conditioned bail
-
స్వామి అసిమానందకు బెయిల్ మంజూరు
సమ్ఝౌతా ఎక్స్ప్రెస్ పేలుళ్ల కేసులో నిందితునిగా గత ఆరేళ్లుగా జైల్లో ఉన్న నవకుమార్ సర్కార్ అలియాస్ స్వామి అసిమానందుకు పంజాబ్, హర్యానా హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే.. బెయిల్ షరతులను ఆయన పాటించకపోవడంతో, అసిమానంద ఇంకా జైల్లోనే ఉండాల్సి వస్తుందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వర్గాలు అంటున్నాయి. ఈ విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కాగా, ఈ ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాలు చేసే అవకాశం లేకపోవడంతో.. ప్రత్యేకంగా ఒక స్పెషల్ లీవ్ పిటిషన్ను దాఖలు చేయడానికి ఏమైనా అవకాశం ఉందేమోనని ఎన్ఐఏ పరిశీలిస్తోంది. -
ఎమ్మెల్యే సండ్రకు బెయిల్ మంజూరు
హైదరాబాద్ : 'ఓటుకు కోట్లు' కేసులో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు ఏసీబీ కోర్టు మంగళవారం కూడిన షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ మంజూరుకు రూ. 2 లక్షల పూచీకత్తు చెల్లించాలని పేర్కొంది. అలాగే నియోజకవర్గం దాటి వెళ్లకూడదని ఏసీబీ కోర్టు పేర్కొంది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటుకు కోట్లు కేసులో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను ఏసీబీ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ సండ్ర ఏసీబీ కోర్టును కోరారు. ఈ నేపథ్యంలో సండ్రకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి లక్ష్మీపతి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.