సీఎం చంద్రబాబు, వెంకయ్య ఏపీ ద్రోహులు' అని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఏపీ ద్రోహులు' అని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి, శంకర్‌నారాయణ, గుర్నాథ్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం అనంతపురంలో వారు విలేకరులతో మాట్లాడారు. ఓటుకు కోట్లు కేసుకు చంద్రబాబు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని మండిపడ్డారు.
చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రం నుంచి బయటకు రావాలని డిమాండ్ చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.