దీక్షా శిబిరంలో ప్రసంగిస్తున్న వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు చంద్రకాంతరెడ్డి
ఆదోని టౌన్ : నాలుగేళ్లలో ప్రత్యేక హోదాపై నోరు మెదపని సీఎం చంద్రబాబు నాయుడు నేడు హోదా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్న తీరు మరోమారు రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టేందుకేనని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ గౌరవ అధ్యక్షుడు చంద్రకాంతరెడ్డి, రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి గోపాల్‌రెడ్డి, పీఏసీ సభ్యులు డాక్టర్ మధుసూదన్ ఆరోపించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు చేపట్టిన ఆమరణ దీక్షలకు మద్దతుగా స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆ పార్టీ నాయకులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆరవ రోజు గురువారం కొనసాగాయి. పట్టణ ఎస్సీ సెల్ నాయకులు ఏసేపు, చిన్న, క్రిష్ణ, రవి, రాజేష్, వైపీ రాజశేఖర్, వీరేష్, లక్ష్మన్న, భాస్కర్, కిరణ్, తిమ్మప్ప, ఈరన్న కూర్చున్న దీక్ష శిబిరాన్ని వారు ప్రారంభించి మాట్లాడారు. హోదా సాధనకు ఎంపీలు ప్రాణాలు తెగించి చేపట్టిన ఆమరణ దీక్షలను భగ్నం చేస్తూ ఆసుపత్రికి తీసుకెళ్లడం అప్రజాస్వామికమని విమర్శించారు.
సీఎం చంద్రబాబు స్వార్థ ప్రయోజనాల కోసం హోదా అంశాన్ని పక్కనపెట్టి ప్రత్యేక ప్యాకేజీ పాటపాడారనే విషయం ప్రజలకు తెలుసని చెప్పారు. హోద ఉద్యమంలో పాల్గొంటే కేసులు నమోదు చేస్తామని సీఎం విద్యార్థులను హెచ్చరించిన విషయాన్ని ఎవరూ మరిచిపోలేదన్నారు. ఇప్పటికైనా సీఎం తమ ఎంపీలతో రాజీనామా చేయించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు వెంకటేశ్వర్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, ప్రసాదరావు, విశ్వనాథ్, తాయన్న, ఈరన్న, నాగేంద్ర, వేణు, నల్లారెడ్డి, కిట్టు, ప్రసాద్, అశోక్, దేవిరెడ్డి, చిన్న, గోవిందరాజులు, మధు, బాలు, సురేష్, రవి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment