
ఇటీవల టీడీపీ గ్రాఫ్ తగ్గింది
టీడీపీ ఎమ్మెల్యేలు ప్రజాసమస్యలను పట్టించుకోవడం లేదు: జేసీ దివాకర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఇటీవల కాలంలో టీడీపీ గ్రాఫ్ తగ్గిందని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ఇందుకు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులదే లోపమని స్పష్టం చేశారు. అందరూ కష్టపడితేనే అభివృద్ధి సాధ్యమని తెలిపారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడారు. టీడీపీ ఎమ్మెల్యేలు ప్రజలకు సన్నిహితంగా ఉండడం లేదు.. ప్రజా సమస్యలను అసలు పట్టించుకోవడం లేదన్నారు.
ఎంపీ, ఎమ్మెల్యేల పట్ల అలసత్వం చూపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు మేల్కోవాలని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి సూచించారు. ఇదే మాట బాబుకు చాలా సార్లు చెప్పానన్నారు. ఇటీవల కాలంలో పార్టీల దిగజారుడుతనం ఎక్కువైందని చెప్పారు. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటే లాభం లేదన్నారు. ఎన్ని రోజులు మోసం చేస్తామని ప్రశ్నించారు. సభ సజావుగా నడిచేలా చూడాల్సిన బాధ్యత ప్రతిపక్షానిదేనని జేసీ సూచించారు.