
కోలుకుంటున్న ఎమ్మెల్యే కాపు
రామచంద్రారెడ్డికి మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బెంగళూరులోని కొలంబియా ఏషియా ఆస్పత్రి వైద్యులు బుధవారం తెలి పారు. వైఎస్‌ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి బుధవారం ఎమ్మెల్యే కాపును ఫోన్‌లో పరామర్శించారు. కాపును జగన్ సోదరి షర్మిల, ఆమె భర్త బ్రదర్ అనిల్ ఆస్పత్రిలో పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తన భర్త ఆస్పత్రిలో కోలుకుంటున్నట్లు ఎమ్మెల్యే సతీమణి భారతి తెలిపారు.
ప్రధాన కూడళ్లలో పోలీ సులు, ఆర్మీ పెద్ద సంఖ్యలో ఉండడంతో ప్రజలు పనులు చేసుకునేందుకు సైతం భయపడ్డారు. కౌన్సిలింగ్ పేరుతో సంఘ విద్రోహక శక్తులపై చర్యలు తీసుకోవాలని, కానీ సమాజంలో పేరు, ప్రతిష్టలు ఉన్న నాయకులను కొట్టడం అప్రజాస్వామికమని ప్రజలు చర్చించుకున్నారు. శాంతి ర్యాలీ నిర్వహించేందుకు అనుమతి కోరినా డీఎస్పీ తిరస్కరించినట్లు వైఎస్‌ఆర్ సీపీ అధికార ప్రతినిధి మాధవరెడ్డి తెలిపారు. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు పెట్టి కార్యకర్తలు నగరంలోకి రాకుండా అడ్డుకున్నారని విమర్శించారు.