sakala janula samme
-
సకల జనుల సమ్మె కాలపు వేతనం వచ్చిందోచ్.. 11 ఏళ్ల తర్వాత!
సాక్షి, హైదరాబాద్: సకల జనుల సమ్మె కాలపు వేతనాలను ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు అందుకోబోతున్నారు. పదకొండేళ్ల విరామం తర్వాత ఇప్పుడు వారికి ఆ మొత్తం అందబోతోంది. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో 2011 సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 17 వరకు సకల జనుల సమ్మె జరిగిన విషయం తెలిసిందే. తర్వాత సమ్మె కాలాన్ని సెలవుగా ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఆర్టీసీలో వెంటనే అమలు కాలేదు. ఆ తర్వాత నిర్ణయం తీసుకున్నా.. సెలవు కాలపు వేతనాన్ని విధుల్లో ఉన్న ఉద్యోగులకే చెల్లించారు. ఆ సమయానికే పదవీ విరమణ పొందిన 8,053 మందికి ఇవ్వలేదు. దీంతో ఆ వేతనం కోసం వారు 11 ఏళ్లుగా పోరాడుతున్నారు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో ఆర్టీసీ ఉద్యోగుల సమాఖ్య నేతలతో మంత్రుల చర్చల సందర్భంగా ఈ డిమాండ్ పరిశీలనకు వచ్చింది. ఆ తర్వాత ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఈ మొత్తాన్ని విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. 3 డీఏలు, దసరా పండుగ అడ్వాన్సులాంటి వాటితోపాటు పదవీ విరమణ పొందిన అర్హులకు సమ్మె కాలపు వేతనం కింద రూ.25 కోట్లు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈమేరకు ఆర్టీసీ చీఫ్ పర్సనల్ మేనేజర్ పేరుతో సర్క్యులర్ శనివారం జారీ అయింది. చదవండి: కరెంట్ నష్టాల్లో... కుమురం భీం టాప్! -
విలీనం..పోరాటం..
-
సకలజనుల సమ్మెతో సమం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు వెనక్కు తగ్గకుండా ఉధృతంగా సమ్మె కొనసాగిస్తున్నారు. బుధవారం నగరంలో నిర్వహించిన సకల జనభేరీ సభకు అన్ని జిల్లాల నుంచి కార్మికులు, వారి కుటుంబ సభ్యులు తరలి వెళ్లారు. సభ నిర్వహించిన స్టేడియం సామర్థ్యం చిన్నది కావటంతో జేఏసీ నేతలు జనసమీకరణకు పెద్దగా యత్నించలేదు. అయినా జిల్లాల నుంచి కార్మికులు పెద్ద సంఖ్యలో హైదరాబాద్‌కు ప్రైవేటు బస్సుల్లో తరలివెళ్లారు. మిగిలినవారు ఆయా డిపోల ముందు నిరసనలు కొనసాగించారు. బుధవారంతో సమ్మె 26 రోజులు పూర్తి చేసుకుంది. గురువారంతో తెలంగాణ సాధన కోసం జరిపిన సకల జనుల సమ్మె కాలంతో సమమవుతుంది. అదనంగా ఒక్కరోజు దాటినా తెలంగాణ ఆర్టీసీ చరిత్రలో సుదీర్ఘ సమ్మెగా రికార్డుల కెక్కనుంది. 2013లో జరిగిన సకల జనుల సమ్మె సమయంలో 27 రోజుల పాటు బస్సులు నిలిపేసి కార్మికులు సమ్మె చేశారు. ఇప్పుడు అంతకంటే దీర్ఘకాల సమ్మెగా అవతరించనుంది. 72 శాతం బస్సులు తిప్పాం: ఆర్టీసీ బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 72.8 శాతం బస్సు లు తిప్పినట్టు ఆర్టీసీ ప్రకటించింది. 4,575 ఆర్టీసీ బస్సులు, 1,950 అద్దె బస్సులు తిప్పినట్లు వెల్లడించింది. 4,575 మంది తాత్కాలిక డ్రైవర్లు, 6,515 ప్రైవేట్ కండక్టర్లు విధులకు వచ్చారని, 5598 బస్సుల్లో టిమ్ యంత్రాలు వాడారని, 542 బస్సుల్లో పాత పద్ధతిలో టికెట్లు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. -
సమ్మెపై ఉత్కంఠ
-
సర్కార్ దిగిరాకపోతే సకల జనుల సమ్మె
సాక్షి, హైదరాబాద్: సమ్మె చేస్తున్న ఆర్టీసీ సంఘాల తో చర్చలు జరిపి ప్రభుత్వం విలీన చర్యలు చేపట్టకపోతే సమ్మె ఉధృతం చేయనున్నట్టు ఆర్టీసీ జేఏసీ, రాజకీయ పక్షాలు, ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక, ప్రజా సంఘాల అఖిల పక్ష సమావేశం ప్రకటించింది. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు టీపీసీసీ, టీజేఎస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ (రెండు గ్రూపులు), టీటీడీపీ, తెలంగాణ ఇంటి పార్టీ, జనసేన, శివసేన, ఎమ్మార్పీఎస్, బీసీ సంక్షే మ సంఘం, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య, తెలంగాణ మీడియా జాయింట్ యాక్షన్ కమిటీ, వివిధ ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. అలాగే భవిష్యత్ ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొని తమ సహకారాన్ని అందిస్తామని వెల్లడించాయి. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామరెడ్డి అధ్యక్షతన జరిగిన అఖిల పక్ష సమావేశం నిర్వహించారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం దిగిరాకపోతే మరో సకల జనుల సమ్మెకు సిద్ధం కావాలని అఖిల పక్ష నేతలు నిర్ణయించారు. ఈ నెల 19న రాష్ట్ర బంద్ నిర్వ హించాలని నిర్ణయించినా, గురువారం మధ్యాహ్నం సుందరయ్య విజ్ఞానకేంద్రంలో మరోసారి భేటీ అయ్యి దీనిపై తుది నిర్ణయం తీసుకోవాలని తీర్మానించారు. సమ్మెలో భాగంగా గురువారం డిపోల ఎదుట నిరసనలు, ఎమ్మార్వోలకు వినతిపత్రాల సమర్పణ, త్వరలోనే గవర్నర్‌కు మెమోరాండం అందజేయనున్నారు. అందరూ పాల్గొనాలి: కోదండరాం ప్రస్తుతం ఆర్టీసీ సమ్మెగా ఉన్నది కాస్తా సకల జనుల సమ్మెగా మారాల్సి ఉందని, ఇందులో ప్రధాన రాజకీయ పార్టీలు, కార్మిక, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు పాల్గొనాలని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం పిలుపునిచ్చారు. సమ్మె కొనసాగిస్తాం: ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ సమ్మె కొనసాగించి తీరుతామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామరెడ్డి స్పష్టం చేశారు. కాడిని మధ్యలో దించే ప్రసక్తేలేదని, తమ సంఘం ఏ పార్టీకి అనుబంధం కాదని చెప్పారు. ఆర్టీసీలో 48 వేల ఉద్యోగాలు తీసేసే హక్కు సీఎంకు లేదని, ఇది పూర్తిగా చట్టవిరుద్ధమని, దీనిపై పోరాటానికి న్యాయ పరమైన సలహాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు బీజేపీ ఎమ్మెల్సీ ఎన్.రాంచంద్రరావు తెలిపారు. కేసీఆర్ బెదిరింపులకు భయ పడేది లేదని, ఆర్టీసీకి సంబంధించి ఎలాంటి పోరాటానికి అయినా మద్దతునిచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధమని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్‌రెడ్డి చెప్పారు. కార్మికులెవరూ అధైర్యపడొద్దని మాజీ ఎంపీ అంజన్‌కుమార్ చెప్పారు. ముందే మద్దతిచ్చాం: చాడ సెల్ప్ డిస్మిస్ అనేది అత్యంత ఘోరమైన పదమని, ఇట్లా పిచ్చోడు కూడా మాట్లాడడని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. సమ్మె మొదలుకాక ముందే టీఆర్ఎస్కు హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో సీపీఐ మద్దతునిచ్చిందని, ఆర్టీసీ ప్రైవేటీకరణను సహించేది లేదని స్పష్టం చేశారు. ఆర్టీసీ కోసం పోరాడాలి.. ఆర్టీసీ నిర్వీర్యం చేసి ప్రైవేటుకు కట్టబెట్టే కుట్రను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రచారం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. కేసీఆర్ అహంకారానికి అడ్డుకట్ట వేసేందుకు పోరాటం కొనసాగించాలని చెప్పారు. ఆర్టీసీ ఓడితే, తెలంగాణ ఓడిపోయినట్టేనని అందువల్ల అన్ని వర్గాలు కలసి ఈ సంస్థ పరిరక్షణకు పోరాడాలని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ పిలుపునిచ్చారు. సీఎం ప్రతిష్టకు పోకుండా సమ్మె పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. 48 వేల మందిని ఒక్క కలం పోటుతో డిస్మిస్ చేస్తామంటే, చరిత్రలో నియంతలకు పట్టిన గతే సీఎంకు పడుతుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. ఈ భేటీలో విమలక్క (టీయూఎఫ్), రావుల చంద్రశేఖర్‌రెడ్డి (టీడీపీ), జిట్టా బాలకృష్ణారెడ్డి (యువ తెలంగాణ పార్టీ), రాజిరెడ్డి, థామస్‌రెడ్డి (ఆర్టీసీ జేఏసీ), చిక్కుడు ప్రభాకర్ (తెలంగాణ ప్రజాస్వామ్య వేదిక), సాధినేని వెంకటేశ్వరరావు, పోటురంగారావు (న్యూడెమోక్రసీ రెండు వర్గాలు), భుజంగరావు, సదానందం, విజయ్‌మోహన్, దత్తాత్రేయ (ఉపాధ్యాయ, ఉద్యోగ, విద్యార్థి సంఘాలు)ఇతర సంఘాల వారు పాల్గొన్నారు. సమ్మెపై ఉత్కంఠ: నేడు విచారించనున్న హైకోర్టు ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెను విరమించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై గురువారం హైకోర్టు విచారణ కొనసాగించనుంది. ఉస్మానియా విశ్వవిద్యాలయ రీసెర్చ్ స్కాలర్ ఆర్.సుబేందర్‌సింగ్ దాఖ లు చేసిన పిల్‌ను న్యాయమూర్తులు జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం విచారణ కొనసాగించనుంది. వ్యాజ్యం దాఖలు వెనుక ప్రజాహితమే లేదని, కార్మిక సంఘాల ప్రయోజనం దాగి ఉందని చెప్పి ప్రభు త్వం తన వైఖరిని వెల్లడించిందనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. సమ్మె చట్ట విరుద్ధమని, వెంటనే సమ్మె విరమించేలా హైకో ర్టు 2015లో వెలువరించిన మధ్యంతర ఉత్తర్వుల మాదిరిగానే ఇప్పుడు కూడా ఇవ్వాలని పిటిషనర్ కోరుతున్నారు. గురువారం నాటి విచారణలో ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రభుత్వ వివరణ ఇవ్వనుంది. -
సకల జనుల సమ్మె కాలానికి జీతాలివ్వరా?
హైదరాబాద్: సకలజనుల సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులకు వేతనం చెల్లిస్తామని ఇచ్చిన హామీని తెలంగాణ సీఎం కేసీఆర్ నిలబెట్టుకోవాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి7 నెలలు అవుతున్నా ఉద్యోగుల వేతనాల గురించి ఆయన ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. సుమారు మూడేళ్ల క్రితం నాటి ఈ సమ్మెలో పాల్గొన్నదాదాపు 20 వేల మంది ఉద్యోగులు ఇప్పటికే రిటైర్ అయ్యారన్నారు. ఎన్జీవో నేతలు కూడా తమ సొంత పదవుల కోసం పాకులాడుతూ.. ఉద్యోగుల సమస్యలను విస్మరిస్తున్నారని పొన్నం విమర్శించారు. ఉద్యగో సంఘాల నేతలు స్పందించకపోతే రిటైర్డ్ ఉద్యోగులతో కలిసి కాంగ్రెస్ పార్టీ ధర్నాలు నిర్వహిస్తుందని ఆయన హెచ్చరించారు. -
వారి కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వండి: సండ్ర
హైదరాబాద్: ప్రభుత్వ సర్వీసులో ఉండి అనార్యోగంతో విధులు నుంచి తప్పుకున్న వారి కుటుంబ సభ్యులకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని టీటీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమం సమయంలో సకల జనుల సమ్మె కాలాన్ని మిగిలిన ఉద్యోగుల వలే సింగరేణి ఉద్యోగులను కూడా వేతనంతో కూడిన సెలవు దినాలుగా పరిగణించాలని ప్రభుత్వానికి సూచించారు. ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోని 9 నియోజకవర్గాలకు రెండో పంటకు నీరు అందించేలా చర్యలు చేపట్టాలని... అలాగే నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారా పంటలకు నీరు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సండ్ర వెంకట వీరయ్య సూచించారు. -
స్ఫూర్తినిచ్చిన సకల జనుల సమ్మె
ఇల్లెందుఅర్బన్(ఖమ్మం) : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సింగరేణి కార్మికులు చేపట్టిన సకలజనుల సమ్మెకు ఈనెల 13వ తేదీతో మూడేళ్లు పూర్తికానున్నాయి. స్వరాష్ట్రం కోసం సింగరేణి పరిధిలోని నాలుగు జిల్లాల్లో కార్మికులు, అధికారులు చేపట్టిన ఆందోళనలు, నిరసనలు ఎంతో పలువురికి స్ఫూర్తినిచ్చాయి. ప్రధానంగా సకల జనుల సమ్మెను పురస్కరించుకుని సుమారు నెలన్నర రోజుల పాటు విధులు బహిష్కరించి నిరసన లు చేపట్టిన కార్మికుల పోరాటాలు చిరస్థాయి గా నిలిచిపోతాయని చెప్పవచ్చు. ఈ క్రమంలో స్వరాష్ట్ర సాధనకోసం సుదీర్ఘకాలం నిర్వహిం చిన సమ్మెలో పాల్గొన్న కార్మికుల త్యాగాలను గుర్తుచేసుకుంటూ తెలంగాణ బొగ్గు గని కార్మి క సంఘం(టీబీజీకేఎస్) రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య ఆధ్వర్యంలో ఈనెల 13వ తేదీన గోదావరిఖనిలో సింగరేణి కార్మికుల సకల జనుల సమ్మె పోరాట స్ఫూర్తి బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ మేరకు కొత్తగూడెం రీజీయన్ నుంచి సభకు భారీఎత్తున టీబీజీకేఎస్ నేతలు, కార్యకర్తలు తరలివెళ్లనున్నారు. కార్మికుల పోరాటాలు చిరస్మరణీయం... తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో సింగరేణి కార్మికులు నిర్విరామంగా పాల్గొన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబించిన నాన్చివేత ధోరణిని నిరసిస్తూ 2011 సెప్టెంబర్ 13వ తేదీన సింగరేణి వ్యాప్తంగా గని కార్మికు లు సకలజనుల సమ్మె చేపట్టారు. నాటి నుంచి అక్టోబర్ 17వ తేదీ వరకు సమ్మెలో పాల్గొన్న కార్మికులు ప్రతి రోజు వినూత్నరీతిలో ఆందోళనలు చేపట్టి తమ ఉద్యమ స్ఫూర్తిని నలుదిశలా చాటారు. 36 రోజుల పాటు విధులను బహిష్కరించి దక్షిణాది రాష్ట్రాల పరిశ్రమలు మూతబడే పరిస్థితిని తీసుకొచ్చి తీవ్ర సంక్షోభం సృష్టించారు. ఒక వైపు పోలీసుల కేసులు, అరెస్టులు, మరో వైపు యాజమాన్యం కోడ్‌ఆఫ్ డిసీప్లేన్ చట్టం తీసుకొచ్చినప్పటికీ కార్మికులు ఎక్కడా కూడా భయపడలేదు. కాగా, ఒక మస్టర్‌కు రెండు మస్టర్లు ఇస్తామని ప్రలోభాలకు గురిచేసినా లొంగకుండా సమ్మెను సక్సెస్ చేసి తెలంగాణ పోరాట పటిమను చాటారు. కార్మికులకు ప్రత్యేక తెలంగాణ ఇంక్రిమెంట్.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించిన సింగరేణి బొగ్గుగని కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్పెషల్ ఇంక్రిమెంట్ ఇచ్చి వారికి అండగా నిలిచారు. కాగా, ఈ ఇంక్రిమెంట్‌ను కార్మికులతో పాటుగా అధికారులకు కూడా వర్తింపజేయడం గమనార్హం. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సింగరేణి కార్మికులు చేపట్టిన పోరాటాలు చరిత్రపుటల్లో నిలిచిపోతాయి. -
ప్రత్యేక సెలవులుగా సకలజనుల సమ్మెకాలం
* హెల్త్కార్డులపైనా నిర్ణయం * మొదట రాష్ట్ర పీఆర్సీ కావాలి ఆ తరువాతే కేంద్ర పీఆర్సీ * ముఖ్యమంత్రికి ఉద్యోగసంఘాల నేతల విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: తెలంగాణరాష్ట్ర సాధన కోసం ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు 2010లో చేసిన 42 రోజుల సకలజనుల సమ్మె కాలాన్ని ప్రత్యేక సెలవుగా ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. దీనికి సంబంధించి అధికారులు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. ముఖ్యమంత్రి త్వరలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో లక్షలాది మంది ఉద్యోగులకు, సమ్మె తరువాత రిటైరయిన దాదాపు 40 వేల మంది పెన్షనర్లకు 42 రోజుల ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది. అంతే కాకుండా హెల్త్ కార్డులపైనా సాధ్యమైనంత త్వరగా ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.ఇక కేంద్ర ప్రభుత్వ 7వ పీఆర్సీ 2016 నుంచి అమల్లోకి రానున్నందున అప్పటి వరకు రాష్ట్ర 10వ పీఆర్సీ సిఫారసులను అమలు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. తమకు సెంట్రల్ పీఆర్సీ కాకుండా సెంట్రల్ పీఆర్సీలోని వేతనాలకు సమాన వేతనాలు ఇస్తూ రాష్ట్ర పీఆర్సీనే అమలు చేయాలని వారు కోరుతున్నారు. గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును తెలంగాణ ఉద్యోగ సంఘాల నాయకులు దేవీప్రసాద్, రవీందర్‌రెడ్డి, పి.మధుసూదన్‌రెడ్డి, విఠల్, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ తదిరులు కలసి వివిధ అంశాలపై చర్చించారు. ప్రత్యేకరాష్ట్రం కోసం 2010 సెప్టెంబర్ 13 నుంచి అక్టోబర్ 24 వరకు తెలంగాణ ఉద్యోగులు చేసిన 42 రోజులు సమ్మెకాలాన్ని గతప్రభుత్వం ఆర్జితసెలవులుగా పరిగణించింది. దీంతో ఉద్యోగులు, పెన్షనర్లు 42 రోజుల ఈఎల్స్‌ను కోల్పోయారు. హాఫ్ పే లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ కింద అమ్ముకునేందుకు వీలు కలిగిన ఈ 42 రోజులను ఈఎల్స్ కింద వినియోగించినట్టు పేర్కొని కోతపెట్టడంతో వాటిని పెన్షనర్లు అమ్ముకునే వీలు లేకపోయింది. దీంతో సకలజనుల సమ్మెను స్పెషల్ లీవ్‌గా ప్రభుత్వం మంజూరు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. కాగా, ఉద్యోగులు, పెన్షనర్ల అభిప్రాయాలకు అనుగుణంగా హెల్త్‌కార్డులు జారీ చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. మొదట పదో పీఆర్సీ అమలుకు విజ్ఞప్తి.. ముఖ్యమంత్రి కేంద్ర పీఆర్సీని అమలు చేస్తామని చెబుతుంటే, ఉద్యోగులు మాత్రం ప్రస్తుతం పదోవేతన సంఘం సిఫారసులనే అమలు చేయాలని కోరుతున్నారు. ఎందుకంటే కేంద్ర పీఆర్సీ వేతనాలకోసం 2016 వరకు ఆగాల్సిందే. ఉద్యోగులు అప్పటివరకు ఆగే పరిస్థితి లేదు. అందుకే రాష్ట్ర పీఆర్సీ సిఫారసులను వెంటనే అమల్లోకి తేవాలని కోరుతున్నారు. -
అడ్వాన్సు మాఫీ..ఉత్తమాటేనా?
మంచిర్యాల సిటీ : ‘నమ్మి నానపోస్తే పుచ్చి బుర్రెలు అయినట్టు’ సింగరేణి బొగ్గు గని కార్మికుల పరిస్థితి ఉంది. సింగరేణిలో కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికలకు ముందు తెలంగాణ ఉద్యమంలో భాగంగా చేపట్టిన సకల జనుల సమ్మెలో కార్మికులు పాల్గొన్నారు. కార్మికులు సమ్మెలో పాల్గొనడంతో నష్టపోయారని భావించి కార్మిక సంఘాల ఒత్తిడి మేరకు యాజమాన్యం ప్రతి కార్మికుడికి రూ.25 వేలు అడ్వాన్సుగా ఇచ్చింది. యాజమాన్యం ఇచ్చిన అడ్వాన్సును మాఫీ చేయిస్తామని గుర్తింపు సంఘంగా గెలిచిన టీబీజీకేఎస్ ఇప్పుడు ఆ విషయాన్ని ఎత్తడం లేదు. యాజమాన్యం కూడా అడ్వాన్సును తిరిగి వసూలు చేసుకుంది. ఇచ్చిన హామీని గుర్తింపు సంఘం విస్మరించడంతో కార్మిక వర్గాలు అసంతృప్తితో ఉన్నాయి. ఇంతవరకు రాష్ట్ర ముఖ్యమంత్రితో ప్రకటన కూడా చేయించకపోవడం శోచనీయం. ఢిల్లీలో అమలు కావలసిన ఆదాయపు పన్ను సమస్యను రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయించిన కోల్‌బెల్ట్ ఎమ్మెల్యేలు స్థానికంగా ముఖ్యమంత్రితో ప్రకటన కూడా చేయించలేకపోయారనే విమర్శ వెల్లువెత్తుతోంది. దీంతో కార్మికులు తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. గురువారం హైదరాబాద్‌లో గుర్తింపు సంఘంతో యాజమాన్యం చర్చలు జరుపనుంది. ఈ సందర్భంలోనైనా అడ్వాన్సు గురించి మాట్లాడుతారా అని కార్మికులు ఎదురు చూస్తున్నారు. ఏం జరిగింది సింగరేణి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కార్మికులు తమ హక్కుల కోసం కాకుండా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2011లో 38 రోజుల పాటు సకల జనుల సమ్మెలో పాల్గొన్నారు. సమ్మె విజయవంతం అనంతరం 2012 జూన్ 23న గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలకు ముందు సమ్మెలో కార్మికులు ఆర్థికంగా నష్టపోయారని భావించి కార్మిక సంఘాలు యాజమాన్యాన్ని ఒప్పించి ప్రతి కార్మికుడికి 2011 నవంబరు మాసంలో రూ.25 వేలు అడ్వాన్సు రూపంలో ఇప్పించారు. కార్మికులకు ఇచ్చిన అడ్వాన్సును రద్దు చేయిస్తామని ఎన్నికల ప్రచారంలో గుర్తింపు సంఘంగా గెలిచిన టీఆర్ఎస్ అనుబంధ సంఘం టీబీజీకెఎస్ హామీ ఇచ్చింది. ఎన్నికల్లో టీబీజీకెఎస్ గెలిచిన నాటి నుంచి సంఘం అంతర్గత కుమ్ములాటలో పడి సమస్య పక్కకుపోయింది. ఇదే అదనుగా భావించిన యాజమాన్యం ఇచ్చిన అడ్వాన్సును కార్మికుల నుంచి ముక్కు పిండి మరీ వారి వేతనాల నుంచి నెలకు రూ.1,500ల చొప్పున వసూలు చేసుకొంది. నష్టం 38 రోజుల సమ్మె కాలంలో సింగరేణి సంస్థ రోజుకు రెండు లక్షల టన్నుల చొప్పున 64 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి నష్టపోయింది. దీంతో టన్నుకు రూ.2వేల చొప్పున రూ.1,280 కోట్లు సంస్థకు ఆర్థికంగా నష్టం వాటిల్లింది. కార్మికులు కూడా సగటున రూ.50 నుంచి రూ.70 వేల వరకు ఒక్కొక్క కార్మికుడు వేతన రూపంలో నష్టపోయారు. కొసమెరుపు తన చేతిలో ఉన్న అస్త్రాన్ని ఉపయోగించి కార్మికులకు మేలు చేయాల్సిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న సమస్యను పరిష్కారం చేస్తామంటూ ఆదాయపు పన్ను రద్దుపై అసెంబ్లీలో తీర్మానం చేయడం కార్మికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. -
స్థానికత ఆధారంగానే విభజన: దేవీప్రసాద్
కరీంనగర్: స్థానికత ఆధారంగానే సచివాలయ ఉద్యోగుల విభజన జరుగుతోందని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్ అన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను ఆయన స్వాగతించారు. 204 శాఖల్లో 50వేల మంది ఉద్యోగులు వివరాలను వెల్లడించాలని దేవీప్రసాద్ శనివారమిక్కడ అన్నారు. సకల జనుల సమ్మె రోజులను ప్రత్యేక సెలవులుగా ప్రకటించి ఉద్యోగులకు జీతాలు చెల్లించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తప్పుడు ధ్రువ పత్రాలు సమర్పించిన ఉద్యోగులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని దేవీప్రసాద్ కోరారు. రెవెన్యూ శాఖలో రద్దు చేసిన పోస్టులను పునరుద్ధరించాలన్నారు. -
శాంతా, సమరమా?
సాక్షి, హైదరాబాద్: ‘‘రాజ్యంగంపై గౌరవమున్న వారిగా, ప్రజాస్వామ్యానికి విలువ ఇచ్చేవారిగా శాంతికైనా, స్నేహానికైనా మేం సిద్ధం. ఇవేవీ కాకుండా యుద్ధానికి వచ్చినా సిద్ధమే. శాంతి, స్నేహం కావాలో, యుద్ధమే కావాలో సీమాంధ్రులే తేల్చుకోవాలి. సీమాంధ్రలో కృత్రిమ ఉద్యమం నడుపుతున్న ప్రజాప్రతినిధులకు, పెట్టుబడిదారులకు ఇది నా సవాల్’’ అని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ అన్నారు. హైదరాబాద్ యూటీ ప్రతిప్రాదనకు నిరసనగా ఆరె కటిక పోరాట సమితి, అమ్మల సంఘం ఇందిరా పార్కు ధర్నా చౌక్‌లో సోమవారం చేసిన దీక్షలో, సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో టీఎన్జీవో భేటీలో ఆయన పాల్గొన్నారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతమంటే మరో సకల జనుల సమ్మెకు టీఎన్జీవోలంతా సన్నద్ధంగా ఉండాలన్నారు. తెలంగాణ ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా ఏకం కావాలన్నారు. ‘‘సీమాంధ్రులు శాడిస్ట్ ప్రేమికుల్లా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ వారికి దక్కదని తెలిసి, తెలంగాణకు కూడా దక్కకుండా కేంద్రపాలిత ప్రాంతం చేయాలని పావులు కదుపుతున్నారు. ఈ కుట్రలు, కుతంత్రాలను ఇకపై సహించేది లేదు. ఈ యూటీ కుట్రలను సంఘటితంగా తిప్పికొట్టాలి. తెలంగాణ కోసం వేలాదిమంది ఆత్మ బలిదానం చేసుకుంటే స్పందించని లోక్‌సత్తా అధినేత జేపీ ఇప్పుడు తెలుగుతేజం పేరుతో యాత్రలు చేపట్టడం సిగ్గుచేటు. తెలంగాణ పై ప్రధాన ప్రతిపక్షాలు వెన్నెముక లేకుండా వ్యవహరిస్తున్నాయి’’ అని ఎద్దేవా చేశారు. అశోక్‌బాబుపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి సాక్షి, హైదరాబాద్: ఏపీఎన్జీవోల సమ్మెకు చట్టబద్ధత లేదని, అటువంటి సమ్మెకు నాయకత్వం వహిస్తున్న ఏపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్‌బాబుపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ అధ్యక్షుడు గంజి వెంకటేశ్వర్లు సోమవారం డిమాండ్ చేశారు. -
సకల జనుల సమ్మె కాలంలో ఎక్కడ పడుకున్నావు బాబూ?: హరీష్‌రావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కోసం సకల జనుల సమ్మె జరిగితే రోడ్ల మీదకు రాకుండా ఎక్కడ పడుకున్నారో చెప్పాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును టీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనాయకుడు టి.హరీష్‌రావు ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ ప్రజలు రోడ్ల మీదకు వస్తుంటే నేను ఇంట్లో కూచుంటానా అని అంటున్న చంద్రబాబు సకల జనుల సమ్మె జరిగినప్పుడు ఎక్కడున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం వెయ్యిమంది ఆత్మహత్యలు చేసుకుంటే ఏ ఒక్క కుటుంబాన్నీ ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల కష్టాలు కష్టాలే కావా? తెలుగు ప్రజల్లో తెలంగాణ ప్రజలు భాగం కాదా? అని నిలదీశారు. 2009 డిసెంబర్ 7న అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడుతూ తెలంగాణపై తీర్మానం ప్రభుత్వం పెట్టకుంటే తాను పెడతానని చెప్పింది నిజం కాదా? అని ప్రశ్నించారు. తెలంగాణపై వైఖరేమిటో స్పష్టంగా చెప్పకుండా ఓట్లు, సీట్ల కోసం దిగజారుడు, నీచ రాజకీయాలు చేస్తున్నది చంద్రబాబే అని విమర్శించారు. ఎక్కువసార్లు మాటమార్చిన చరిత్ర కూడా ఆయనదేనని దుయ్యబట్టారు. అపోహలు, అనుమానాలతో ఆందోళనలు చేస్తుంటే ఇరు ప్రాంతాల వారినీ కూర్చోబెట్టి చర్చించాల్సిన బాధ్యత చంద్రబాబుకు లేదా? అని హరీష్‌రావు ప్రశ్నించారు. సమస్యలను పరిష్కరించకుండా మరింత గందరగోళం, అయోమయం సృష్టించేలా చంద్రబాబు వ్యవహరిస్తే రాజనీతిజ్ఞుడు ఎలా అవుతారని వ్యాఖ్యానించారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు తెలంగాణను అడ్డుకున్నట్టుగా చెప్పిన చంద్రబాబు మరోసారి అడ్డుకుంటా అని చెబుతున్నట్టుగానే ఉందన్నారు. సమైక్యాంధ్ర ధర్మపోరాటమని అంటే మరి తెలంగాణ ప్రజలది అన్యాయమైన, అధర్మమైన పోరాటమని చంద్రబాబు చెప్పదలచుకున్నారా అని హరీష్‌రావు ప్రశ్నించారు. వన్నారు. తెలంగాణ విభజన తర్వాత తలెత్తే సమస్యలేమిటో నిర్దిష్టంగా ఉంటే చర్చించుకుని పరిష్కరించుకుందామని హరీష్‌రావు సూచించారు. -
బాబును చూసి ఊసరవెల్లులు కూడా సిగ్గుపడతాయి
హైదరాబాద్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడును చూస్తే... ఊసరవెల్లులు సైతం సిగ్గుపడతాయని టీఆర్ఎస్ నేత హరీష్‌రావు అన్నారు. ప్రజలంతా రోడ్లమీదికి వస్తే తాను ఇంట్లో కూర్చుంటానా అంటున్న చంద్రబాబు అప్పుడు సకల జనుల సమ్మె సమయంలో లక్షలాది మంది తెలంగాణ ప్రజలు రోడ్లపైకి వస్తే ఎందుకు స్పందించ లేదని ఆయన సోమవారమిక్కడ ప్రశ్నించారు. ఇన్నిసార్లు మాట మార్చే నేత దేశంలోనే ఎవరూలేరని హరీష్ రావు మండిపడ్డారు. తెలంగాణ ప్రజల బాధలు తెలుగు ప్రజలవి కావా అని ఆయన ప్రశ్నించారు. తెలుగు ప్రజల మధ్య చిచ్చుపెడుతుంది చంద్రబాబు నాయుడే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాత్ర ఉద్దేశం చెప్పకుండా బాబు ప్రజలను మోసం చేస్తున్నారని హరీష్ రావు ధ్వజమెత్తారు. విభజన లేఖ ఇచ్చి చంద్రబాబు ఇప్పుడు మాట మారుస్తారా అని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు నిన్నటి నుంచి గుంటూరు జిల్లా నుంచి ఆత్మగౌరవ యాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే.