సకల జనుల సమ్మె కాలానికి జీతాలివ్వరా? | ponnam demands for employees pay for the period of the strike | Sakshi
Sakshi News home page

సకల జనుల సమ్మె కాలానికి జీతాలివ్వరా?

Published Sat, Jan 10 2015 5:07 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

సకల జనుల సమ్మె కాలానికి జీతాలివ్వరా? - Sakshi

సకల జనుల సమ్మె కాలానికి జీతాలివ్వరా?

హైదరాబాద్: సకలజనుల సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులకు వేతనం చెల్లిస్తామని ఇచ్చిన హామీని తెలంగాణ సీఎం కేసీఆర్ నిలబెట్టుకోవాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి7 నెలలు అవుతున్నా ఉద్యోగుల వేతనాల గురించి ఆయన ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు.

సుమారు మూడేళ్ల క్రితం నాటి ఈ సమ్మెలో పాల్గొన్నదాదాపు 20 వేల మంది ఉద్యోగులు ఇప్పటికే రిటైర్ అయ్యారన్నారు. ఎన్జీవో నేతలు కూడా తమ సొంత పదవుల కోసం పాకులాడుతూ.. ఉద్యోగుల సమస్యలను విస్మరిస్తున్నారని పొన్నం విమర్శించారు. ఉద్యగో సంఘాల నేతలు స్పందించకపోతే రిటైర్డ్ ఉద్యోగులతో కలిసి కాంగ్రెస్ పార్టీ ధర్నాలు నిర్వహిస్తుందని ఆయన హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement