అనంతపురం: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అనంతపురంలో సోమవారం ఆయన మాట్లాడుతూ గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు భారీ అవినీతికి పాల్పడ్డారని ఆయన విమర్శించారు. గోదావరి నీరు, ఇసుకను అమ్ముకున్న ఘనత బాబుకే దక్కుతుందన్నారు. టీడీపీ నేతలు కబ్జా చేసిన భూములను పేదలకు పంచాలని, పభుత్వ అధికారులకు రక్షణ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.