స్థానికత ఆధారంగానే సచివాలయ ఉద్యోగుల విభజన జరుగుతోందని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్ అన్నారు.
కరీంనగర్: స్థానికత ఆధారంగానే సచివాలయ ఉద్యోగుల విభజన జరుగుతోందని టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్ అన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను ఆయన స్వాగతించారు. 204 శాఖల్లో 50వేల మంది ఉద్యోగులు వివరాలను వెల్లడించాలని దేవీప్రసాద్ శనివారమిక్కడ అన్నారు.
సకల జనుల సమ్మె రోజులను ప్రత్యేక సెలవులుగా ప్రకటించి ఉద్యోగులకు జీతాలు చెల్లించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తప్పుడు ధ్రువ పత్రాలు సమర్పించిన ఉద్యోగులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని దేవీప్రసాద్ కోరారు. రెవెన్యూ శాఖలో రద్దు చేసిన పోస్టులను పునరుద్ధరించాలన్నారు.