పదవులకు రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో దిగాలి. లేకుంటే ప్రజలు క్షమించరు. సభలో రేవంత్‌రెడ్డిని మాట్లాడనీయకుండా గొంతునొక్కుతున్నారు. చంద్రబాబుపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారు.ప్రజా శ్రేయస్సుపై టీఆర్ఎస్కు పట్టింపు లేదు. -సండ్ర వెంకట వీరయ్య, టీడీపీ ఎమ్మెల్యే కాంట్రాక్టు ఉద్యోగులకు భద్రత కల్పించాలి రాష్ట్రంలోని కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పే కమీషన్ పీఆర్సీని అమలు చేయాలి. - సున్నం రాజయ్య , సీపీఎం ఎమ్మెల్యే చర్చ జరగకుండా అడ్డగింతలు ప్రజాసమస్యలపై చర్చ జరుగకుండా అడ్డుకుంటున్నారు. చంద్రబాబు మోసం, పొన్నాల పాపాల పుట్ట బయట పడుతుందని అడ్డుకుంటున్నారు. నిజాలు బయటపెట్టి తీరుతాం. టీడీపీ-బీజేపీలు సభలో దుర్మార్గాంగా వ్యవహరిస్తున్నాయి. ఇంకా ఆంధ్ర పెత్తనాన్ని సహించం. -వి.శ్రీనివాస్‌గౌడ్,జీవన్ రెడ్డి, రామలింగారెడ్డి, రమేష్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆంధ్ర దుర్మార్గాలు తెలంగాణలో సాగవు ఆంధ్ర దుర్మార్గాలు తెలంగాణలో సాగవు. తెలంగాణను అడుగడుగున అడ్డుకున్న విషయం అందరికి తెలుసు.ప్రస్తుతం విద్యుత్‌ను కూడా అడ్డుకుంటున్నారు. నాక్ చైర్మన్‌గా చంద్రబాబు ప్రకటించుకోవడం విడ్డూరంగా ఉంది. - ఏనుగు రవీందర్ రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో బంజారా, ఆదివాసీ భవన్లు నిర్మించేందుకు రెండు ఎకరాల స్థలం కేటాయిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం చాలా ఆనందకరం. అడగకుండానే కల్యాణలక్ష్మి పథకం అందజేసినందుకు కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. గిరిజనులు, ఆదివాసీలకు కూడా ఎస్సీలతో సమానంగా మూడు ఎకరాలు భూమి కేటాయించేందుకు కూడా సీఎం అంగీకరించారు. 500 కుటుం బాల కంటే ఎక్కువ ఉన్న తండాలను పంచాయతీలుగా మార్చేందుకు కూడా ముఖ్యమంత్రి సంసిద్ధత వ్యక్తం చేశారు. -గిరిజన ఎమ్మెల్యేలు మదన్‌లాల్, శంకర్‌నాయక్, రేఖానాయక్, బాబూరావునాయక్, కోవలక్ష్మి సభను అడ్డుకోవడం దురదృష్టకరం ప్రశ్నోత్తరాలసమయంలో సభను అడ్డుకోవడం దురదృష్టకరం. భూముల విషయంలో టీడీపీ బండారం బయట పడుతుందని అడ్డుకుంటున్నారు. మెట్రోరైలు అలైన్‌మెంట్‌పై సమాధానాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సభను అడ్డుకుంటే అభివృద్ధిని అడ్డుకోవడమే. విభజనచట్టం ప్రకారం రూల్స్‌కు వ్యతిరేకంగా టీడీపీ సభ్యులు నడుస్తున్నారు. - కొండా సురేఖ, టీఆర్ఎస్ ఎమ్మెల్యే లాబీ ముచ్చట్లు: ఎందుకీ ఎమ్మెల్యే పదవి..!? ‘బీసీ సంఘ నేతగా ఉన్నప్పుడు ఈ నాయకులంతా నా దగ్గరికే వచ్చే వారు. ఇప్పుడు ఒక్కరూ పట్టించుకోవడం లేదు. చివరకు టీడీపీ నాయకత్వం కూడా అలాగే కనిపిస్తోంది. మాట్లాడడానికి అవకాశమే ఇవ్వడం లేదు. ఇక్కడి కంటే బయటే బావుంది.. ఎందుకీ ఎమ్మెల్యే పదవి..’.. ఎల్బీనగర్ టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య వైరాగ్యంతో చేసిన వ్యాఖ్యలివి! అసెంబ్లీ సమావేశాలు మొదలైన రోజు నుంచీ ఆయన టీడీపీతో అంటీ ముట్టనట్టుగానే ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు వారం పాటు సస్పెండైనరోజు సభలో లేని ఆయన.. మరుసటిరోజు సభకు వచ్చి బడ్జెట్ వివరణలపై మామూలుగా చర్చలో పాల్గొన్నారు. ఒక విధంగా తనకు సభలో గుర్తింపే లేదన్న బాధ ఆయన మాటల్లో వ్యక్తమైంది. ‘నేను రాజీనామా చేద్దామనే అనుకుంటున్నా.. కానీ మా వాళ్లంతా వద్దని అడ్డం పడుతున్నారు..’ అని ఆయన గురువారం అసెంబ్లీ లాబీల్లో వ్యాఖ్యానించారు. రేవంత్.. మళ్లీ సస్పెండ్! టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని మళ్లీ సస్పెండ్ చేస్తారన్న వార్త అసెంబ్లీ లాబీల్లో ఒక్కసారిగా గుప్పుమంది. గురువారం మధ్యాహ్నం సభ వాయిదాపడే ముందు తనకు మాట్లాడడానికి అవకాశమివ్వాలని రేవంత్ మరోసారి స్పీకర్‌ను కోరారు. కానీ స్పీకర్ అవకాశం ఇవ్వకపోవడంతో అసంతృప్తి చెంది రేవంత్ హెడ్‌ఫోన్స్‌ను విసురుగా నేలకు విసిరి కొట్టారు. దీంతో స్పీకర్ విషయంలో రేవంత్ అనుచితంగా ప్రవర్తించార ని, ఆయన తిరిగి సభలోకి వెళ్లగానే సస్పెండ్ చే స్తారని ప్రచారం జరిగింది. ఈ సస్పెన్షన్ ఒక రోజా, మిగిలి ఉన్న రెండు రోజులా? అంటూ పలువురు వాకబు కూడా చేశారు. అసలు రెండు మూడు నెలల పాటు అని.. కాదు కాదు ఆరు నెలలు సస్పెండ్ అయినట్లేనని కూడా చెప్పుకొన్నారు. పారిశ్రామిక బిల్లుపై మాట్లాడేందుకు టీడీపీ తరఫున రేవంత్‌రెడ్డి లేస్తారని, అప్పుడు సస్పెండ్ చేస్తారని ఊహాగానాలు బయలుదేరాయి. -
అసెంబ్లీ మీడియా పాయింట్
ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి శంషాబాద్ విమానాశ్రయంలోని డొమెస్టిక్ టెర్మినల్‌కి ఎన్టీఆర్ పేరు కాకుండా మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావుగానీ, లేదా గిరిజన యోధుడు కొమురం భీం పేరును ప్రతిపాదించాం. తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించేలా ఈ నిర్ణయం తీసుకున్నాం. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం పీవీ పేరుకు పెద్దపీట వేస్తుందో.. లేక మజ్లిస్ భాష్యానికి మద్దతు పలుకుతుందో చూడాలి. - డాక్టర్ కె.లక్ష్మణ్, బీజేపీ శాసనసభా పక్ష నేత ఎన్టీఆర్ పేరు పెట్టడంలో టీడీపీ ప్రమేయం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని దేశీయ సర్వీసుల విభాగానికి (డొమెస్టిక్ టెర్మినల్) ఎన్టీఆర్ పేరు పెట్టడంలో టీడీపీ ప్రమేయం ఉంది. పేరు మార్పిడిపై కేబినెట్లోనూ చర్చ జరగలేదు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తాం. హైదరాబాద్ విమానాశ్రయానికి తెలంగాణ వ్యక్తుల పేర్లను ఎందుకు ప్రతిపాదించలేదో ప్రజలకు సీఎం కేసీఆర్ సంజాయిషీ ఇవ్వాలి. క్షమాపణ చెప్పాలి. శంషాబాద్ విమానాశ్రయ రెండు టెర్మినళ్లలో ఒకదానికి మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు, మరొకదానికి కొమురం భీంపేరు పెట్టాలి. - జి.కిషన్‌రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు ఆంధ్రలో ఎన్టీఆర్ పేరు పెట్టుకోండి శంషాబాద్ విమానాశ్రయ డొమెస్టిక్ టెర్మినల్‌కి ఎన్టీఆర్ పేరు పెట్టడం తగదు. బీజీపీ కూడా ఇందుకు మద్దతు పలుకుతోంది. తెలంగాణలోని ఎయిర్‌పోర్టుకు ఆంధ్రోళ్ల పేర్లెందుకు. మీకు అత్యవసరం అనుకుంటే ఆంధ్రలోనూ పలు విమానాశ్రయాలు ఉన్నాయి. వాటికి అక్కడి నేతల పేర్లను తగిలించుకోండి. తెలంగాణ యోధులు లేరా.. వారి పేర్లు పనికిరావా?ఒకవేళ పేరు మార్చాల్సి వస్తే సాయుధ పోరాటంలో ప్రాణత్యాగం చేసిన కొమురం భీం పేరును పెట్టాలి. - పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు, వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు యథాతథంగా కొనసాగించాలి కేంద్ర ప్రభుత్వం హఠాత్తుగా డొమెస్టిక్ టెర్మినల్ పేరు మార్చడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ప్రాణత్యాగం చేసి దేశానికి సేవలందించిన రాజీవ్‌గాంధీ పేరు మార్చడం తగదు. ఎన్టీఆర్ పేరు మార్పుపై శాసనసభ మెజారిటీ సభ్యులు ఇచ్చిన తీర్మానానికి కట్టుబడి ఉన్నాం. లేదంటే మొన్నటి వరకు ఉన్న పేరునే యథాతథంగా కొనసాగించాలి. - జె.గీతారెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే తెలంగాణకు వ్యతిరేకంగా బాబు కుట్రలు టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణకు వ్యతిరేక కుట్రలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. బాబు ప్రోద్బలంతోనే ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు పెట్టా రు. తెలంగాణలో అలజడి సృష్టించేందుకు కుట్ర ఇది. తెలంగాణలో ఆంధ్ర నాయకుల పేర్లెందుకు? బాబు వైఖరి ఇలానేసాగితే ప్రజల తిరుగుబాటు తప్పదు. భవిష్యత్తులో టీడీపీ ఉనికికే ప్రమాదం. - భాస్కర్‌రావు, కాంగ్రెస్ ఎమ్మెల్యే తెలుగుజాతి ఆత్మగౌరవం పెంచింది ఎన్టీఆరే దేశంలోనే తెలుగుజాతి అత్మగౌరవం పెంచింది ఎన్టీఆరే. ఆయన తెలంగాణ, ఆంధ్రా అని ఏనాడూ తేడా చూపలేదు. అట్టడుగువర్గాల వారికి చట్టసభాపతులుగా హోదాలు కల్పించిన ఘనత ఎన్టీఆర్‌దే. పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేశారు. కాంగ్రెస్ అధికారం లో ఉన్నప్పుడు ఆదివాసీ నేత కొమురం భీంను ఎం దుకు గుర్తించలేదు. ఎయిర్‌పోర్టులో కేవలం దేశీయ ప్రాంగణానికే ఎన్టీఆర్ పేరు పెట్టారు. - సండ్రవెంకట వీరయ్య, టీడీపీ ఎమ్మెల్యే ప్రేముంటే.. భారతరత్న ఇప్పించుకోండి శంషాబాద్‌లో ఉన్న ఒక రన్‌వేని విడదీసి డొమెస్టిక్ టెర్మినల్‌కి ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎన్టీఆర్‌పై అంత ప్రేమ ఉంటే భారతరత్న ఇప్పించుకోండి. వైజాగ్, తిరుపతితోపాటు ఆంధ్రలో ఉన్న అన్ని విమానాశ్రయాలకు ఆయన పేరునే పెట్టుకోండి. ఒక ప్రాంతానికి పరిమితమైన వ్యక్తి పేరును.. ఇంకో ప్రాంతం మీద బలవంతంగా రుద్దడాన్ని తెలంగాణ ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు. బాబు ఆలోచన విధానం మార్చుకోకుంటే.. తెలంగాణలో టీడీపీ గల్లంతు కాక తప్పదు. - టి. జీవన్‌రెడ్డి , కాంగ్రెస్ ఎమ్మెల్యే నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలి రాష్ట్ర విభజన జరిగి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు పెట్టడం సరికాదు. కేంద్రం తన జీవోను వెనక్కి తీసుకొవాలి. ఎన్టీఆర్ మృతి కారణమైన చంద్రబాబు తిరిగి ఆయన పేరుతో పబ్బం గడుపుకొనేందుకు ప్రయత్నించడం శోచనీయం. కొత్త రాష్ట్రంలో కనీసం శాసనసభ నిర్ణయం కూడా పరిగణలోకి తీసుకోలేదు. ఆంధ్రా రాష్ర్టంలోని ఎయిర్‌పోర్టులకు ఎన్టీఆర్ పేరు పెట్టుకోండి. - డీకే అరుణ, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎయిర్ పోర్టుకు ఎన్టీఆర్ పేరా..? తెలంగాణలోని ఎయిర్‌పోర్టుకు పక్కరాష్ట్రం వ్యక్తి ఎన్టీఆర్ పేరు పెట్టడం సరికాదు. కేంద్రం చంద్రబాబు కనుసన్నల్లో నడుస్తోంది. ఎన్టీఆర్ జాతీయస్థాయి నాయకుడేమీకాదు. కేంద్రం తక్షణమే ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి. లేకుంటే తెలంగాణలో ఆంధ్రుల పేర్లన్నింటినీ మారుస్తాం. - శ్రీనివాస్‌గౌడ్, రసమయి, బాలరాజు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేంద్రం నిర్ణయం సరైంది కాదు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో స్వదేశీ టెర్మినల్‌కు ఎన్టీరామారావు పేరును పెడుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయం సరైంది కాదు. టీడీపీ మినహా అన్నిపార్టీలు పేరు మార్చకూడదని ఏకగ్రీవంగా తీర్మానం చేయాలని పట్టుబట్టాయి. ఈ ఏకపక్ష నిర్ణయం పట్ల మేమంతా నిరసన వ్యక్తం చేశాం. దేశం కోసం ప్రాణాలర్పించిన మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ పేరును యధాతథంగా కొనసాగించాలి. - షబ్బీర్ అలీ, కాంగ్రెస్ ఎమ్మెల్సీ భూముల దుర్వినియోగంపై విచారణ జూబ్లీహిల్స్, ఫిలిం సొసైటీలకు కేటాయించిన భూములు పెద్దఎత్తున పక్కదారి పట్టాయి. కొందరు అక్రమార్కులు వాటిని ఇష్టానుసారం పంచుకున్నా రు. ఈ దుర్వినియోగంపై సీబీఐచే విచారణ జరిపించాలి. అక్రమార్కులపై రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించాలి. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియాగాంధీపై కొత్త సిలబస్‌లో పాఠ్యాంశంగా చేర్చాలి. - పొంగులేటి సుధాకర్‌రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఆశ వర్కర్ల వేతనాలు పెంచాలి ప్రభుత్వం 25 వేల మంది ఆశ వర్కర్లను పట్టించుకోవడం లేదు. వారికి కేంద్రం నుంచి కేవలం నెలకు రూ. 400 వేతనం మాత్రమే లభిస్తోంది. గత 20 మాసాలుగా వేతనాలు లేవు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి, బకాయిలు చెల్లించి వేతనాలు పెంచేలా కృషి చేయాలి. - సున్నం రాజయ్య, సీపీఎం ఎమ్మెల్యే తక్షణమే కార్పొరేషన్లను విభజించాలి రాష్ట్ర విభజన జరిగినా.. కార్పొరేషన్ల విభజన జరగలేదు. ఉమ్మడిగా 89 కార్పొరేషన్లు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో నవంబర్ జీతాలకు సమస్య ఏర్పడింది. వెంటనే కార్పొరేషన్లను విభజించాలి. తెలంగాణలోని ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరు పెట్టడం తెలుగు ప్రజల మనోభావాలను దెబ్బతీయడమే. - రవీంద్ర కుమార్, సీపీఐ ఎమ్మెల్యే -
వారి కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వండి: సండ్ర
హైదరాబాద్: ప్రభుత్వ సర్వీసులో ఉండి అనార్యోగంతో విధులు నుంచి తప్పుకున్న వారి కుటుంబ సభ్యులకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని టీటీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమం సమయంలో సకల జనుల సమ్మె కాలాన్ని మిగిలిన ఉద్యోగుల వలే సింగరేణి ఉద్యోగులను కూడా వేతనంతో కూడిన సెలవు దినాలుగా పరిగణించాలని ప్రభుత్వానికి సూచించారు. ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోని 9 నియోజకవర్గాలకు రెండో పంటకు నీరు అందించేలా చర్యలు చేపట్టాలని... అలాగే నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారా పంటలకు నీరు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సండ్ర వెంకట వీరయ్య సూచించారు. -
అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద రణరంగం
హైదరాబాద్ : అసెంబ్లీ ప్రాంగణంలో సోమవారం యుద్ధ వాతావరణం నెలకొంది. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేల మధ్య తోపులాట జరిగింది. ఇరు ప్రాంత నేతలు ఒకరినొకరు తోసుకోవటంతో అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కనీసం బీఏసీని కూడా పిలవకుండా తెలంగాణ బిల్లును అసెంబ్లీలో ఎలా ప్రవేశపెడతారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లు ప్రతులను తగులబెట్టారు. దీంతో చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి...వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. గండ్రకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తోడు కావటంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల సాక్షిగా ఈ దాడి జరిగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మీద దాడి జరగడంతో పలువురు ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా ధర్మాన కృష్ణదాసు అభివర్ణించారు. ఇందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడులే బాధ్యత వహించాలన్నారు. జై సమైక్యాంధ్ర, జై తెలంగాణ నినాదాలతో మీడియా పాయింట్ వద్ద యుద్ధ వాతావరణం నెలకొంది. పోలీసులు సర్దిచెప్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నా, ఏ ఒక్కరూ వినే పరిస్థితి కనిపించడంలేదు. అసెంబ్లీలో కూడా సమైక్యతీర్మానం చేయాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ధర్నా చేశారు. సమైక్య రాష్ట్రం కోసం చివరివరకు పోరాడతామని స్పష్టం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మీడియాతో మాట్లాడనీయకుండా అక్కడినుంచి పంపేందుకు ప్రయత్నాలు చేశారు.