
ఎమ్మెల్యే సండ్రకు బెయిల్ మంజూరు
హైదరాబాద్ : 'ఓటుకు కోట్లు' కేసులో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు ఏసీబీ కోర్టు మంగళవారం కూడిన షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ మంజూరుకు రూ. 2 లక్షల పూచీకత్తు చెల్లించాలని పేర్కొంది. అలాగే నియోజకవర్గం దాటి వెళ్లకూడదని ఏసీబీ కోర్టు పేర్కొంది.
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటుకు కోట్లు కేసులో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను ఏసీబీ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ సండ్ర ఏసీబీ కోర్టును కోరారు. ఈ నేపథ్యంలో సండ్రకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి లక్ష్మీపతి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.