khammam court
-
‘అసామాన్యుడు’.. రిక్షా కార్మికుడి కుటుంబంలో పుట్టి.. బట్టల షాపులో పనిచేస్తూ..
సాక్షి, ఖమ్మం లీగల్ : ఇంట్లో మగపిల్లాడు పుట్టగానే సంతోషపడే వారున్నారు. కానీ ఆ పుత్రుడు వృద్ధిలోకి వస్తేనే తల్లిదండ్రులకు అసలైన సంతోషమన్నది జగమెరిగిన సత్యం. ఈ విషయం రిక్షా కార్మికుడైన ఓ వ్యక్తి విషయంలో అక్షరాలా నిజమైంది. రిక్షా నడుపుకునే వ్యక్తి తన కొడుకు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని తపించగా... ఆ కుమారుడు ఏకంగా న్యాయమూర్తిగా ఎంపికై తన తండ్రికి పుత్రోత్సాహం కలిగించాడు.. నలుగురితో శభాష్ అనిపించుకున్నాడు. ఆయనే ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జడ్జి డాక్టర్ టి.శ్రీనివాసరావు. మా కుటుంబం పేదరికంలో ఉంది. మాకు సరైన వనరులు లేవు. అందుకే చదువుకోలేకపోయాం.. జీవితంలో సాధించలేకపోయాం అని బాధపడే ఎందరో యువతకు న్యాయమూర్తి జీవితం, ఆయన ప్రస్థానం స్ఫూర్తిదాయకం. పనిచేస్తూనే చదువు ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌లో జల్లయ్య – నాగమ్మ దంపతులకు శ్రీనివాసరావు జన్మించారు. తండ్రి రిక్షా కార్మికుడు కాగా, తల్లి నాగమ్మ సాధారణ గృహిణి. ఈ నేపథ్యంలో ప్రాథమిక విద్య ప్రభుత్వ పాఠశాలలో పూర్తి చేశాక, పదో తరగతి చదువుతున్నప్పుడు జాతీయ పర్వదినాల్లో ప్రముఖులు జాతీయ జెండా ఎగురవేయడం చూసిన ఆయన తాను కూడా జాతీయజెండా ఎగురవేసే స్థాయికి చేరుకోవాలని నిశ్చయించుకున్నారు. అయితే అందుకు కుటుంబ ఆర్ధిక పరిస్థితులు సహకరించకపోవడంతో ఒక బట్టల షాపులో పనికి కుదిరాడు. అయినప్పటికీ తన లక్ష్యాన్ని మరిచిపోకుండా ఒకవైపు పనిచేస్తూనే.. మరోపక్క చదువుకుంటూ అత్యధిక మార్కులతో పట్టభద్రుడయ్యారు. ఆ తర్వాత ఆయన న్యాయశాఖపై దృష్టి సారించారు. ఒక న్యాయమూర్తిగా న్యాయార్థులకు సేవలు అందించవచ్చని, అక్రమార్కులను శిక్షించవచ్చని భావించిన శ్రీనివాసరావు న్యాయశాస్త్ర పట్టా పొంది 1995లో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. వృత్తిలో రాణిస్తూనే 2005లో మెజిస్ట్రేట్‌గా నియమితులయ్యారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం జిల్లా ప్రధాన న్యాయమూర్తి స్థాయికి చేరుకున్నారు. ఆత్మసంతృప్తికి తావ్వివక.. చాలా మంది ప్రభుత్వ ఉద్యోగం సాధించామనో, వ్యాపారంలో రాణించామనో ఓ స్థాయికి చేరుకున్నాక సంతృప్తి పడతారు. అయితే శ్రీనివాసరావు మాత్రం దీనికి పూర్తిగా భిన్నం. న్యాయమూర్తిగా తన విధులు సమర్థవంతంగా నిర్వర్తిస్తూనే న్యాయపాలన, వివిధ దేశాల చట్టాలు తదితర అంశాలపై తులనాత్మక అధ్యయనం చేశారు. 2007 నుంచి 2017 వరకు 52 అంశాలపై పేపర్ ప్రజెంటేషన్ చేశారు. ‘సత్వర న్యాయం’ అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందారు. ఆయన రాసిన వ్యాసాలు అనేక ప్రఖ్యాత జర్నళ్లలో ప్రచురితం కావడం విశేషం. అంతేకాకుండా ‘మోరాలిటీ ఇన్ లీగల్ సిస్టమ్’ అనే పుస్తకాన్ని కూడా రాశారు. సంచలనాత్మక కేసుల్లో తీర్పులు హైదరాబాద్‌లో సెషన్స్ జడ్జిగా పనిచేసిన కాలంలో శ్రీనివాసరావు ఎన్నో సంచలనాత్మక కేసుల్లో తీర్పులిచ్చారు. గోకుల్‌చాట్, లుంబినీపార్క్, దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసుతో పాటు పాస్‌పోర్ట్ ఆఫీస్‌లో పేలుళ్లు, అక్బరుద్దీన్ ఒవైసీపై దాడి తదితర సంచలనాత్మక కేసుల్లో తీర్పులిచ్చారు శ్రీనివాసరావు. కాగా, ఉగ్రవాద సంబంధ కేసుల్లో తీర్పులు ఇచ్చిన ఆయన భద్రత కోసం ప్రభుత్వం అంగరక్షకులను నియమించింది. న్యాయశాస్త్రంలో చివరి అంచులను చూసి డాక్టరేట్ పట్టా పొంది జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నా ఆయన సాధారణ జీవితం గడపడానికే ఇష్టపడతారు. సమయపాలనకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే శ్రీనివాసరావు వృత్తి పట్ల నిబద్ధతతో ఉండడమే కాక సిబ్బంది సంక్షేమం విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. ఖమ్మంలో పదవీ బాధ్యతలు స్వీకరించిన మరుసటి రోజు నుంచే అర్హులైన ఉద్యోగులకు పదోన్నతి ఇవ్వడం ప్రారంభించిన ఆయన, న్యాయవాదుల సమస్యలు పరిష్కరించేందుకు పూనుకున్నారు. కాగా, సమస్య ఎవరిదైనా తన పరిధిలో ఉంటే సకా రాత్మక ధోరణిలో పరిశీలించే శ్రీనివాసరావు, కేసుల సత్వర పరిష్కారంలో జిల్లాను ఆగ్రస్థానంలో నిలపడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. -
బ్రదర్ అనిల్ కుమార్‌కు ఊరట
సాక్షి, హైదరాబాద్: బ్రదర్ అనిల్ కుమార్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఖమ్మం జిల్లా కోర్టు జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్‌ను హైకోర్టు మంగళవారం రద్దు చేసింది. తదుపరి ఉత్తర్వులు వెల్లడించేంతవరకూ వ్యక్తిగత హాజరుపై స్టే కొనసాగుతుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. కాగా 2009లో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని బ్రదర్ అనిల్ కుమార్‌పై ఖమ్మంలో కేసు నమోదైంది. స్టే కొనసాగుతుండగానే జిల్లా కోర్టు మరో సారి బ్రదర్ అనిల్‌కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఖమ్మం కోర్టు చర్యలను సవాల్ చేస్తూ బ్రదర్ అనిల్ కుమార్ హైకోర్టుని ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు స్టే కొనసాగుతుండగా వారెంట్ ఎలా జారీ చేశారంటూ హైకోర్టు ప్రశ్నించింది. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ, ఈ కేసు నుంచి తనను తొలగించాలని హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై తదుపరి విచారణ అక్టోబర్ 16కి హైకోర్టు వాయిదా వేసింది. -
చెల్లని చెక్కులు... ముగ్గురికి జైలు
ఖమ్మం లీగల్: చెల్లని చెక్కు కేసులో ఓ వ్యక్తికి రెండేళ్ల జైలు శిక్ష పడింది. నగరంలోని బొక్కలగడ్డకు చెందిన మందా మల్లికార్జున్‌రావు తన అవసరాల కోసం 2011 ఆగష్టు 21న ఐదులక్షల రూపాయలను నగరంలోని గుట్టలబజారుకు చెందిన పోతురాజు బాలా వద్ద అప్పుగా తీసుకున్నాడు. డబ్బు చెల్లించాలని పోతురాజు బాలా కోరడంతో 2012 జూలై 20న 6.20 లక్షల రూపాయలకు చెక్కును మల్లికార్జున్ రావు ఇచ్చాడు. ఇది చెల్లకపోవడంతో మల్లికార్జున్‌కు లీగల్ నోటీసును బాలా పంపించాడు. అప్పటికీ డబ్బు చెల్లించకపోవడంతో ఖమ్మం కోర్టులో ప్రయివేటు కేసును బాలా దాఖలు చేశాడు. ఈ కేసును ఖమ్మం మూడవ అదనపు ఫస్ట్‌క్లాస్ జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ విచారించి, మందా మల్లికార్జున్‌రావుకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ, నష్ట పరిహారంగా 13.20లక్షల రూపాయలు చెల్లించాలని పేర్కొంటూ గురువారం తీర్పునిచ్చారు. పోతురాజు బాలా తరఫున న్యాయవాదిగా హైదర్ అలీ వ్యవహ రించారు. మరో కేసులో... చెల్లని చెక్కు కేసులో ఒకరికి రెండేళ్ల జైలు శిక్ష పడింది. నగరంలోని బొక్కలగడ్డకు చెందిన బోడా నాగేశ్వరరావు తన అవసరాల కోసం జనవరి 20, 2011న ఐదులక్షల రూపాయలను ఖమ్మం గుట్టలబజారుకు చెందిన పోతురాజు బాలా వద్ద అప్పుగా తీసుకున్నాడు. బాకీ చెల్లించేందుకుగాను 2012 జూన్ 2వ తేదీన 6.60లక్షల రూపాయలకు చెక్కును బాలాకు ఇచ్చాడు. ఇది చెల్లకపోవడంతో నాగేశ్వరరావుకు బాలా లీగల్ నోటీస్ ఇచ్చాడు. దీనికి నాగేశ్వరరావు స్పందించలేదు. దీంతో ఖమ్మం కోర్టులో ప్రయివేటు కేసును బాలా దాఖలు చేశాడు. నిందితుడు బోడా నాగేశ్వరరావుపై నేరం రుజువైనట్టుగా పేర్కొంటూ, అతనికి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ, నష్ట పరిహారంగా 13.20లక్షల రూపాయలు చెల్లించాలని పేర్కొంటూ ఖమ్మం మూడవ అదనపు ఫస్ట్‌క్లాస్ జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ గురువారం తీర్పు చెప్పారు. పోతురాజు బాలా తరఫున న్యాయవాదిగా హైదర్ అలీ వ్యవహరించారు. వేరొక కేసులో... చెల్లని చెక్కు కేసులో ఓ వ్యక్తికి రెండేళ్ల జైలు శిక్ష పడింది. నగరంలోని పీఎస్ఆర్ రోడ్డుకు చెందిన అంబడిపుడి నరసింహారావు నుంచి 2011 ఏప్రిల్ 20న లక్ష రూపాయలను బూర్గంపాడు మండలం సారపాకకు చెందిన డి.నరసింహారెడ్డి తన అవసరాల కోసం అప్పుగా తీసుకున్నాడు. డబ్బు చెల్లించాలని నరసింహారావు ఒత్తిడి చేయడంతో 2011 సెప్టెంబర్ 5న లక్ష రూపాయలకు నరసింహారెడ్డి చెక్కు ఇచ్చాడు. ఇది చెల్లకపోవడంతో నరసింహారావు లీగల్ నోటీస్ ఇచ్చాడు. అరుునప్పటికీ డబ్బు చెల్లించకపోవడంతో ఖమ్మం కోర్టులో ప్రయివేటు కేసు దాఖలు చేశాడు. ఈ కేసును ఖమ్మం మూడవ అదనపు జ్యూడిషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ డి.విజయసారధిరాజు విచారించి, నేరం రుజువైనట్టుగా పేర్కొంటూ నరసింహారెడ్డికి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ, నష్ట పరిహారంగా లక్ష రూపాయలు ఇవ్వాలంటూ ఖమ్మం మూడవ అదనపు జ్యూడిషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ డి.విజయసారధిరాజు గురువారం తీర్పునిచ్చారు. నరసింహారావు తరఫున న్యాయవాదిగా మద్ది శ్రీనివాసరెడ్డి వ్యవహరించారు. -
ఆంధ్రజ్యోతి ఎండీని అడ్డుకున్న న్యాయవాదులు
-
ఆంధ్రజ్యోతి ఎండీని అడ్డుకున్న న్యాయవాదులు
ఖమ్మం: పరువునష్టం దావా కేసులో ఖమ్మం కోర్టులో హాజరైన ఆంధ్రజ్యోతి దినపత్రిక మేనేజింగ్ డెరైక్టర్ (ఎండీ) వేమూరి రాధాకృష్ణను అడ్డుకునేందుకు తెలంగాణ న్యాయవాదులు ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఆంధ్రజ్యోతి సిబ్బంది, న్యాయవాదుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపుచేశారు. తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగేలా ఆంధ్రజ్యోతి పత్రికలో వార్త ప్రచురితమైందంటూ ఖమ్మం రూరల్ మండలం సత్యనారాయణపురం గ్రామానికి చెందిన పూసా నరేందర్ 2010 సంవత్సరంలో కోర్టులో కేసు దాఖలు చేశాడు. దీంతో, వేమూరి రాధాకృష్ణపై నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. -
వసంతక్కను కోర్టులో హాజరుపర్చిన పోలీసులు
ఖమ్మం లీగల్, న్యూస్‌లైన్: మావోయిస్ట్ జిల్లా ప్రధాన కార్యదర్శి కిరణ్ భార్య, దళ కమాండర్ పూజారి ధనలక్ష్మి అలియాస్ వసంతక్కను మంగళవారం ఖమ్మం మొదటి అదనపు ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్లో భారీ భద్రత నడుమ హాజరుపర్చారు. మేజిస్ట్రేట్ మహ్మద్ అఫ్రోజ్ అక్తర్ ఆమెకు ఈనెల 24 వరకు జ్యూడీషియల్ రిమాండ్ పొడిగించారు. వసంతక్కతోపాటు మడికి దీమయ్య, ఉడత శంకర్, మడకం మాసా, నరసింహరావు, నందాలకు కూడా రిమాండ్ పొడిగించారు. మొత్తం 10 కేసుల్లో... వివిధ అభియోగాల నేపథ్యంలో 10 కేసుల్లో వసంతక్కకు రిమాండ్ విధించారు. దుమ్ముగూడెం పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఈఏడాది జనవరి 8న జరిగిన హోంగార్డు నీలం నరేష్ హత్యకేసులో ఆమె నిందితురాలు. కేసులోని వివరాల ప్రకారం.. సంఘటన రోజు సాయంత్రం 4 గంటలకు పర్ణశాల గ్రామంలో హోంగార్డు నీలం నరేష్ తన స్నేహితులతో వాలీబాల్ ఆడుకోనుచుండగా మావోయిస్టు వెంకటాపురం ఏరియా శబరి దళం సభ్యులు నలుగురు నరేష్‌ను కాల్చి చంపారు. నరేష్ బావమరిది ఆకుల కృష్ణారావు ఫిర్యాదు మేరకు పోలీసులు వసంతక్కను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశ పెట్టారు.