ఎయిర్పోర్ట్కు రాజీవ్ పేరే ఉంటుంది ... కానీ | Sandra Venkata Veeraiah comments on shamshabad airport domestic terminal | Sakshi
Sakshi News home page

ఎయిర్పోర్ట్కు రాజీవ్ పేరే ఉంటుంది ... కానీ

Published Fri, Nov 21 2014 11:19 AM | Last Updated on Sat, Sep 2 2017 4:52 PM

ఎయిర్పోర్ట్కు రాజీవ్ పేరే ఉంటుంది ... కానీ

ఎయిర్పోర్ట్కు రాజీవ్ పేరే ఉంటుంది ... కానీ

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్ పోర్ట్కు రాజీవ్గాంధీ పేరే కొనసాగుతుందని తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య స్పష్టం చేశారు. కాని డొమెస్టిక్ టెర్మినల్కు మాత్రం మాజీ సీఎం, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద సండ్ర వెంకట వీరయ్య మాట్లాడారు.

హైదరాబాద్ నగరంలో నూతనంగా మరో విమానాశ్రయం నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది... ఈ నేపథ్యంలో ఆ విమానాశ్రయానికి ఏ పేరు పెట్టినా తమకు అభ్యంతరం లేదని సండ్ర వెంకట వీరయ్య వ్యాఖ్యానించారు. విమానాశ్రయ పేరు మార్పును రాద్ధాంతం చేయడం సరికాదని ఆయన అధికార, కాంగ్రెస్ పార్టీలకు హితవు పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement