
ముగిసిన సండ్ర ఏసీబీ కస్టడీ
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ఖమ్మం జిల్లా సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య రెండో రోజు ఏసీబీ కస్టడీ ముగిసింది. శుక్రవారం ఏసీబీ అధికారులు సండ్రను వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
వైద్య పరీక్షలు చేయించిన అనంతరం సండ్ర వెంకట వీరయ్యను ఏసీబీ అధికారులు కోర్టులో హాజరుపరచనున్నారు. ఓటుకు కోట్లు కేసులో సండ్రను రెండు రోజుల పాటు ఏసీబీ కస్టడీకి అప్పగించిన సంగతి తెలిసిందే. గురువారం కూడా ఏసీబీ అధికారులు సండ్రను విచారించారు. ఈ రోజుతో సండ్ర ఏసీబీ కస్టడీ ముగిసింది.