vailation of election code
-
బ్రదర్ అనిల్ కుమార్‌కు ఊరట
సాక్షి, హైదరాబాద్: బ్రదర్ అనిల్ కుమార్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఖమ్మం జిల్లా కోర్టు జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్‌ను హైకోర్టు మంగళవారం రద్దు చేసింది. తదుపరి ఉత్తర్వులు వెల్లడించేంతవరకూ వ్యక్తిగత హాజరుపై స్టే కొనసాగుతుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. కాగా 2009లో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని బ్రదర్ అనిల్ కుమార్‌పై ఖమ్మంలో కేసు నమోదైంది. స్టే కొనసాగుతుండగానే జిల్లా కోర్టు మరో సారి బ్రదర్ అనిల్‌కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఖమ్మం కోర్టు చర్యలను సవాల్ చేస్తూ బ్రదర్ అనిల్ కుమార్ హైకోర్టుని ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు స్టే కొనసాగుతుండగా వారెంట్ ఎలా జారీ చేశారంటూ హైకోర్టు ప్రశ్నించింది. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ, ఈ కేసు నుంచి తనను తొలగించాలని హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై తదుపరి విచారణ అక్టోబర్ 16కి హైకోర్టు వాయిదా వేసింది. -
ఎన్నికల కోడ్ పట్టింపే లేదు
సాక్షి, అమరావతి: ఎన్నికల కోడ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకోవడంలేదు. ఉండవల్లిలో తన అధికారిక నివాసం పక్కనే ఉన్న ప్రజావేదికను ఆయన పూర్తిస్థాయి పార్టీ కార్యకలాపాలకు వినియోగిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నా ఆయన లెక్కచేయడంలేదు. పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు, ముఖ్య నేతలతో అక్కడే సమావేశం నిర్వహించనున్నారు. పోలింగ్ తర్వాత పరిణామాలు, గెలుపు అవకాశాలపై చర్చించేందుకు సోమవారం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రజల నుంచి విజ్ఞప్తులు తీసుకునే ప్రజావేదికలో పార్టీ సమావేశం ఎలా నిర్వహిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. నిజానికి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి ప్రజావేదికను చంద్రబాబు పూర్తిస్థాయిలో పార్టీ కార్యకలాపాలకు వినియోగించడం మొదలుపెట్టారు. ఎన్నికల నియమావళి ప్రకారం ముఖ్యమంత్రి, మంత్రులు తమ అధికారిక నివాసాలను పార్టీ కార్యక్రమాలకు ఉపయోగించకూడదు. సీఎంను కలిసేందుకు వచ్చే ప్రజల కోసం మూడేళ్ల క్రితం సీఆర్డీఏ ఐదున్నర కోట్లతో ప్రజావేదికను నిర్మించింది. ప్రజల కోసమే దాన్ని వినియోగించాలి. అయితే.. ఇక్కడ ప్రజల నుంచి చంద్రబాబు విజ్ఞప్తులు స్వీకరించడం చాలా అరుదుగా జరుగుతుండేది. కృష్ణా నది కరకట్టపై తాడేపల్లి మండల పరిధిలోని ఉండవల్లిలో ఉన్న లింగమనేని రమేశ్‌కు చెందిన అక్రమ కట్టడాన్ని చంద్రబాబు తన అధికారిక నివాసంగా మార్చుకున్న విషయం తెలిసిందే. దాని పక్కనే ఈ గ్రీవెన్స్ హాలును నిర్మించారు. మొదటి నుంచి దీన్ని టీడీపీ కార్యక్రమాలకు ఎక్కువగా వినియోగిస్తున్న చంద్రబాబు ఎన్నికల సమయంలో దాన్ని పూర్తిస్థాయి పార్టీ కార్యాలయంలా మార్చివేశారు. పార్టీ కార్యకర్తల సమావేశాలు, జిల్లా, నియోజకవర్గాల సమీక్షలు, చేరికలు వంటి అన్ని కార్యకలాపాలన్నింటినీ ఇందులోనే నిర్వహిస్తున్నారు. పోలింగ్ జరగడానికి ముందు వివిధ జిల్లాల పార్టీ కార్యకర్తల సమావేశాలను వరుసగా ప్రజావేదికలో నిర్వహించారు. ప్రభుత్వ నిధులతో నెలకొల్పిన కమ్యూనికేషన్ వ్యవస్థను కూడా ఇక్కడి నుంచే పార్టీ యథేచ్ఛగా వినియోగిస్తోంది. ఈ వ్యవస్థ ద్వారానే టెలీకాన్ఫరెన్స్‌లో వేలాది మంది పార్టీ నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు మాట్లాడుతున్నట్లు చెబుతున్నారు. ఎన్నికల కోడ్ రాకముందు ప్రజావేదికను పార్టీ అవసరాల కోసం వినియోగించిన చంద్రబాబు కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత మరింత అభ్యంతరాలు వ్యక్తమైనా పట్టించుకోకుండా దాన్ని పార్టీ కోసం వాడుకున్నారు. ఇప్పుడు పోలింగ్ ముగిసిన తర్వాత కూడా పార్టీ సమావేశాలు అందులోనే ఏర్పాటు చేస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
బాబుపై సీఈసీకి విజయసాయి రెడ్డి ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఆదివారం లేఖ రాశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు యధేచ్ఛగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆయన ఆ లేఖలో ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నా ప్రజావేదిక ద్వారా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజావేదికలో ఎమ్మెల్యేలను పిలిచి టెలీ కాన్ఫరెన్స్‌లు, పార్టీ సమీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రజావేదిక ప్రభుత్వానికి సంబంధించిన భవనమని విజయసాయి రెడ్డి తెలిపారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నప్పుడు ఇలాంటి సమావేశాలు ఈసీ అనుమతితో చేయాల్సి ఉందన్నారు. చంద్రబాబు ఈసీ అనుమతి తీసుకున్నారో లేదో తమకు తెలియదని, ఈ విషయంపై సీఈసీ వెంటనే జోక్యం చేసుకోవాలని విజయసాయి రెడ్డి కోరారు. కాగా ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ప్రభుత్వ భవనాలను పార్టీ కార్యకలాపాల కోసం వినియోగించకూడదని తెలిసినా చంద్రబాబు పట్టించుకోవడం లేదు. ఉండవల్లిలో తన అధికారిక నివాసం పక్కనే నిర్మించిన ప్రజావేదికను ఆయన పూర్తిస్థాయిలో పార్టీ కార్యకలాపాలకు వినియోగిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నా ఆయన మాత్రం కించిత్ కూడా లెక్క చేయడంలేదు. తాజాగా సోమవారం పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు, ముఖ్య నేతలతో అక్కడే సమావేశం నిర్వహించనున్నారు. పోలింగ్ తర్వాత పరిణామాలు, గెలుపు అవకాశాలపై చర్చించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ కార్యాలయంలో కాకుండా ప్రజల నుంచి విజ్ఞప్తులు తీసుకునేందుకు ఉపయోగించాల్సిన ప్రజావేదికలో ఈ సమావేశం ఎలా నిర్వహిస్తారనే దానికి టీడీపీ నేతల నుంచి సమాధానం కరువైంది. -
పోలింగ్ కేంద్రం వద్ద బాలకృష్ణ ప్రచారం
అనంతపురం : హిందుపురం టీడీపీ అభ్యర్థి, సినీనటుడు బాలకృష్ణ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. మైలాపురం క్రాస్ పోలింగ్ కేంద్రం వద్ద ఆయన బుధవారం ఎన్నికల ప్రచారం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా కోడ్ ఉల్లంఘించారంటూ బాలకృష్ణపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. మరోవైపు అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం వ్యాప్తంగా టీడీపీ ఏజెంట్లు ... వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లను భయపెడుతున్నారు. గాండ్లపెంట, నల్లమాడ, నల్లచెరువు, కదిరి మండలాల్లో వైఎస్ఆర్ సీపీ ఏజెంట్లను టీడీపీ ఏజెంట్లు భయపెట్టి, బలవంతంగా పోలింగ్ బూత్‌ల నుంచి బయటకు పంపిస్తున్నారు.