వారి కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వండి: సండ్ర | Sandra venkata veeraiah talked in assembly media point | Sakshi
Sakshi News home page

వారి కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వండి: సండ్ర

Published Thu, Nov 20 2014 1:06 PM | Last Updated on Sat, Sep 2 2017 4:49 PM

Sandra venkata veeraiah talked in assembly media point

హైదరాబాద్: ప్రభుత్వ సర్వీసులో ఉండి అనార్యోగంతో విధులు నుంచి తప్పుకున్న వారి కుటుంబ సభ్యులకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని టీటీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమం సమయంలో సకల జనుల సమ్మె కాలాన్ని మిగిలిన ఉద్యోగుల వలే సింగరేణి ఉద్యోగులను కూడా వేతనంతో కూడిన సెలవు దినాలుగా పరిగణించాలని ప్రభుత్వానికి సూచించారు.

ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోని 9 నియోజకవర్గాలకు రెండో పంటకు నీరు అందించేలా చర్యలు చేపట్టాలని... అలాగే నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారా పంటలకు నీరు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సండ్ర వెంకట వీరయ్య సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement