వైఎస్సార్ సీపీ సమైక్య ఆందోళన | YSRCP's samaikya protests | Sakshi
Sakshi News home page

వైఎస్సార్ సీపీ సమైక్య ఆందోళన

Published Tue, Jan 7 2014 3:53 AM | Last Updated on Mon, Jul 30 2018 6:12 PM

YSRCP's samaikya protests

అనంతపురం, న్యూస్‌లైన్ :   సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రాయదుర్గం, గుంతకల్లు, కదిరిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు సోమవారం ఆందోళనలు నిర్వహించారు. రాయదుర్గంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సతీమణి కాపు భారతి అధ్వర్యంలో వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి వినాయక సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు.

ఆ తర్వాత సర్కిల్‌లో మానవహారంగా ఏర్పడి సమైక్య నినాదాలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుటిలయత్నం చేస్తోందని, పార్టీలకతీతంగా ఏకతాటిపైకి వచ్చి పోరాడితే రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని పేర్కొన్నారు. కదిరి, గుంతకల్లులో సమైక్యాంధ్రకు మద్దతుగా ఆ పార్టీ నేతలు మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement