సాక్షి, హైదరాబాద్: ‘‘రాజ్యంగంపై గౌరవమున్న వారిగా, ప్రజాస్వామ్యానికి విలువ ఇచ్చేవారిగా శాంతికైనా, స్నేహానికైనా మేం సిద్ధం. ఇవేవీ కాకుండా యుద్ధానికి వచ్చినా సిద్ధమే. శాంతి, స్నేహం కావాలో, యుద్ధమే కావాలో సీమాంధ్రులే తేల్చుకోవాలి. సీమాంధ్రలో కృత్రిమ ఉద్యమం నడుపుతున్న ప్రజాప్రతినిధులకు, పెట్టుబడిదారులకు ఇది నా సవాల్’’ అని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ అన్నారు. హైదరాబాద్ యూటీ ప్రతిప్రాదనకు నిరసనగా ఆరె కటిక పోరాట సమితి, అమ్మల సంఘం ఇందిరా పార్కు ధర్నా చౌక్‌లో సోమవారం చేసిన దీక్షలో, సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో టీఎన్జీవో భేటీలో ఆయన పాల్గొన్నారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతమంటే మరో సకల జనుల సమ్మెకు టీఎన్జీవోలంతా సన్నద్ధంగా ఉండాలన్నారు. తెలంగాణ ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా ఏకం కావాలన్నారు. ‘‘సీమాంధ్రులు శాడిస్ట్ ప్రేమికుల్లా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ వారికి దక్కదని తెలిసి, తెలంగాణకు కూడా దక్కకుండా కేంద్రపాలిత ప్రాంతం చేయాలని పావులు కదుపుతున్నారు. ఈ కుట్రలు, కుతంత్రాలను ఇకపై సహించేది లేదు. ఈ యూటీ కుట్రలను సంఘటితంగా తిప్పికొట్టాలి. తెలంగాణ కోసం వేలాదిమంది ఆత్మ బలిదానం చేసుకుంటే స్పందించని లోక్‌సత్తా అధినేత జేపీ ఇప్పుడు తెలుగుతేజం పేరుతో యాత్రలు చేపట్టడం సిగ్గుచేటు. తెలంగాణ పై ప్రధాన ప్రతిపక్షాలు వెన్నెముక లేకుండా వ్యవహరిస్తున్నాయి’’ అని ఎద్దేవా చేశారు.
అశోక్‌బాబుపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి
సాక్షి, హైదరాబాద్: ఏపీఎన్జీవోల సమ్మెకు చట్టబద్ధత లేదని, అటువంటి సమ్మెకు నాయకత్వం వహిస్తున్న ఏపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్‌బాబుపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ అధ్యక్షుడు గంజి వెంకటేశ్వర్లు సోమవారం డిమాండ్ చేశారు.
శాంతా, సమరమా?
Published Tue, Sep 17 2013 2:40 AM | Last Updated on Fri, Sep 1 2017 10:46 PM
Advertisement