'ఇప్పటివరకు నోరు ఎందుకు విప్పలేదు'
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడిపై వైఎస్ఆర్ సీపీ నేత కాపు రామచంద్రారెడ్డి బుధవారం హైదరాబాద్లో మండిపడ్డారు. ఓటుకు కోట్లు వ్యవహారం నుంచి చంద్రబాబు తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు అవినీతి కేసుకు, సెక్షన్ -8కు సంబంధం లేదన్నారు.
నోరు విప్పితే తెలంగాణ ప్రభుత్వం పడిపోతుందని చంద్రబాబు చెబుతున్నారని కాపు రామచంద్రరెడ్డి గుర్తు చేశారు. కానీ ఇప్పటి వరకు నోరు ఎందుకు విప్పలేదని చంద్రబాబును ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు తన నిజాయితీ నిరూపించుకోవాలని కాపు రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు.