
సాక్షి, అనంతపురం : వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై పుట్టపర్తి ఎస్సై దిలీప్ కుమార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. తప్పుడు కేసులు బనాయించి వేధింపులకు గురిచేస్తున్నారు. పుట్టపర్తికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఉత్తప్పపై దాడి చేశారు. తప్పుడు కేసులు బనాయించి థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. ఎస్సై వేధింపులు భరించలేక ఉత్తప్ప పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. స్థానికులు గమనించి ఉత్తప్పను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఉత్తప్ప పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు.కాగా ఎస్సై దిలీప్ టీడీపీ నేతల డైరెక్షన్లో పని చేస్తూ తమని వేధిస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపించారు. ఎస్సై దిలీప్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment