Brother Anil kumar
-
బ్రదర్ అనిల్‌కుమార్‌కు తృటిలో తప్పిన ప్రమాదం
-
బ్రదర్ అనిల్ కుమార్‌కు తప్పిన ప్రమాదం
సాక్షి, కృష్ణాజిల్లా : బ్రదర్ అనిల్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్‌పోస్ట్ సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కనున్న గుంతలోకి దూసుకెళ్లింది. అయితే ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో బ్రదర్ అనిల్ క్షేమంగా బయటపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో బ్రదర్ అనిల్‌కుమార్‌తో పాటు గన్మెన్లు, డ్రైవర్ ఉన్నారు. ప్రమాదంలో కారు ముందు భాగం దెబ్బతిన్నది. ప్రమాదం గురించి తెలియగానే ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను సంఘటనా స్థలానికి వెళ్లారు. తన కారులో బ్రదర్ అనిల్, గన్మెన్లను విజయవాడలోని ఎంజే నాయుడు ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం అనిల్ కుమార్ తన పర్యటనకు వెళ్లిపోయారు. -
‘జగనన్న విజయంలో మీరు భాగస్వాములయ్యారు’
-
‘జగనన్న విజయంలో మీరు భాగస్వాములయ్యారు’
కువైట్ సిటీ: వైఎస్ షర్మిల కువైట్ పర్యటనలో భాగంగా జోసెఫ్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ‘జీవము గల దేవుడు’ 8వ వార్షికోత్సవ కార్యక్రమానికి ఆదివారం తన భర్త బ్రదర్ అనిల్‌కుమార్‌తో కలిసి హాజరయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కువైట్ కమిటీ సభ్యులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. జగనన్నను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చూడాలని పార్టీ అభ్యర్థుల విజయంలో వారు భాగస్వామలు అయినందుకు తమ కుటుంబ సభ్యుల తరఫున ధన్యవాదాలు తెలిపారు. కువైట్‌లో ఉంటూ.. వారు చేసే సామాజిక సేవ అభినందనీయమని ఆమె కొనియాడారు. దీంతో పాటు గల్ఫ్ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం వారు పనిచేస్తున్న తీరును, కువైట్ కమిటీ చేసే సామాజిక సేవల గురించి షర్మిల.. ఇలియాస్, బాలిరెడ్డిలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గల్ఫ్, కువైట్ కన్వీనర్లు ఇలియాస్, బి.హెచ్. ముమ్మడి బాలిరెడ్డి, ఇతర వైఎస్సార్సీపీ కువైట్ కమిటీ సభ్యులు, రెడ్డి సంఘం సభ్యులు పాల్గొన్నారు. -
బ్రదర్ అనిల్ కుమార్‌కు ఊరట
సాక్షి, హైదరాబాద్: బ్రదర్ అనిల్ కుమార్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఖమ్మం జిల్లా కోర్టు జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్‌ను హైకోర్టు మంగళవారం రద్దు చేసింది. తదుపరి ఉత్తర్వులు వెల్లడించేంతవరకూ వ్యక్తిగత హాజరుపై స్టే కొనసాగుతుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. కాగా 2009లో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని బ్రదర్ అనిల్ కుమార్‌పై ఖమ్మంలో కేసు నమోదైంది. స్టే కొనసాగుతుండగానే జిల్లా కోర్టు మరో సారి బ్రదర్ అనిల్‌కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఖమ్మం కోర్టు చర్యలను సవాల్ చేస్తూ బ్రదర్ అనిల్ కుమార్ హైకోర్టుని ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు స్టే కొనసాగుతుండగా వారెంట్ ఎలా జారీ చేశారంటూ హైకోర్టు ప్రశ్నించింది. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ, ఈ కేసు నుంచి తనను తొలగించాలని హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై తదుపరి విచారణ అక్టోబర్ 16కి హైకోర్టు వాయిదా వేసింది. -
కాకినాడలో రక్షణ టీవీ కార్యాలయం ప్రారంభం
కాకినాడ : రక్షణ టీవీ ఆంధ్రప్రదేశ్ శాఖ కార్యాలయాన్ని అనిల్ వరల్డ్ ఎవాంజలిజం వ్యవస్థాపకులు బ్రదర్ ఎం. అనిల్‌కుమార్ బుధవారం తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ప్రారంభించారు. అనంతరం నగరపాలక సంస్థ కార్యాలయంలోని డీకన్వెన్షన్హాలులో క్రైస్తవ ప్రతినిధులు, ఇతర ముఖ్యులతో ఏర్పాటు చేసిన సదస్సులో బ్రదర్ అనిల్ కుమార్ మాట్లాడారు. ఆ తర్వాత బ్రదర్ అనిల్‌ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబుతోపాటు మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ మర్యాదపూర్వకంగా కలిశారు. -
దేవుడిచ్చిన వరం నిత్య జీవం
తణుకు : దేవుడిచ్చిన వరం నిత్యం జీవం అని, దీన్ని ఇచ్చేందుకు ఏసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారని ప్రముఖ అంతర్జాతీయ సువార్తీకులు బ్రదర్ అనిల్‌కుమార్ అన్నారు. దేవుని జ్ఞానం లేక ఎంతో మంది జనులు నశించిపోతున్నారన్నారు. ‘టీం ఎడొనాయి’ ఆధ్వర్యంలో ‘రీచార్జ్’ పేరుతో బుధవారం తణుకులో యవనస్తుల సెమినార్ నిర్వహించారు. స్థానిక భోగవల్లి బాపయ్య, అన్నపూర్ణమ్మ కమ్మ కల్యాణ మండపంలో నిర్వహించిన ఈ సెమినార్‌కు బ్రదర్ అనిల్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ దేవుని జ్ఞానాన్ని కలిగి ఉండాలని అన్నారు. ఒకని అవిధేయత అనేకులను పాపులుగా తీర్చిదిద్దితే, విధేయత ఎంతోమందిని నీతిమంతులుగా మార్చిందన్నారు. దేవుణ్ని విశ్వసించిన వాడు నిత్యజీవం కలిగి ఉండాలని, కనీసం జీవితంలో ఆవగింజంతైనా విశ్వాసం కలిగి ఉండాలని అన్నారు. అయితే ప్రస్తుత దినాల్లో విశ్వాసం ఉన్నప్పటికీ అది వాడుకలో ఉండటంలేదని తెలిపారు. ఈ సందర్భంగా ‘జయం’ అనే అంశంపై యువతను ఉత్తేజరపరుస్తూ చేసిన ప్రసంగం ఆకట్టుకుంది. మరోవక్త పీటర్ సామ్యూల్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హృదయంలో విశ్వసించి నోటితో దాన్ని ఒప్పుకోవాలన్నారు. నిత్య యవ్వనానికి మరణం లేదన్నారు. ఈ సందర్భంగా క్రీస్తుపై ఆలపించిన ప్రత్యేక గీతాలు ఆకట్టుకున్నాయి. టీమ్ అడోనాయ్ నిర్వాహకులు సీహెచ్ విమల్కిరణ్, సీహెచ్ హేనావిమల్, కె.ఎర్నెస్ట్బాబు, జి.సన్నీజోసెఫ్ ఈ సెమినార్‌కు ఆధ్వర్యం వహించారు. -
బ్రదర్ అనిల్ కుమార్ సత్యవాఖ్యోపదేశమ్ 3rd October 2015
-
బ్రదర్ అనీల్ కుమార్ సత్యవ్యాకోపదేశం 12th April 2015
-
బ్రదర్ అనీల్ కుమార్ సత్యవ్యాకోపదేసం 4th April 2015
-
బ్రదర్ అనిల్‌కుమార్ సత్య వాక్యోపదేశం 29th March 2015
-
బ్రదర్ అనిల్‌కుమార్ సత్య వాక్యోపదేశం 22nd March 2015
-
బ్రదర్ అనిల్‌కుమార్ సత్య వాక్యోపదేశం 15th March 2015
-
ఆశీర్వాద సువార్త జయభేరి 8th March
-
బ్రదర్ అనిల్‌కుమార్ సత్య వాక్యోపదేశం 1st March 2015
-
బ్రదర్ అనిల్‌కుమార్ సత్య వాక్యోపదేశం 22nd Feb 2015
-
బ్రదర్ అనిల్‌కుమార్ సత్య వాక్యోపదేశం 15th Feb 2015
-
బ్రదర్ అనిల్‌కుమార్ సత్య వాక్యోపదేశం 8th Feb 2015
-
బ్రదర్ అనిల్‌కుమార్ సత్య వాక్యోపదేశం 1st Feb 2015
-
బ్రదర్ అనిల్‌కుమార్ సత్య వాక్యోపదేశం 25th Jan 2015
-
బ్రదర్ అనిల్‌కుమార్ సత్య వాక్యోపదేశం 18th Jan 2015
-
బ్రదర్ అనిల్‌కుమార్ సత్య వాక్యోపదేశం 4th Jan 2014
-
బ్రదర్ అనిల్‌కుమార్ సత్య వాక్యోపదేశం 28th Dec 2014
-
బ్రదర్ అనిల్‌కుమార్ సత్య వాక్యోపదేశం 21st Dec 2014
-
బ్రదర్ అనిల్‌కుమార్ సత్య వాక్యోపదేశం 14th Dec 2014
-
బ్రదర్ అనిల్‌కుమార్ సత్య వాక్యోపదేశం 7th Dec 2014
-
బ్రదర్ అనిల్‌కుమార్ సత్య వాక్యోపదేశం 30th Nov 2014
-
బ్రదర్ అనిల్‌కుమార్ సత్య వాక్యోపదేశం 23rd Nov 2014
-
బ్రదర్ అనిల్‌కుమార్ సత్య వాక్యోపదేశం 16th Nov 2014
-
బ్రదర్ అనిల్ కుమార్ సత్యవాక్యోపదేశం 19th Oct 2014
-
బ్రదర్ అనిల్‌కుమార్ సత్యవాక్యోపదేశం 5th Oct 2014
-
బ్రదర్ అనిల్‌కుమార్ సత్యవాక్యోపదేశం 28th Sept 2014
-
బ్రదర్ అనిల్‌కుమార్ సత్యవాక్యోపదేశం 21st Sept 2014
-
వైఎస్ విజయమ్మకు భద్రత పునరుద్ధరణ
హైదరాబాద్: వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ భద్రతను ఏపీ ప్రభుత్వం తిరిగి పునరుద్ధరించింది. వైఎస్ విజయమ్మకు భద్రత కొనసాగించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఏపీ సర్కారు ఆమెకు భద్రతను తిరిగి పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకుంది. విజయమ్మతో పాటు ఆమె కుమార్తె షర్మిలకు, బ్రదర్ అనిల్ కు కూడా భద్రతను యథావిధిగా కొనసాగించడానికి ఆదేశాలు జారీ చేసింది. వైఎస్ విజయమ్మకు ఉన్న 2+2 భద్రతను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపసంహరించుకోవడంతో ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందని, భద్రత ఉపసంహరించే ముందు తమకు ఎటువంటి నోటీసు కూడా ఇవ్వలేదని ఆ పిటిషన్లో విజయమ్మ తెలిపారు. 2004 నుంచి ఉన్న భద్రతను ఏపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే తొలగించడం వెనుక రాజకీయ దురుద్దేశాలున్నాయని ఆమె ఆరోపించారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం భద్రతను వెంటనే పునరుద్ధరించేలా ప్రభుత్వానికి ఆదేశించింది. మళ్లీ ఉత్తర్వులు ఇచ్చేవరకు వారికి భద్రత కొనసాగించాలని కోర్టు తెలిపింది. -
బ్రదర్ అనిల్‌కుమార్ సత్యవాక్యోపదేశం 14th Sept 2014
-
వైఎస్ విజయమ్మకు హైకోర్టులో ఊరట
-
వైఎస్ విజయమ్మకు హైకోర్టులో ఊరట
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మకు భద్రత కొనసాగించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆమెతోపాటు వైఎస్ షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్‌కు కూడా భద్రత కొనసాగించాలని కోర్టు ఆదేశించింది. మళ్లీ ఉత్తర్వులు ఇచ్చేవరకు వారికి భద్రత కొనసాగించాలని కోర్టు తెలిపింది. వైఎస్ విజయమ్మకు ఉన్న 2+2 భద్రతను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ నిర్ణయంపై విజయమ్మ ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించారు. భద్రతను వెంటనే పునరుద్ధరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్లో ఆమె కోరారు. ఏపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, రాష్ట్రస్థాయి భద్రతా సమీక్ష కమిటీ, వైఎస్ఆర్ జిల్లా ఎస్పీ, ఇంటెలిజెన్స్ అదనపు డీజీపీలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందని, భద్రత ఉపసంహరించే ముందు తమకు ఎటువంటి నోటీసు కూడా ఇవ్వలేదని ఆ పిటిషన్లో విజయమ్మ తెలిపారు. తనకు ప్రాణహాని ఉందంటూ ఇంటెలిజెన్స్ అదనపు డీజీకి వినతిపత్రం ఇచ్చినా పట్టించుకోలేదన్నారు. 2004 నుంచి ఉన్న భద్రతను ఏపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే తొలగించడం వెనుక రాజకీయ దురుద్దేశాలున్నాయని ఆమె ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి సోదరి షర్మిల, ఆమె భర్త అనిల్ కుమార్ కూడా తమ భద్రత ఉపసంహరణపై వేర్వేరుగా కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ మూడింటిని విచారించిన కోర్టు వారికి భద్రత కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ** -
బ్రదర్ అనిల్‌కుమార్ సత్యవాక్యోపదేశం 7th Sept 2014
-
బ్రదర్ అనిల్‌కుమార్ సత్యవాక్యోపదేశం 31st August 2014
-
బ్రదర్ అనిల్‌కుమార్ సత్యవాక్యోపదేశం 24th August 2014
-
బ్రదర్ అనిల్‌కుమార్ సత్యవాక్యోపదేశం 17th August 2014
-
బ్రదర్ అనిల్‌కుమార్ సత్యవాక్యోపదేశం 20th July 2014
-
విశ్వాసమే రక్షిస్తుంది
అంతర్జాతీయ సువార్తికులు బ్రదర్ అనిల్‌కుమార్ గుడివాడ : ఏసుక్రీస్తును అంగీకరించిన వారంతా నీతిమంతులేనని, ఆయనపట్ల విశ్వాసమే మానవులను సర్వదా రక్షిస్తుందని ప్రపంచ సువార్తీకులు బ్రదర్ అనిల్‌కుమార్ స్పష్టంచేశారు. బుధవారం స్థానిక పెదఎరుకపాడులో పాస్టర్ బిల్లిపల్లి ప్రభాకర్‌రెడ్డి నూతనంగా నిర్మించిన న్యూలైఫ్ ప్రార్థనా మందిరాన్ని ప్రారంభించిన ఆయన అనంతరం జరిగిన సభలో సువార్త ఉపన్యాసం చేశారు. వేల సంఖ్యలో హాజరైన క్రైస్తవ విశ్వాసులనుద్దేశించి మాట్లాడుతూ మానవులు చేసిన పాపాలకు ఆయన మూల్యం చెల్లించాడని అందుకే క్రీస్తును అంగీకరించిన వారంతా నీతిమంతులేనని అన్నారు. క్రీస్తు మహిమలు ద్వారా గుడివాడ పట్టణం అంతా సస్యశ్యామలంగా ఉండాలని ఆయన ప్రార్థనలు చేశారు. ప్రపంచ సువార్తికుడుగా దేవుడు తనకి ప్రసాదించిన శక్తితో తాను ఈ మాటలు చెప్పగలుగుతున్నానని అన్నారు. ప్రభువునందు విశ్వాసం,కృప వల్ల ప్రతి ఒక్కరూ రక్షించబడతారని చెప్పారు. పాటలతో ఉర్రూతలూరించిన అనిల్‌కుమార్... బ్రదర్ అనిల్‌కుమార్ నూతనంగా రూపకల్పన చేసిన పాటల సీడీలోని కొత్తపాటలు పాడి కార్యక్రమానికి హాజరైన వారందరినీ ఉర్రూతలూగించారు. ‘నిబ్బరంకలిగి ధైర్యంగా ఉండు..’ అంటూ పాడిన పాట అందరిలో ఉత్సాహాన్ని నింపింది. బ్రదర్ అనిల్‌కుమార్ సందేశాన్ని ప్రముఖ సువార్తికుడు సజ్జా బర్నబాస్ తెలుగులోకి అనువదించారు. న్యూలైఫ్ ప్రార్ధనా మందిరం పాస్టర్ బిల్లిపల్లి ప్రభాకర్‌రెడ్డి, బిల్లిపల్లి ఇజ్రాయోల్రెడ్డి పాల్గొనగా అనీల్ వరల్డ్ ఇవాంజలిజం(ఎడబ్ల్యూఈ) రాష్ట్ర కోఆర్డినేటర్ శామ్యూల్ తొలుత అతిథుల్ని వేదికపైకి ఆహ్వానించారు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని), గుడివాడ మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ అడపా బాబ్జీ, మండలి హనుమంతరావు, పాలేటి చంటి, పాస్టర్లు అప్పికట్ల జాషువా, క్రీస్తురాయబారి, సజ్జా బర్నబాస్, టిజె దాస్, భాస్కరరావు, కరుణాసాగర్, జడా జానన్న, నేలపాటి శామ్యూల్ పాల్గొన్నారు. ప్రేయర్ పాస్టర్ ఫెలోషిప్ ఘనసన్మానం... బ్రదర్ అనిల్‌కుమార్‌ను గుడివాడ డివిజన్ ప్రేయర్ పాస్టర్స్ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఫెలోషిప్ గుడివాడ డివిజన్ అధ్యక్షులు జి.శ్యాంబాబు, సునీల్‌రెడ్డి, బి.మోషే, డివివి.ప్రసాద్, సంఘ కాపరులు ఆమెన్, పరిశుద్ధ భూషణం, సునీల్, ఎలీషా పాల్గొన్నారు. -
బ్రదర్ అనిల్‌కుమార్ సత్యవాక్యోపదేశం 11th May 2014
-
అడ్డంగా దొరికిన ఈనాడు
* బ్యాంకు లావాదేవీల్ని చూపిస్తూ తప్పుడు రాతలు * బినామీ లావాదేవీలు బ్యాంకుల ద్వారా కూడా చేస్తారా?.. ఆన్లైన్లో చేశారంటే దానర్థం పారదర్శకంగా చేసినట్టు కాదా? * నిజంగా బినామీ అయితే డబ్బు డ్రా చేసి ఇచ్చేవారుగా?.. ఇవన్నీ వదిలిపెట్టి ఎన్నికల ముందు రామోజీ శివాలు * కావాలని పోలింగ్ ముందురోజున షర్మిలపై బురద అడ్డంగా దొరికిందెవరు? రామోజీరావా? ఈనాడా? లేక షర్మిలా? ‘‘బయ్యారం యవ్వారం బట్టబయలు... అడ్డంగా దొరికిన షర్మిల’ అంటూ మంగళవారం ఆరు కాలాల నిండా రామోజీ రాసిన విషపు రాతల లోగుట్టేంటి? ఇకపై తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున షర్మిల యాత్ర చేస్తారని, పార్టీ బాధ్యతలు ఆమే చూస్తారని వై.ఎస్.జగన్ మోహన్‌రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో... తెలంగాణలో పోలింగ్ జరగటానికి ఒక రోజు ముందు రామోజీరావు పన్నిన కుట్రలో ఇది భాగం కాదా? జగన్ ప్రచార సభలకు తెలంగాణలో సైతం జనం వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పోలింగ్ ముందున కావాలని కక్కిన కాలకూట విషం తప్ప ఇందులో ఏముందని? ‘‘షర్మిల ఖాతా నుంచి సతీష్ కుమార్ ఖాతాకు రూ.40 లక్షల చొప్పున రెండు సార్లు, రూ.30 లక్షల చొప్పున ఒకసారి బదిలీ అయ్యాయి. రెండేళ్ల వ్యవధిలో జరిగిన ఈ మూడు లావాదేవీలూ చూస్తే సతీష్‌కుమార్‌కు షర్మిల డబ్బు పంపారు కనక ఆయన బినామీయే’’ అనేది మొత్తంగా ‘ఈనాడు’ రాతల సారాంశం. అయినా ఇద్దరు వ్యక్తుల మధ్య బ్యాంకు లావాదేవీలు నడవటం తప్పా? నేరమా? రామోజీరావు రాసినట్టుగా సతీష్‌కుమార్ గనక నిజంగా బ్రదర్ అనిల్కో, షర్మిలకో బినామీయే అయితే షర్మిల నేరుగా తన ఖాతా నుంచి ఆయన వ్యక్తిగత ఖాతాకు నగదును ఎందుకు పంపిస్తారు? అది కూడా ఆన్లైన్లో ఎందుకు బదిలీ చేస్తారు? ఇది బినామీ లావాదేవీయే అయితే నేరుగా నగదును డ్రా చేసో, మరో మార్గంలోనో... చంద్రబాబు రామోజీకి ఇచ్చేవిధంగా ఇచ్చి ఉండేవారు కదా? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం ఉండొద్దా? ఆన్లైన్లో నగదు బదిలీ చేశారంటే దానర్థం అంతా పారదర్శకంగా ఉన్నట్టు కాదా? ఎప్పటికైనా రికార్డుల్లో ఉండాలని, అంతా పారదర్శకంగా ఉండేలా ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన లావాదేవీగా దీన్ని భావించాల్సిన పనిలేదా? అయినా బినామీ లావాదేవీలంటే ఏంటి? చంద్రబాబుతో రామోజీరావు, సుజనా చౌదరి, సి.ఎం.రమేష్, నాగరాజానాయుడు, మురళీమోహన్ వంటి వ్యక్తులు జరిపే లావాదేవీలు కాదా? అవును మరి! చంద్రబాబు నుంచి కృష్ణా-గోదావరి బేసిన్లో గ్యాస్‌ను కొట్టేసినందుకు రిలయన్స్ సంస్థ రామోజీరావుకిచ్చిన డబ్బంతా బినామీ డబ్బే. ఎందుకంటే చంద్రబాబుకు పోవాల్సిన డబ్బు ఆయన బినామీగా రామోజీకి వచ్చింది కాబట్టి!! అదీ బినామీ లావాదేవీ అంటే!! షర్మిల నుంచి వచ్చిన నగదును సతీష్ తనకు చెందిన కంపెనీలకు మళ్లించుకుంటే తప్పేంటి? ఒక వ్యక్తి దగ్గర తీసుకున్న సొమ్మును మరో వ్యక్తి తన అవసరాల మేరకు వాడుకునే అవకాశం లేదా? అదంతా బినామీ లావాదేవీయేనా? అయినా రూ.50 వేలు దాటిన బ్యాంకు లావాదేవీలన్నీ ఆదాయపు పన్ను శాఖకు కూడా తెలుస్తూనే ఉంటాయి. మరి అవన్నీ తెలిసి కూడా ఇద్దరు వ్యక్తుల మధ్య ఆన్లైన్లో బ్యాంకు లావాదేవీలు పారదర్శకంగా జరిగాయంటే ఏమిటర్ఠం? ఆ లావాదేవీల్ని పట్టుకుని తామేదో కొండను తవ్వేశామంటూ రామోజీరావు రాసిన రాతల్ని ఏమనుకోవాలి? ఇక్కడ రామోజీ రాసిన రాతల్లో కొత్త విషయమేదీ లేదు. షర్మిల ఖాతా నుంచి సతీష్ కుమార్ ఖాతాకు ఆన్లైన్లో నగదు బదిలీ అయిందనే విషయం తప్ప. మిగిలినదంతా గతంలో రామోజీ వండిన ‘పచ్చడే’. దానికే తిరుగులేని ఆధారాలు లభ్యం... అంటూ మొదటి పేజీలో ఆరు కాలాలు అచ్చువేసి... లోపలంతా పాత రోతకతనే చెప్పారు. ఇదంతా పోలింగ్‌కు ముందు రామోజీ చేస్తున్న కుట్రగా అర్థం కావటానికి పెద్ద పరిజ్ఞానమేమీ అవసరం లేదు. పెపైచ్చు లక్షా నలభైవేల ఎకరాలంటూ... 16 లక్షల కోట్ల రూపాయలంటూ అవే రోత రాతలు. అక్కడ నిజంగా అంత విలువైన ఖనిజమే ఉంటే ఈ పాటికి వాటిని దక్కించుకున్న విశాఖ స్టీల్‌ప్లాంట్ తవ్వకాలు మొదలుపెట్టే ఉండేది. అక్కడ నాసిరకం ఖనిజం తప్ప... పైసా లాభం తెచ్చే నాణ్యమైన ఖనిజం లేదని తెలియబట్టే అది కూడా తవ్వకానికి తటపటాయిస్తోందన్న నిజం రామోజీకి తెలియదా? తెలిసి కూడా ఎన్నికల ముందు అవే పాత కథనాల్ని వండారంటే అది పోలింగ్‌ను ప్రభావితం చేయడానికి కాదా? ఇదెక్కడి తీరు? ఈ రామోజీకి ఇంకెప్పుడు వస్తుంది జ్ఞానం? బినామీగా ఉండాల్సిన పరిస్థితి లేదు: సతీష్ ‘‘ఇవ్వాళ ‘ఈనాడు’లో రాసిన కథనం చూసి ఆశ్చర్యపోయా? షర్మిల నాకు డబ్బులు ఆన్లైన్లో బదిలీ చేయటంపై కూడా ఇంత దుష్ర్పచారం చేయగలరని నేననుకోలేదు. అయినా వేరొకరికి బినామీగా ఉండాల్సిన అవసరం నాకు లేదు. నేను 1993లోనే ఇంజనీరింగ్ పూర్తిచేశా. 1995లో మాస్టర్స్ డిగ్రీ చేశా. ఢిల్లీలో ఇంజనీరింగ్ సర్వీసెస్‌కు కూడా సెలక్టయినా... అది వదులుకుని అమెరికా వెళ్లా. అక్కడ మాస్టర్స్ డి గ్రీ చేసి వ్యాపారం మొదలుపెట్టా. 2001లో అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి దాన్ని వెయ్యి కోట్ల రూపాయల టర్నోవర్ సాధించే స్థాయికి తీసుకెళ్లా. బ్రదర్ అనిల్ నా క్లాస్మేట్ కావటంతో 1986 నుంచీ పరిచయం ఉంది. ఆయన కుటుంబంతోనూ సాన్నిహిత్యం ఉంది. ఇండియాలోనూ వ్యాపారాలున్నాయి. నాకు వేరొకరి బినామీగా ఉండాల్సిన అవసరం గానీ, అగత్యం గానీ లేవు. రాజకీయంగా షర్మిలను, వైఎస్ కుటుంబాన్ని దెబ్బ తీయాలన్న ఉద్దేశంతోనే ఎన్నికల ముందు ఈ రాతలు రాశారనిపిస్తోంది’’ అంటూ తాటి సతీష్ కుమార్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. -
బ్రదర్ అనిల్‌కుమార్ సత్యవాక్యోపదేశం 27th April 2014
-
బ్రదర్ అనిల్‌కుమార్ సత్యవాక్యోపదేశం 20th April 2014
-
బ్రదర్ అనిల్‌కుమార్ సత్యవాక్యోపదేశం 16th Mar 2014
-
కోలుకుంటున్న ఎమ్మెల్యే కాపు
* ఎమ్మెల్యేను పరామర్శించిన షర్మిల, బ్రదర్ అనిల్ * వైఎస్ జగన్ ఫోన్లో పరామర్శ సాక్షి ప్రతినిధి, బెంగళూరు: అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆరోగ్య పరిస్థితి క్రమంగా కుదుట పడుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై రాయదుర్గం పోలీసుల దాష్టీకాన్ని నిరసిస్తూ మంగళవారం ఆయన పోలీసు స్టేషన్ ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా చికిత్స కోసం ముందు బళ్లారికి, అక్కడనుంచి బెంగళూరుకు తరలించిన విషయం విధితమే. రామచంద్రారెడ్డికి మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బెంగళూరులోని కొలంబియా ఏషియా ఆస్పత్రి వైద్యులు బుధవారం తెలి పారు. వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ఎమ్మెల్యే కాపును ఫోన్లో పరామర్శించారు. కాపును జగన్ సోదరి షర్మిల, ఆమె భర్త బ్రదర్ అనిల్ ఆస్పత్రిలో పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తన భర్త ఆస్పత్రిలో కోలుకుంటున్నట్లు ఎమ్మెల్యే సతీమణి భారతి తెలిపారు. పోలీసుల వలయంలో రాయదుర్గం రాయదుర్గం: ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆత్మహత్యకు యత్నించిన నేపథ్యం లో వైఎస్సార్సీపీ శ్రేణులు ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం రాయదుర్గం పట్టణ బంద్ ప్రశాంతంగా జరిగింది. డీఎస్పీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో సుమారు 250 మంది ఆర్మీ, ప్రత్యేక దళాలు బందోబస్తు నిర్వహించాయి. పట్టణం పోలీసుల వలయంగా మారడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఎవరూ పట్టణంలోకి రాకుండా పల్లెల్లో హెచ్చరికలు జారీ చేశారు. పార్టీ కార్యాలయం ముందు ఒక ఎస్ఐతో పాటు ప్రత్యేక దళాలు మోహరించాయి. ప్రధాన కూడళ్లలో పోలీ సులు, ఆర్మీ పెద్ద సంఖ్యలో ఉండడంతో ప్రజలు పనులు చేసుకునేందుకు సైతం భయపడ్డారు. కౌన్సిలింగ్ పేరుతో సంఘ విద్రోహక శక్తులపై చర్యలు తీసుకోవాలని, కానీ సమాజంలో పేరు, ప్రతిష్టలు ఉన్న నాయకులను కొట్టడం అప్రజాస్వామికమని ప్రజలు చర్చించుకున్నారు. శాంతి ర్యాలీ నిర్వహించేందుకు అనుమతి కోరినా డీఎస్పీ తిరస్కరించినట్లు వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి మాధవరెడ్డి తెలిపారు. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు పెట్టి కార్యకర్తలు నగరంలోకి రాకుండా అడ్డుకున్నారని విమర్శించారు. -
ప్రేమతో మనుగడ సాగించాలి
-
ప్రేమతో మనుగడ సాగించాలి: వైఎస్ షర్మిల
క్రీస్తును విశ్వసించిన వారికి కష్టాలు దూరం బైబిలు మిషన్ మహాసభల్లో వైఎస్ షర్మిల సాక్షి, గుంటూరు: మనిషిని దేవుడు ఎంతో ప్రేమగా పుట్టించాడనీ, అంతే ప్రేమగా ఆయనపై ప్రేమ, సమానత్వంతో మనుగడ సాగించాలని వైఎస్ షర్మిల అన్నారు. ప్రతి ఒక్కరూ పాపం నుంచి విముక్తిని పొందాలనీ, అప్పుడే దేవుడైన క్రీస్తును సులభంగా చేరగలమన్నారు. గుంటూరుకు సమీపంలోని నాగార్జుననగర్‌లో మంగళవారం సాయంత్రం జరిగిన రాష్ట్రస్థాయి 76వ బైబిలు మిషన్ మహా సభల్లో ముఖ్య అతిథిగా షర్మిల లక్షలాది మంది దైవజనులనుద్దేశించి ప్రసంగించారు. నీతిమంతుడైన దేవుడు పాపులను పరిరక్షించి వారికి అన్ని విధాలా రక్షణ కలిగించేందుకే భువిపైకి వచ్చారన్నారు. మనుషుల్లో పెరిగిన పాప ప్రక్షాళన కోసం క్రీస్తు పడిన కష్టాలు ప్రతి ఒక్కరిలోనూ ఆధ్యాత్మిక ప్రేరణ కలిగించాయన్నారు. ‘వైఎస్ కుటుంబం కోసం, జగనన్న విడుదలకు బైబిలు మిషన్ మహాసభల్లో ఎంతోమంది ప్రార్థనలు చేశారు. వారందరికీ రాజన్న కుటుంబం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తోంద’ని షర్మిల పేర్కొన్నారు. వైఎస్ పేరును ప్రస్తావించిన ప్రతిసారీ కరతాళధ్వనులు మిన్నంటాయి. ఆకట్టుకున్న బ్రదర్ అనిల్ వాక్యోపదేశం: బ్రదర్ అనిల్‌కుమార్ అందించిన క్రీస్తు వాక్యోపదేశాన్ని దైవజనులు ఆసక్తిగా ఆలకించారు. దేవుని స్తుతి గేయాలు, ప్రార్థనలతో ఈ వాక్యోపదేశం గంటన్నరసేపు సాగింది. అనంతరం బైబిలు మిషన్ నిర్వాహకులు రెవరెండ్ శామ్యూల్ కిరణ్, ఏసురత్నం, సత్యానందం తదితరులు వైఎస్ షర్మిల, వైఎస్సార్ సీపీ కృష్ణా, గుంటూరు జిల్లాల సమన్వయకర్త ఆళ్ల రామకృష్ణారెడ్డిలకు ఆశీర్వాదాలు అందజేశారు. -
పాపం.. పాస్టర్
చాదర్‌ఘాట్, న్యూస్‌లైన్: గుర్తుతెలియని వ్యక్తుల దాడిలో తీవ్రంగా గాయపడిన రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌కు చెందిన పాస్టర్ సంజీవులు ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉంది. ఆయన్ను కుటుంబసభ్యులు శనివారం మలక్‌పేటలోని యశోద ఆస్పత్రికి తరలించారు. కిడ్నీగ్లాడర్, లివర్, పెద్దపేగు, అవయవాలు పూర్తిగా పనిచేయడం లేదని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. దీంతో పాస్టర్ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. కాగా ఆస్పత్రిలో చేర్చిన విషయం తెలుసుకున్న పలు దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. నిందితులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని ఇండియన్ దళిత క్రిస్టియన్ అధ్యక్షుడు వరప్రసాద్ ఆధ్వర్యంలో ఆస్పత్రి ఎదుట జాతీయ రహదారిపై బైఠాయించి పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రిస్టియన్లపై రోజురోజుకు దాడులు పెరుగుతున్నాయని, అయినా ప్రభుత్వం కఠినచర్యలు తీసుకోవడం లేదని ధ్వజమెత్తారు. దాడులు అమానుషమని, క్రిస్టియన్లకు రక్షణ కల్పిం చలేని సీఎం డౌన్‌డౌన్ అని నినదించారు.జాతీయ రహదారిపై ఆందోళన నేపథ్యంలో కోఠి, దిల్సుఖ్నగర్ మార్గంలో ట్రాఫిక్ స్తంభించిపోయిం ది. అన్నివిధాలా ఆదుకుంటాం: కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన పాస్టర్ సంజీవులును,ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని, ఖర్చులు కూడా భరిస్తుందని కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి హామీఇచ్చారు. సంజీవులును పరామర్శించి ఆయన కుటుంబాన్ని ఓదార్చారు. నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షిస్తామని హామీఇచ్చారు. దాడులు అమానుషం: బ్రదర్ అనిల్‌కుమార్ పాస్టర్ సంజీవులుపై దాడిని మత ప్రబోధకులు బ్రదర్ అనిల్‌కుమార్ తీవ్రంగా తప్పుబట్టారు. ముగ్గురు పిల్లలతో జీవనం సాగిస్తూ చర్చిలో పాస్టర్‌గా పనిచేస్తున్న వ్యక్తిపై దాడులు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సంజీవులు ఆరోగ్యం మెరుగుపడాలని ఆయన ప్రార్థన చేశారు. సంజీవులను పరామర్శించిన వారిలో మలక్‌పేట ఎమ్మెల్యే బలాల, సినీహీరో రాజా, తెలంగాణ క్రిస్టియన్స్ సంఘాల సంయుక్త ప్రధానకార్యదర్శి జెరూసలేం ముత్తయ్య, రంగారెడ్డి,హైదరాబాద్ వైఎస్సార్సీపీ ఎస్సీసెల్ నాయకుడు రవి, విరాజీ, సాల్మన్‌రాజు తదితరులు పాల్గొన్నారు. -
డాక్టర్ రమణారావుకి జగన్ నివాళి
-
క్రైస్తవుల భూములు తిరిగివ్వాలి
కోటగుమ్మం(రాజమండ్రి), న్యూస్‌లైన్ : అన్యాక్రాంతమైన క్రైస్తవుల భూములు వారికి తిరిగివ్వాలని అంతర్జాతీయ సువార్తికులు బ్రదర్ అనిల్ కుమార్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షుడు రెవరెండ్ కొమనాపల్లి ప్రతాప్‌సిన్హా ఆధ్వర్యంలో బుధవారం ఇక్కడ నిర్వహిస్తున్న క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన వచ్చారు. క్రైస్తవుల భూముల వ్యవహారంపై క్వారీ మార్కెట్ సెంటర్లోని బత్తిన సుబ్బారావు విగ్రహం వద్ద కార్పొరేషన్ మాజీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ బర్రే కొండబాబు ఆధ్వర్యంలో 10 రోజులుగా కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని సందర్శించారు. ఈ దీక్షల లక్ష్యం నెరవేరాలని అనిల్‌కుమార్ ప్రార్థన చేశారు. ఆయన మాట్లాడుతూ క్రైస్తవుల స్థలాలు కబ్జా చేసి, క్వారీలుగా వినియోగించుకోవడం అన్యాయమన్నారు. క్రైస్తవులకు చెందిన స్థలాలు వారికే చెందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. బర్రే కొండబాబు మాట్లాడుతూ రాజమండ్రి నగర శివారులో 50 ఎకరాలు, రెండున్నర ఎకరాల స్థలాలను కొన్నేళ్లుగా క్వారీ యజమానులు స్వాధీనం చేసుకుని, తవ్వకాలు చేస్తున్నారని వివరించారు. ఆయా స్థలాలను స్వాధీనం చేసుకుని, క్రైస్తవులకు సమాధుల తోట కోసం కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రెవరెండ్ ప్రతాప్‌సిన్హా, సుభాకర్ శాస్త్రి, సుధీర్ కుమార్, టాటా విక్టర్, నక్కా రాజబాబు తదితరులు పాల్గొన్నారు. -
బ్రదర్ అనిల్ కుమార్‌కు పితృవియోగం
హైదరాబాద్: బ్రదర్ అనిల్ కుమార్ తండ్రి కన్నుమూశారు. అనిల్ కుమార్ తండ్రి డాక్టర్ రమణరావు(70) కన్నుమూశారు. ఈ కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెంగళూరు పర్యటన రద్దయింది. -
బ్రదర్ అనిల్ కుమార్ సత్యవాక్యోపదేశం 10th Nov 2013
-
బ్రదర్ అనిల్ కుమార్ సత్యవాక్యోపదేశం 27th Oct 2013
-
చవకబారు ఆరోపణలొద్దు!
మత ప్రబోధకులు బ్రదర్ అనిల్ కుమార్‌కు అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణంలో పాత్ర ఉందంటూ ఆరోపణలు చేసిన బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్‌పై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒక ఎయిర్‌షోలో బ్రదర్ అనిల్ పాల్గొన్న దృశ్యాన్ని చూపించి కుంభకోణంలో పాత్ర అంటూ ఆరోపణలు చేయడం సరికాదని సోమవారం క్లాస్ తీసుకున్నారు. మీడియాలో ప్రచారం కోసం చవకబారు ఆరోపణలకు దిగొద్దని సలహా ఇచ్చినట్టు తెలిసింది. ఆ సందర్భంలో తన వాదనను సమర్ధిం చుకునేందుకు ప్రభాకర్ ఇబ్బంది పడినట్టు పార్టీ వర్గాలు చెప్పాయి. తన వద్ద ఉన్న కొన్ని కాగితాలను చూపించి ఒప్పించేందుకు ఆయన ప్రయత్నం చేసినట్టు తెలిసింది. గాలి కబుర్లను పోగేసి ఏవేవో వెబ్సైట్లలో ఉంచిన సమాచారాన్ని తానేదో శోధించి కనుగొన్నట్టు మీడియాకు చెప్పడం వల్ల పార్టీకి నష్టమే తప్ప ఫలితమేముండదని పేరు రాయడానికి ఇష్టపడని పార్టీ సీనియర్ నేత ఒకరు ధ్వజమెత్తారు. ఏదైనా విమర్శ లేదా ఆరోపణ చేసే ముందు నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని మరో నాయకుడు సూచించారు. ప్రభాకర్ ఎవరి చేతిలోనో పావుగా మారి ఇటువంటి ఆరోపణలకు దిగారేమోనన్న అనుమానాన్ని ఆయన వ్యక్తంచేశారు. ‘ఇటువంటి వ్యక్తిని మా నాయకుడు ఎలా ప్రధాన కార్యదర్శిని చేశారో అర్థం కావడం లేద’ని బీజేపీ తెలంగాణ ఉద్యమ కమిటీ నాయకుడొకరు వ్యాఖ్యానించారు. ప్రధాన కార్యదర్శి హోదాలో ప్రభాకర్ చెప్పిన విషయాల్ని ఖండిస్తే పార్టీ పరువు పోతుందని మిన్నకుండిపోయామే తప్ప లేదంటే గట్టిగానే బయటకు చెప్పేవారమని అన్నారు. -
వైయస్ విజయమ్మ ప్రార్థన
-
బ్రదర్ అనిల్ కుమార్ సత్యవాక్యోపదేశం 13th Oct 2013
-
బ్రదర్ అనిల్ కుమార్ సత్యవాక్యోపదేశం 22nd Sept 2013
-
Brother Anil Kumar Satyavakyopadesham 8th Sept 2013
-
Brother Anil Kumar Satyavakyopadesham 18th Aug 2013
-
బ్రదర్ అనిల్ కుమార్ సత్యవాఖ్యోపదేశమ్ 14th July 2013