బాలకృష్ణకు నవీన్ నిశ్చల్ ముచ్చెమటలు!
హిందూపురం: అనంతపురం జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి నవీన్ నిశ్చల్ ప్రచారం ఊపందుకుంది. హిందూపురంలో నవీన్ నిశ్చల్ కు రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది.
లోకల్ కార్డుతో నవీన్ నిశ్చల్ ప్రత్యర్ధులను హడలెత్తిస్తున్నారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సంక్షేమ పథకాలను, పార్టీ అధినేత వైఎస్ జగన్ రూపొందించిన మ్యానిఫెస్టో, అమలు చేయబోయే పథకాలను ప్రజలకు వివరిస్తూ నవీన్ నిశ్చల్ ఆకట్టుకుంటున్నారు.
ఈ నియోజకవర్గంలో స్థానికేతరుడైన తెలుగుదేశం అభ్యర్ధి, సినీనటుడు నందమూరి బాలకృష్ణపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ బాలకృష్ణ, ఇతర పార్టీ నేతలకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు.
స్థానికంగా ఉండే తనను గెలిపిస్తే ప్రజలతో మమేకవుతానని.. ప్రత్యర్ధిని గెలిపిస్తే హిందూపురం నియోజకవర్గ సమస్యలను ఎవరు తీరుస్తారని ప్రజల దృష్టికి తీసుకు రావడంలో నవీన్ నిశ్చల్ సఫలమయ్యారు.