'టీడీపీకి సమైక్య ఉద్యమం చేసే అర్హత లేదు' | No Right to TDP to Participate in Seemandhra Protest: YSR Congress Party MLAs | Sakshi
Sakshi News home page

'టీడీపీకి సమైక్య ఉద్యమం చేసే అర్హత లేదు'

Published Wed, Aug 7 2013 1:42 PM | Last Updated on Fri, Aug 10 2018 7:58 PM

'టీడీపీకి సమైక్య ఉద్యమం చేసే అర్హత లేదు' - Sakshi

'టీడీపీకి సమైక్య ఉద్యమం చేసే అర్హత లేదు'

కాంగ్రెస్‌, టీడీపీ కుమ్మక్కై రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు గురునాథ్‌రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి ఆరోపించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా చంద్రబాబు లేఖ ఇచ్చారని, టీడీపీ ఎమ్మెల్యేలకు సమైక్య ఉద్యమం చేసే అర్హత లేదని వారు పేర్కొన్నారు.

సమైక్య ఉద్యమాన్ని పోలీసులతో అణచివేయాలని చూస్తున్నారని వారు ఆరోపించారు. వైఎస్‌ఆర్‌ సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని అన్నారు. రెచ్చగొడితే ఉద్యమ రూపురేఖలు మారతాయని వారు హెచ్చరించారు.

రాయల తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వై.విశ్వేశ్వరరెడ్డి, తోపుదుర్తి కవిత,శంకర్‌ నారాయణ చెప్పారు. రాయలసీమను విభజిస్తే ఊరుకునేది లేదని వారు స్పష్టం చేశారు. జగన్‌ను దెబ్బతీసేందుకు టీడీపీ, కాంగ్రెస్‌ డ్రామాలాడుతున్నాయని వారు ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement