
స్వామి అసిమానందకు బెయిల్ మంజూరు
సమ్ఝౌతా ఎక్స్ప్రెస్ పేలుళ్ల కేసులో నిందితునిగా గత ఆరేళ్లుగా జైల్లో ఉన్న నవకుమార్ సర్కార్ అలియాస్ స్వామి అసిమానందుకు పంజాబ్, హర్యానా హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే.. బెయిల్ షరతులను ఆయన పాటించకపోవడంతో, అసిమానంద ఇంకా జైల్లోనే ఉండాల్సి వస్తుందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వర్గాలు అంటున్నాయి. ఈ విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
కాగా, ఈ ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాలు చేసే అవకాశం లేకపోవడంతో.. ప్రత్యేకంగా ఒక స్పెషల్ లీవ్ పిటిషన్ను దాఖలు చేయడానికి ఏమైనా అవకాశం ఉందేమోనని ఎన్ఐఏ పరిశీలిస్తోంది.