
చంద్రబాబు నియంత
ముఖ్యమంత్రి చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు.
నిరసన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కాపు ధ్వజం
రాయదుర్గం : ముఖ్యమంత్రి చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేయడం ఆయన అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాపై శాసన సభ స్పీకర్ సంవత్సరం పాటు సస్పెన్షన్ విధించడాన్ని హైకోర్టు తప్పు పట్టింది. శాసన సభకు హాజరు కావడానికి వచ్చిన ఆమెను చంద్రబాబు ప్రభుత్వం అడ్డుకోవడాన్ని నిరసిస్తూ మాజీఎమ్మెల్యే ఆధ్వరంలో శనివారం రాయదుర్గంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి టవర్ క్లాక్ వద్దనున్న అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు.
అనంతరం విగ్రహాన్ని పాలతో అభిషేకించి, పూల మాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యాంగాన్ని అవమానించిన చంద్రబాబుకు మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరారు. గఢాఫీ, సద్దాం హుస్సేన్, హిట్లర్ లాంటి ఎంతోమంది నియంతలు ప్రజల ఆగ్రహానికి గురై కాలగర్భంలో కలిసిపోయారన్న విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలన్నారు.
కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి మాధవరెడ్డి, ఎస్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శి భోజరాజునాయక్, పట్టణ అధ్యక్షులు నబీష్, హీరేహాళ్, బొమ్మనహాళ్, కణేకల్లు మండలాల కన్వీనర్లు వన్నూరుస్వామి, ఈశ్వర్ రెడ్డి, ఆలూరు చిక్కణ్ణ, జెడ్పీటీసీ విజయకుమార్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు దిలావర్ బాషా, కౌన్సిలర్లు పేర్మి బాలాజి, రహిమాన్, గోనబావి షర్మాస్, మున్సిపల్ మాజీ వైస్ చెర్మైన్ ఎన్టీ సిద్ధప్ప, మాజీ కౌన్సిలర్లు వసంతరాజు, సీతారాం, నాయకులు కణేకల్లు మరియప్ప, రాజేంద్రరెడ్డి, పై తోట సంజీవ తదితరులు పాల్గొన్నారు.