వైఎస్సార్సీపీని వీడను: వై గురునాథరెడ్డి | will not leave ysr congress party, says Y Gurunadha reddy | Sakshi
Sakshi News home page

వైఎస్సార్సీపీని వీడను: వై గురునాథరెడ్డి

Published Wed, Mar 12 2014 1:22 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM

వైఎస్సార్సీపీని వీడను: వై గురునాథరెడ్డి - Sakshi

వైఎస్సార్సీపీని వీడను: వై గురునాథరెడ్డి

తాను వైఎస్సార్సీపీకి రాజీనామా చేస్తున్నట్లు మీడియాలో జరుగుతున్న ప్రచారం బూటకమని ఆ పార్టీ అనంతపురం ఎమ్మెల్యే వై గురునాథరెడ్డి తెలిపారు.

అనంతపురం, న్యూస్‌లైన్:  తాను వైఎస్సార్సీపీకి రాజీనామా చేస్తున్నట్లు మీడియాలో జరుగుతున్న ప్రచారం బూటకమని ఆ పార్టీ అనంతపురం ఎమ్మెల్యే వై గురునాథరెడ్డి తెలిపారు.  మీడియా అత్యుత్సాహం వల్లే ఈ దుష్ర్పచారం జరిగిందని చెప్పారు. అనంతపురం లోక్‌సభ ఎన్నికల ఇన్‌చార్జి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీకాంతరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి తదితరులతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుటుంబంతో 40 ఏళ్లుగా తమ కుటుంబానికి సాన్నిహిత్యం ఉందని తెలిపారు. కష్టనష్టాల్లో పరస్పరం పాలుపంచుకుంటామనే విష యం అందరికీ తెలిసిందేనని చెప్పారు. రాజీనామా అంటూ కొందరు పనిగట్టుకుని దుష్ర్పచారం చేశారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఎప్పటికీ వైఎస్సార్సీపీని వీడేదిలేదని స్పష్టం చేశారు. గురునాథరెడ్డి రాజీనామా వదంతులు కేవలం మీడియా సృష్టే పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement