తణుకు : దేవుడిచ్చిన వరం నిత్యం జీవం అని, దీన్ని ఇచ్చేందుకు ఏసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారని ప్రముఖ అంతర్జాతీయ సువార్తీకులు బ్రదర్ అనిల్‌కుమార్ అన్నారు. దేవుని జ్ఞానం లేక ఎంతో మంది జనులు నశించిపోతున్నారన్నారు. ‘టీం ఎడొనాయి’ ఆధ్వర్యంలో ‘రీచార్జ్’ పేరుతో బుధవారం తణుకులో యవనస్తుల సెమినార్ నిర్వహించారు. స్థానిక భోగవల్లి బాపయ్య, అన్నపూర్ణమ్మ కమ్మ కల్యాణ మండపంలో నిర్వహించిన ఈ సెమినార్‌కు బ్రదర్ అనిల్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ దేవుని జ్ఞానాన్ని కలిగి ఉండాలని అన్నారు.
ఒకని అవిధేయత అనేకులను పాపులుగా తీర్చిదిద్దితే, విధేయత ఎంతోమందిని నీతిమంతులుగా మార్చిందన్నారు. దేవుణ్ని విశ్వసించిన వాడు నిత్యజీవం కలిగి ఉండాలని, కనీసం జీవితంలో ఆవగింజంతైనా విశ్వాసం కలిగి ఉండాలని అన్నారు. అయితే ప్రస్తుత దినాల్లో విశ్వాసం ఉన్నప్పటికీ అది వాడుకలో ఉండటంలేదని తెలిపారు.
ఈ సందర్భంగా ‘జయం’ అనే అంశంపై యువతను ఉత్తేజరపరుస్తూ చేసిన ప్రసంగం ఆకట్టుకుంది. మరోవక్త పీటర్ సామ్యూల్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హృదయంలో విశ్వసించి నోటితో దాన్ని ఒప్పుకోవాలన్నారు. నిత్య యవ్వనానికి మరణం లేదన్నారు. ఈ సందర్భంగా క్రీస్తుపై ఆలపించిన ప్రత్యేక గీతాలు ఆకట్టుకున్నాయి. టీమ్ అడోనాయ్ నిర్వాహకులు సీహెచ్ విమల్‌కిరణ్, సీహెచ్ హేనావిమల్, కె.ఎర్నెస్ట్‌బాబు, జి.సన్నీజోసెఫ్ ఈ సెమినార్‌కు ఆధ్వర్యం వహించారు.
దేవుడిచ్చిన వరం నిత్య జీవం
Published Thu, Jan 14 2016 12:38 AM | Last Updated on Sun, Sep 3 2017 3:37 PM
Advertisement
Advertisement