కాకినాడ : రక్షణ టీవీ ఆంధ్రప్రదేశ్ శాఖ కార్యాలయాన్ని అనిల్ వరల్డ్ ఎవాంజలిజం వ్యవస్థాపకులు బ్రదర్ ఎం. అనిల్కుమార్ బుధవారం తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ప్రారంభించారు. అనంతరం నగరపాలక సంస్థ కార్యాలయంలోని డీకన్వెన్షన్హాలులో క్రైస్తవ ప్రతినిధులు, ఇతర ముఖ్యులతో ఏర్పాటు చేసిన సదస్సులో బ్రదర్ అనిల్ కుమార్ మాట్లాడారు. ఆ తర్వాత బ్రదర్ అనిల్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబుతోపాటు మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ మర్యాదపూర్వకంగా కలిశారు.