సాక్షి, హైదరాబాద్: బ్రదర్ అనిల్ కుమార్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఖమ్మం జిల్లా కోర్టు జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్‌ను హైకోర్టు మంగళవారం రద్దు చేసింది. తదుపరి ఉత్తర్వులు వెల్లడించేంతవరకూ వ్యక్తిగత హాజరుపై స్టే కొనసాగుతుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. కాగా 2009లో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని బ్రదర్ అనిల్ కుమార్‌పై ఖమ్మంలో కేసు నమోదైంది. స్టే కొనసాగుతుండగానే జిల్లా కోర్టు మరో సారి బ్రదర్ అనిల్‌కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
ఖమ్మం కోర్టు చర్యలను సవాల్ చేస్తూ బ్రదర్ అనిల్ కుమార్ హైకోర్టుని ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు స్టే కొనసాగుతుండగా వారెంట్ ఎలా జారీ చేశారంటూ హైకోర్టు ప్రశ్నించింది. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ, ఈ కేసు నుంచి తనను తొలగించాలని హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై తదుపరి విచారణ అక్టోబర్ 16కి హైకోర్టు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment