
న్యూఢిల్లీ: హిందూ ఉగ్రవాదం, గోద్రా ఘటన, నీరవ్ మోదీ కేసులపై కొందరు చేసిన దుష్ప్రచారం ఒక్కరోజులోనే బట్టబయటైందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గురువారం అన్నారు. బుధవారం సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌లో పేలుడు కేసులో కింది కోర్టు యూపీఏ ప్రభుత్వం ఆపాదించిన హిందూ ఉగ్రవాదం అభియోగాన్ని కొట్టేసిందనీ, గోద్రా కేసులో మరో వ్యక్తిని దోషిగా తేల్చిందనీ, నీరవ్ మోదీ లండన్‌లో అరెస్టయ్యాడనీ, ఇవన్నీ ఒకే రోజు జరిగాయని జైట్లీ చెప్పారు. ‘నిజానికి, అబద్ధానికి ఉన్న ప్రాథమిక తేడా ఏంటంటే నిజం నిలిచి ఉంటుంది. అబద్ధం పడిపోతుంది. కొందరు చేసిన దుష్ప్రచారమంతా అబద్ధమని తేలింది. నిజం గెలిచింది’అని జైట్లీ తన బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment