
'కాపు' కుటుంబ సభ్యులకు జగన్ ఫోన్
నిడదవోలు(పశ్చిమగోదావరి జిల్లా): ఆత్మహత్యాయత్నం చేసిన రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కుటుంబసభ్యులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. కాపు రామచంద్రారెడ్డి భార్యతో ఆయన ఫోన్లో మాట్లాడారు. రామచంద్రారెడ్డి ఆరోగ్యంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. తన భర్తను పోలీసులు వేధించిన తీరును జగన్కు రామచంద్రారెడ్డి సతీమణి వివరించారు. తమ పార్టీ ఎమ్మెల్యేపై అనంతపురం పోలీసుల చర్యలను జగన్ ఖండించారు. కాపు రామచంద్రారెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై పోలీసుల దౌర్జన్యానికి నిరసనగా అనంతపురం జిల్లా రాయదుర్గంలో రామచంద్రారెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆయన ప్రస్తుతం బళ్లారి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.