'గవర్నర్ తోనూ బాబు అబద్ధాలు చెప్పించారు'
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అబద్ధాలకోరు అని వైఎస్ఆర్ సీపీ నేత, రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆరోపించారు. అనంతపురం పట్టణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో చంద్రబాబు విఫలమయ్యారని పేర్కొన్నారు. గవర్నర్ తోనూ చంద్రబాబు అబద్ధాలు చెప్పించారని వ్యాఖ్యానించారు. సిగ్గు, లజ్జా లేని ప్రభుత్వం చంద్రబాబుది.. చంద్రబాబు జీవితమంతా అవినీతిమయమేనని మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.