పోలింగ్ కేంద్రం వద్ద బాలకృష్ణ ప్రచారం | Balakrishna Violates Election Code in hindupuram | Sakshi

పోలింగ్ కేంద్రం వద్ద బాలకృష్ణ ప్రచారం

May 7 2014 1:22 PM | Updated on Aug 29 2018 1:59 PM

పోలింగ్ కేంద్రం వద్ద బాలకృష్ణ ప్రచారం - Sakshi

పోలింగ్ కేంద్రం వద్ద బాలకృష్ణ ప్రచారం

హిందుపురం టీడీపీ అభ్యర్థి, సినీనటుడు బాలకృష్ణ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు.

అనంతపురం : హిందుపురం టీడీపీ అభ్యర్థి, సినీనటుడు బాలకృష్ణ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. మైలాపురం క్రాస్ పోలింగ్ కేంద్రం వద్ద ఆయన బుధవారం ఎన్నికల ప్రచారం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా కోడ్ ఉల్లంఘించారంటూ బాలకృష్ణపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు.

మరోవైపు అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం వ్యాప్తంగా టీడీపీ ఏజెంట్లు ... వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లను భయపెడుతున్నారు. గాండ్లపెంట, నల్లమాడ, నల్లచెరువు, కదిరి మండలాల్లో వైఎస్ఆర్ సీపీ ఏజెంట్లను టీడీపీ ఏజెంట్లు భయపెట్టి, బలవంతంగా పోలింగ్ బూత్ల నుంచి బయటకు పంపిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement