
సాక్షి, అమరావతి : ఒక ప్రాంతం కాకుండా అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందేలా రాజధాని విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంచి నిర్ణయం తీసుకున్నారని మంత్రి కృష్ణదాస్ వ్యాఖ్యానించారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ఈ సారి సభలో మొత్తం 19 బిల్లులు ప్రవేశపెట్టగా, 16 బిల్లులు ఆమోదం పొందాయని తెలిపారు. కీలకమైన దిశా బిల్లు ఆమోదం వల్ల మహిళల భద్రతకు సీఎం అత్యంత ప్రాధాన్యతనిచ్చారని పేర్కొన్నారు. సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ దిశా బిల్లును ప్రశంసించారని వెల్లడించారు. కేరళ, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, ఒడిశా వంటి రాష్ట్రాలు దిశా చట్ట అమలుకు ముందుకు వచ్చాయని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment