
వేమూరి రాధాకృష్ణ(ఫైల్)
ఖమ్మం: పరువునష్టం దావా కేసులో ఖమ్మం కోర్టులో హాజరైన ఆంధ్రజ్యోతి దినపత్రిక మేనేజింగ్ డెరైక్టర్ (ఎండీ) వేమూరి రాధాకృష్ణను అడ్డుకునేందుకు తెలంగాణ న్యాయవాదులు ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఆంధ్రజ్యోతి సిబ్బంది, న్యాయవాదుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపుచేశారు.
తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగేలా ఆంధ్రజ్యోతి పత్రికలో వార్త ప్రచురితమైందంటూ ఖమ్మం రూరల్ మండలం సత్యనారాయణపురం గ్రామానికి చెందిన పూసా నరేందర్ 2010 సంవత్సరంలో కోర్టులో కేసు దాఖలు చేశాడు. దీంతో, వేమూరి రాధాకృష్ణపై నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది.