Gurnath Reddy
-
హత్యా రాజకీయాలకు ‘అనంత’ ఎమ్మెల్యే ప్రోత్సాహం
అనంతపురం: టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని వైఎస్ఆర్ సీపీ నేత గుర్నాథ్ రెడ్డి ఆరోపించారు. భూదందాలకు ఎమ్మెల్యే సహకరిస్తున్నారని విమర్శించారు. అనంతపురంలో అవినీతికి ప్రభాకర్ చౌదరి కేంద్ర బిందువుగా మారారని గుర్నాథ్ రెడ్డి ఆరోపించారు. అనంతపురం నగర పాలక సంస్థలో కమీషన్లదే రాజ్యమని అన్నారు. -
'బంద్‌ను విజయవంతం చేయాలి'
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఏపీ ద్రోహులు' అని వైఎస్ఆర్సీపీ నేతలు ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి, శంకర్‌నారాయణ, గుర్నాథ్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం అనంతపురంలో వారు విలేకరులతో మాట్లాడారు. ఓటుకు కోట్లు కేసుకు చంద్రబాబు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని మండిపడ్డారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రం నుంచి బయటకు రావాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. -
అనంతపురం జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన
-
అనంతపురం జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన ఖరారు
అనంతపురం: అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సోమవారం ఖరారు అయింది. ఈ నెల 6 నుంచి నాలుగో విడత రైతు భరోసాయాత్ర ప్రారంభం కానున్నట్టు వైఎస్ఆర్సీపీ నేతలు శంకర్ నారాయణ, గుర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. ధర్మవరం, రాప్తాడు, కదిరి నియోజకవర్గాల్లో వైఎస్ జగన్ పర్యటిస్తారని వారు వెల్లడించారు. ఈ పర్యటనలో భాగంగా అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు, చేనేత, కార్మిక కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శిస్తారని వైఎస్సార్సీపీ నేతలు చెప్పారు. -
'త్వరలోనే రాజన్న రాజ్యం సిద్ధిస్తుంది'
అనంతపురం: ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభంజనం ఖాయమని వైఎస్ఆర్సీపీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. అనంతపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున పోటీ చేసిన అభ్యర్థులు శంకర్‌నారాయణ, కాపు రామచంద్రారెడ్డి, తొపదుర్తి ప్రకాశ్‌రెడ్డి, గుర్నాథ్రెడ్డిలు మాట్లాడుతూ.. త్వరలోనే రాజన్న రాజ్యం సిద్ధిస్తుంది అని అన్నారు. వైఎస్ జగన్ నాయకత్వంలో రాష్ట్రంలోని తాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని వారు తెలిపారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఉచిత హామీలను ప్రజలు నమ్మలేదన్నారు. అవాస్తవాలకు, అబద్ధాలకు చిరునామా చంద్రబాబు గుర్నాథ్రెడ్డి విమర్శించారు. -
హత్యా రాజకీయాలు చేసింది చంద్రబాబే: గుర్నాథ్రెడ్డి
రాష్ట్ర విభజన విషయంలో చంద్రబాబు నాయుడు ఒక మాటపై నిలబడటం లేదని, రెండు కళ్ల సిద్ధాంతంతో అసెంబ్లీని గందరగోళంలోకి నెట్టారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి విమర్శించారు. తాను కేవలం తమ జిల్లాకు సంబంధించిన అభివృద్ధి పనుల గురించి చర్చించేందుకే గంటా శ్రీనివాస్‌ను కలిశానని, దీనిపై మీడియా దుష్ప్రచారం విచారకరమని గుర్నాథ్రెడ్డి అన్నారు. రాజకీయ హత్యలకు పాల్పడిన వ్యక్తి చంద్రబాబేనని, వంగవీటి మోహన రంగాను హత్య చేయించింది టీడీపీ, చంద్రబాబు నాయుడు కాదా అని నిలదీశారు. అనంతపురంలో ఊచకోతలు కోయించిన పార్టీ టీడీపీ కాదా, కాలేజీ రోజుల నుంచి హత్యా రాజకీయాలకు దిగిన వ్యక్తి చంద్రబాబని గుర్నాథ్రెడ్డి మండిపడ్డారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి ఆయనను హతమార్చి ముఖ్యమంత్రి అయ్యారని, ప్రజల గుండెను చీల్చిన వ్యక్తి చంద్రబాబుని తీవ్రస్థాయిలో విమర్శించారు. -
'త్వరలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు టూలెట్ బోర్డు ఖాయం'
అనంతపురం:ఎల్లో మీడియా విషం తమ దైన శైలిలో విషం కక్కుతూ వైఎస్సార్ సీపీపై తప్పుడు కథనాలను ప్రచారం చేస్తోందని ఆ పార్టీ ఎమ్మెల్యేలు విమర్శించారు. వైఎస్సార్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలుస్తున్నారని అసత్య ప్రచారానికి దిగుతోందని గుర్నాథ్ రెడ్డి, కాపు రామ చంద్రారెడ్డిలు మండిపడ్డారు. ఎల్లో మీడియా విష ప్రచారంపై శుక్రవారం వారు మీడియాతో మాట్లాడారు. త్వరలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు టూలెట్ బోర్డు ఖాయమని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు ఎద్దేవా చేశారు. వైఎస్సార్ సీపీ అద్యక్షుడు జగన్మోహనరెడ్డి ప్రజాదరణ చూసి కాంగ్రెస్, టీడీపీలు ఓర్వలేకపోతున్నాయన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన నల్లధనాన్ని ఎల్లో మీడియాలో దాచి పెట్టి తెర వెనుక డ్రామాను ఆసక్తికరంగా నడిపిస్తున్నారన్నారు. చంద్రబాబు నాయుడు సమైక్యవాదో..?విభజన వాదో తేల్చాలని వారు డిమాండ్ చేశారు. -
న్యాయవాదులపై దాడిని ఖండించిన వైఎస్సార్సీపీ
హైదరాబాద్: ఏపీఎన్జీవో కార్యాలయంలో సీమాంధ్ర న్యాయవాదులపై దాడి జరగడాన్ని వైఎస్సార్సీపీ ఖండించింది. ఇటువంటి దాడులు ప్రజల మధ్య విద్వేషాల్ని పెంచడానికి తప్ప..సమస్యల పరిష్కారానికి కాదని ఆ పార్టీ ఎమ్మెల్యే గుర్నానాథ్ రెడ్డి తెలిపారు. న్యాయవాదులపై దాడిని ఖండిచిన ఆయన మీడియాతో మాట్లాడారు. న్యాయాన్ని..రాజ్యాంగాన్ని కాపాడవలసిన న్యాయవాదులే ఇలా దాడులకు దిగడం సరికాదన్నారు. ఇటువంటి ఘటనలు ప్రజల మధ్య విద్వేషాల్ని పెంచుతాయని ఆయన విమర్శించారు. -
‘విభజన రాజకీయ లబ్ధికే’..
రాయదుర్గం, న్యూస్‌లైన్: రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్, టీడీపీలు విభజన నిర్ణయం తీసుకున్నాయని వైఎస్సార్సీపీ అనంతపురం ఎమ్మెల్యే గురునాథరెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్ విజయమ్మ చేపట్టిన సమర దీక్షకు మద్దతుగా నాలుగు రోజులుగా రాయదుర్గంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న కాపు భారతిని గురువారం ఆయన పరామర్శించి, సంఘీభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష నిర్ణయంతో రాష్ట్రం అతలాకుతలమైందని ధ్వజమెత్తారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ జగన్‌కు ప్రజల్లో లభిస్తున్న ఆదరణ తట్టుకోలేక విభజన నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. ఈ అనైతిక చర్యకు టీడీపీ మద్దతు ఇవ్వడం దారుణమన్నారు. అసమర్థ ముఖ్యమంత్రితోపాటు, కాంగ్రెస్ ఎంపీలు, మంత్రులు పదవులకు, పార్టీ సభ్యత్వాలకు రాజీనామా చేయాలని కోరారు. విదేశీ మహిళ కారణంగానే నేడు ఈ పరిస్థితి నెలకొందన్నారు.పాకిస్థాన్, చైనాలు దేశంలో చొరబడి సైనికులను చంపుతున్నా పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా కాంగ్రెస్ తీసుకున్న విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజీనామా చేయండి: విశ్వేశ్వర రెడ్డి ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తున్నట్లైతే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలు, మంత్రులు తక్షణమే రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు వై.విశ్వేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాయదుర్గంలో కాపు భారతి ఆమరణ నిరాహారదీక్షకు సంఘీభావం వ్యక్తం చేస్తూ విశ్వేశ్వరరెడ్డి ప్రసంగించారు. ఆరు నెలల్లో ఎన్నికలు రానుండగా రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ ఐదు ఎంపీ సీట్లు కూడ గెలిచే అవకాశం లేకపోవడంతో విభజన నిర్ణయం ప్రకటించారని విమర్శించారు. సమైక్యాంధ్ర కోరుతున్న ఎంపీలు, మంత్రులు ఎందుకు రాజీనామా చేయడం లేదని ప్రశ్నించారు. ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తే తక్షణమే రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలని డిమాండ్ చేశారు. మరోవైపు చంద్రబాబునాయుడు తన విభజన నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని చెబుతున్నారని, లేఖకు కట్టుబడి ఉంటే ఆపార్టీకి చెందిన నాయకులు, ఎమ్మెల్యేలు ఎందుకు దీక్షలు, ర్యాలీలు చేస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబును ధిక్కరించినట్లైతే ఆ పార్టీలో ఎందుకు కొనసాగుతున్నారని నాయకులను ప్రశ్నించారు. చిత్తశుద్ధి ఉంటే టీడీపీ కార్యాలయం ముందు దీక్షలు చేయాలని సూచించారు. తమ పార్టీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు సమైక్యాంధ్రకు కట్టుబడి రాజీనామాలు చేశారని తెలిపారు. విభజన వద్దని చంద్రబాబుతో లేఖ ఇప్పించండి: శంకర్‌నారాయణ విభజన వద్దని చంద్రబాబుతో కేంద్రానికి లేఖ ఇప్పించాలని ైవైఎస్సార్ సీపీ జిల్లా అడ్‌హక్ కన్వీనర్ శంకరనారాయణ టీడీపీ నాయకులకు సూచించారు. కాపు భారతి ఆమరణ నిరాహార దీక్ష శిబిరంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ విజయమ్మను ప్రశ్నించే అర్హత పయ్యావుల కేశవ్‌కు లేదన్నారు. చంద్రబాబు లేఖ ఇస్తే విభజన ఆగుతుందని అందరికీ తెలుసునని, ఇకనైనా టీడీపీ నాయకులు డ్రామాలు కట్టిపెట్టాలని కోరారు. ఆత్మగౌరవం పేరిట యాత్ర చేస్తానని చంద్రబాబు తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టాడని మండిపడ్డారు. రాయలతెలంగాణా పేరుతో రాయలసీమను చీల్చే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. విజయమ్మకు మద్దతుగా దీక్ష చేస్తున్న కాపు భారతికి అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, పేర్మి బాలాజీ, లింగాల రమేష్, మాధవరెడ్డి, జిల్లా బుజ్జిరెడ్డి, మహేష్, దిలావర్‌బాష, జగన్నాథ్,రూరల్ కన్వీనర్ మల్లికార్జున, ఉపేంద్రరెడ్డి, మీసాల రంగన్న, శరత్‌చంద్రారెడ్డి, కదలిక ఎడిటర్ ఇమామ్, లింగాల రమేష్, ఓబుళపతి, ఆశోక్ కుమార్ పాల్గొన్నారు. -
'టీడీపీకి సమైక్య ఉద్యమం చేసే అర్హత లేదు'
కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు గురునాథ్‌రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి ఆరోపించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా చంద్రబాబు లేఖ ఇచ్చారని, టీడీపీ ఎమ్మెల్యేలకు సమైక్య ఉద్యమం చేసే అర్హత లేదని వారు పేర్కొన్నారు. సమైక్య ఉద్యమాన్ని పోలీసులతో అణచివేయాలని చూస్తున్నారని వారు ఆరోపించారు. వైఎస్ఆర్ సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని అన్నారు. రెచ్చగొడితే ఉద్యమ రూపురేఖలు మారతాయని వారు హెచ్చరించారు. రాయల తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వై.విశ్వేశ్వరరెడ్డి, తోపుదుర్తి కవిత,శంకర్ నారాయణ చెప్పారు. రాయలసీమను విభజిస్తే ఊరుకునేది లేదని వారు స్పష్టం చేశారు. జగన్‌ను దెబ్బతీసేందుకు టీడీపీ, కాంగ్రెస్ డ్రామాలాడుతున్నాయని వారు ఆరోపించారు.