వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రా రెడ్డిపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రా రెడ్డిపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. వైఎస్ఆర్ సీపీ పిలుపు మేరకు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్తో బుధవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు రహదారులను దిగ్బంధించారు.
రాయదుర్గం నియోజకవర్గంలో కాపు రామచంద్రా రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. కాగా కణేకల్ పోలీస్ స్టేషన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై అక్రమ కేసులు బనాయించారు. ఈ విషయం తెలుసుకుని ఎమ్మెల్యే నిరసన తెలుపుతూ పోలీస్ స్టేషన్ బయట బైఠాయించారు. ఈ సందర్భంగా ఆయన పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించారు. ఎస్ఐ శేఖర్ కాపు రామచంద్రారెడ్డిని పోలీస్ స్టేషన్లో నిర్బంధించి మీ అంతు చూస్తామంటూ బెదిరించారు.